అట్ఠంగిక మగ్గ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

బౌద్ధం.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అష్టాంగ మార్గం నిర్వాణం చేర్చే బౌద్ధ మార్గం. ఇందులో ఎనిమిది అంశాలు ఉన్నాయి. బుద్ధుడు చేసిన తొలి ఉపదేశాలలో ఒకటిగా ఇది ప్రసిద్ధం. గౌతముడు జ్ఞానిగా పరిణామం చెంది, సారనాధ్‌ చేరి, అక్కడ పూర్వం తనతో తపస్సు చేసిన ఐదుగురు పరివ్రాజకులకు మొదటి సారిగా చేసిన ధర్మబోధలో ఇది భాగం. 1. సమ్మా దిట్ఠి (సమ్యక్‌ దృష్టి), 2. సమ్మా సంకప్ప (సమ్యక్‌ సంకల్పం), 3. సమ్మా వాచా (సమ్యక్‌ వాక్కు), 4. సమ్మా కమ్మంత (సమ్యక్‌ కర్మ), 5. సమ్మా ఆజీవ (సమ్యక్‌ ఆజీవిక), 6. సమ్మా వాయామ (సమ్యక్‌ కృషి), 7. సమ్మా సతి (సమ్యక్‌ స్మృతి), 8. సమ్మా సమాధి (సమ్యక్‌ సమాధి). ఈ ఎనిమిది అంగాలతో కూడిన మార్గం అత్యున్నత స్థితిని (నిర్వాణాన్ని) పొందడానికి ఉపయోగపడేది. సమ్మా దిట్ఠి (సమ్యక్‌ దృష్టి). బాధలకు, వాటి నివారణకు సంబంధించిన పరమ సత్యాలను తెలుసు కొన లేకపోవడం అవిద్య. దానిని నిర్మూలించడం సమ్యక్‌ దృష్టి. మిచ్ఛా దిట్ఠి (మిధ్యా దృష్టి) కానిది సమ్మ దిట్ఠి. అంటే నాలుగు ఆర్య సత్యాల జ్ఞానం సంపాదించి ఉండటం. సమ్యక్‌ సంకల్పం అంటే సదాశయాలను కలిగి ఉండటం, సదాలోచనలు చేయడం. వస్తువుల యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం వల్ల ఇంద్రియ సుఖాల పట్ల విముఖత, ఎవరికీ హాని చేయకూడదనే వైఖరి, ద్వేష భావాన్ని తొలగించుకోవడం మొదలైన మంచి ఆలోచనలు కలగడం. సమ్యక్‌ వాక్కు అంటే సత్యం పలకడం, అబద్ధాలు చెప్పకుండా ఉండటం, ఇతరులను గురించి చెడ్డగా మాట్లాడక పోవడం, దయతో, మర్యాద పూర్వకంగా మాట్లాడటం. సమ్యక్‌ కర్మ అంటే సాటివారి మనోభావాల పట్ల, హక్కుల పట్ల గౌరవంతో ప్రవర్తించడం. జీవ హింస చేయకపోవడం మొదలైనవి కూడా ఇందులో చేరతాయి. సమ్యక్‌ జీవనం అంటే ఏ జీవికీ హాని కలిగించని వృత్తిని ఏదైనా జీవిక కోసం చేయడం. సమ్యక్‌ కృషి అంటే అవిద్యను తొలగించడానికి తొలి అడుగులు వేయడం. సమ్యక్‌ కృషికి నాలుగు ప్రయోజనాలను బుద్ధుడు చెప్పాడు. అవి: అష్టాంగమార్గానికి విరుద్ధమైన మానసికి స్థితులు కలగకుండా చూసుకోవడం. అలాంటి మానసిక స్థితులు ఇదివరకే ఏర్పడి ఉంటే వాటిని తొలగించు కోవడం. అష్టాంగ మార్గానికి ఏవి అవసరమో అట్టి మానసిక స్థితులు కలిగేలా చూడటం. ఇప్పటికే అట్టి మానసిక స్థితులు కలగి ఉంటే అవి మరింత వృద్ధి పొందడానికి దోహదం చేయడం. చెడ్డ భావనలు పెడదోవ పట్టించకుండా నిరంతరం మనస్సును జాగరితం చేసి ఉంచడం సమ్యక్‌ స్మృతి. అంటే శరీరాన్నీ, మనస్సునూ నిరంతరం జాగ్రతగా గమనిస్తూ, దుఃఖం కలిగించే పరిస్థితులు రాకుండా చూడటం. సమ్యక్‌ సమాధి అంటే ఏకాగ్రతను మించిన సమాధి స్థితి. సమాధిలో కేవలం మనస్సు ఏకాగ్ర స్థితిని చేరడమే జరుగుతుంది. దురాశ, ద్వేషం, అచేతనంగా, మందంగా ఉండటం, సందేహించడం, ఎటూ తేల్చుకొనలేకపోవడం అనే ఐదు సంకెళ్లను తెంచుకొని సరైన మార్గంలో నడచుకోవడం సమ్యక్‌ సమాధి. ధ్యానం చేసే సమయంలో ఈ సంకెళ్లు బాధించకపోవచ్చునుగానీ, ధ్యానంలో నుంచి బయటికి వచ్చిన తరువాత తిరిగి ఇవే మానసిక సంకెళ్లు పురోగమనానికి అడ్డం వస్తాయి. దుర్గుణాల నుంచి విముక్తుడు కావడం కూడా సమ్యక్‌ సమాధి సాధించే ఒక ప్రయోజనం.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]