strain

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, to purify by filtration వడికట్టుట, వడియకట్టుట, వస్త్రఘాలితము చేసుట.

  • to strain water from impuritiesనీళ్ళను వడికట్టుట.
  • to strain off the water from boiled rice అన్నము వార్చుట.
  • rice that is strained till dry వడియవేసినబియ్యము, వార్చిన అన్నము.
  • he strained the rope till it broke ఆ దారము తెగేటట్టుగా బలముగా పట్టిలాగినాడు.
  • he strained the eyes to read books written on palm leaves తాటాకు పుస్తకాలు చదవడము కంటికి వుపద్రవముగా వుంటున్నది.
  • we strained our eyes to see it అది కంటికి అగుపడి అగుపడకుండా పోయినది.
  • my eyes were strained in reading this దీన్ని చదవడమువల్ల నా కంటికి వుపద్రవము వచ్చినది.
  • he strained his hand వాని చెయ్యి బెణికినది.
  • he had strained his neck వాని మెడ యిరుకు పట్టుకొన్నది.
  • he strained his voice అరిచినందున వాని గొంతు పగిలినది.
  • వాని గొంతు కమ్మినదివాని గొంతు రాసినది.
  • he strained his lungs నిండా అరిచినాడు.
  • the judge should never strain the law to gratify himself న్యాయాధిపతిగా వుండేవాడుతన యిష్టప్రకారము చేయడమునకై చట్టమునకు అపార్థము చేయరాదు.
  • this is a strained meaning of the word యిది సహజమైన అర్దము కాదు, యిది నిండపీకులాడి చేసిన అర్థము.

క్రియ, నామవాచకం, బలవంతము చేసుట, తొందర పడుట.

  • he strained to the utmost to get over the difficulty యీ తొందరను సాధించడమునకై తన యావచ్ఛక్తిని చూచినాడు.
  • he strained to speak but he could not వాడు యెంతోతొందరపడి మాట్లాడబోతే వాడికి మాట్లాడ కూడలేదు.
  • to strain at stool తినుకుట,ముక్కుట.
  • Strain, n. s.
  • an injury by too much violence బెణుకు, యిలుకు.
  • he spoke in a flattering strain స్త్రోత్రరసముగా మాట్లాడినాడు.
  • race; generation వంశము.
  • those of the royal strain రాజవంశస్థులు.
  • disposition, manner రసము.
  • song; note; sound గానము, స్వరము.
  • turn; tendency భావము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=strain&oldid=482000" నుండి వెలికితీశారు