light

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, తేలికైన, చులకనైన, లాఘవమైన, సులభమైన, వెలుతురుగల.

  • the antelope is light of foot జింకకు నడుచురుకు.
  • light-coloured లేచాయగల, నీరుచాయగల.
  • light-green నీరుపచ్చ, లేబచ్చ.
  • light-blue విడినీలి.
  • light-red నీరుకావి యైన.
  • a native of light- complexion చాయనిచాయగా వుండవాడు.
  • a light- hearted man ఉల్లాసము గా వుండేవాడు.
  • Is this a lightmatter ? ఇది స్వల్పమా.
  • a light task సులభమైనవని.
  • this is but a light objection ఇది స్వల్పమైన ఆక్షేపణ.
  • a light box తేలికైనపెట్టె.
  • a light coin తూనిక తక్కువగా వుండే నాణ్యము.
  • a light room వెలుతురు గా వుండే యిల్లు.
  • a light man అల్పుడు, చపలుడు.
  • a light minded manచపలచిత్తుడు.
  • a light woman చపలురాలు, రంకులాడి, విటకత్తె.
  • a light- heeled woman రంకులాడి.
  • light dragoons వౌకవిధమైన గుర్రపు రౌతు లు.
  • they hold his commands light అతని ఆజ్ఞను అలక్ష్య పెట్టినారు.
  • he made light of his oath ప్రమాణమును అలక్ష్యముచేసినాడు.
  • they setlight by this దీన్ని అలక్ష్యము చేస్తారు.
  • To Light, v. a.
  • ముట్టించుట, వెలిగించుట, రాజబెట్టుట, మంటవేసుట.
  • he lighted a lamp దీపము ముట్టించినాడు.
  • he lighted the fire నిప్పు ను రాజబెట్టినాడు.
  • he lighted me into the room ఇంట్లోకి పోవడానికి నాకు వెలుతురు చూపినాడు.
  • he lighted up his house వాడి యింట్లోచాలా దీపాలు వెలిగించినాడు.
  • her face was lighted up with smiles దాని ముఖము చిరునవ్వుతో ప్రకాశించినది.
  • a fare lighted up with cheerfulness సంతోషముతో ప్రకాశించే ముఖము.

నామవాచకం, s, వెలుతురు, ప్రకాశము, కాంతి.

  • bring me a light దీపము తీసుకరా,దివిటి తీసుకరా, నిప్పు తీసుకరా.
  • he put out the light దీపము ఆర్చినాడు.
  • light of the sun or sun-light ఎండ.
  • he arose with the light తెల్లవారి లేచినాడు.
  • light of the moon or moonlight వెన్నెల.
  • day-light పగలు.
  • blue-light మత్తాపు, పగలువత్తి.
  • his threw light upon the matter ఇందువల్ల అది విశదమైనది.
  • he first saw the light here, or, he sprung to light here వాడుపుట్టినది యిక్కడ.
  • his book never saw the light వాడి గ్రంథము నెరవేరలేదు.
  • Johnson was a light of his age ఆయన ఆ కాలములో ప్రసిద్ధుడు.
  • through the light of his countenanceఆయన మూర్తివంతంవల్ల.
  • the light of his eyes is gone form him వాడికి దృష్టితప్పినది.
  • if you view the temple in this light it is handsome ఆ గుడిని యీ పక్కనుంచి చూస్తే అందముగా వున్నది.
  • I took the matter in another light దాన్ని నేను వేరేగా భావిస్తిని.
  • they look upon him in light of a father వాణ్ని తండ్రిగా భావిస్తారు.
  • In this lightఈ భావమందు.
  • he has put the question in a wrong light దానికి అపార్థము చేసినాడు.
  • In every light it is wrong ఇది అన్నివిధాల తప్పు .
  • be brought the matter to light వాడుఆ సంగతిని బయిట పెట్టినాడు, ఆ గుట్టు బయటవచ్చినది.
  • at last the truth came to light తుదకు నిజము బయటపడ్డది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=light&oldid=936807" నుండి వెలికితీశారు