cross

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, or across అడ్డముగా. క్రియ, విశేషణం, అడ్డమాడుట, అడ్డగించుట, విఘ్నము చేసుట, యెదిరించుట.

  • to cross awall గోడ యెక్కి దిగుట.
  • he crossed his arms చేతులు కట్టుకొన్నాడు.
  • a thought crossedme నాకు ఒక మాట తోచినది.
  • the bridge that crosses the river ఆ యేటికి కట్టివుండే వారధి.
  • they crossed the river ఆ యేటికి దాటినారు.
  • draw a line and cross it ఒకనిడుపు గీత గీచి దానిమీద ఒక అడ్డగీత వేయు.
  • he has not crossed a horse this monthయీ నెలలో వాడు గుర్రము మీద యెక్కనే లేదు.
  • to cross out writing పాటా గొట్టుట,గీచివేసుట, కొట్టివేయుట.
  • to cross over దాటుట, తప్పించుట.

విశేషణం, transverse అడ్డమైన.

  • a cross beam అడ్డదూలము.
  • a cross road అడ్డముగావచ్చే దోవ.
  • to sit cross legged పద్మాసనము వేసుకొని కూర్చుండుట.
  • a cross line worn byHIndus on the forehead అడ్డబొట్టు.
  • or adverse ప్రతికూలమైన, విరుద్ధమైన.
  • as matters went cross కార్యము ప్రతికూలమైనందున.
  • cross wind యెదురుగాలి.
  • or peevishచిరాకుగా వుండే, చిరచిరలాడే.
  • a cross face క్రూరమైన ముఖము.
  • a cross letter క్రూరమైనజాబు.
  • or contradictory విరోధమైన.
  • a cross suit యెదురు వ్యాజ్యము.
  • a crossexamination యెదురు సవాలు వేసి అడగడము.
  • a cross breed in horses &cసంకరజాతి, మిశ్రజాతి.
  • cross reading పజ్ఞ్తిబేధముగా చదవడము.

నామవాచకం, s, the literal sense, of crucifixion (A+ and C+ use the Latin word spelt క్రుశం krusam) F+ and G+ says శిలువమాను H+ says మరణస్తంభము.

  • a thief exposed on the cross కొరతను వేసిన దొంగ.
  • a gold cross స్త్రీలువేసుకొనే శిలువవలె వుండే ఆభరణము.
  • the wars between the crescent and thecross తురకలకు కిరస్తు వాండ్లకు జరిగిన యుద్ధములు.
  • metaphorically grief, affliction(A+ and C+ use కూశము the same word) శిలువను యెత్తుకోవడము.
  • thewickedness of his children was a great cross to him కడుపున పుట్టిన బిడ్డలుదుష్టులుగా వుండడమే వాడికి మంచి శాస్తి.
  • a mark in writing or printing అనగా +యీ గురుతు.
  • a mule is a cross between the horse and the ass గుర్రానికిన్నిగాడిదెకున్ను పుట్టినది కంచరగాడిదె.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cross&oldid=927857" నుండి వెలికితీశారు