అధికరణసిద్ధాన్తన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒక సిద్ధాంతమునందు మఱొకడంతర్భూతమైయుండునట్లు. ఒకవిషయము నొకవిధముగా సిద్ధాంతీకరించుకొని దానిపై మఱల నింకొకరకమున నూహాపోహలు సేయుట అని న్యాయాశయము. సిద్ధాంతము నాలుగు విధములు-(1) సర్వతంత్రసిద్ధాంతము. (2) ప్రతితంత్రసిద్ధాంతము.(3) అధికరణసిద్ధాంతము. (4) అభ్యుపగమసిద్ధాంతము. 1. సర్వసామాన్యముగ వర్తించునది సర్వతంత్రసిద్ధాంతము 2. కొందఱచేమాత్ర ముపయోగింపబడునది ప్రతితంత్ర సిద్ధాంతము 3. ఊహాపోహలతో ఉండునది అధికరణసిద్ధాంతము 4. వ్యతిరేక సిద్ధాంత మభ్యుపగమసిద్ధాంతము. వ్యతిరేకమన- ఒక వాక్యమును చెప్పి తద్వ్యతిరేక వాక్యముచే మొదటివాక్యమందలి సిద్ధాంతమునే నుడువుట. ఎట్లన- నీచాచారపరుడు నీచయోనులను బొందును; తదితరుఁడు అనఁగా నీచాచారపరుఁడు కానివాడు నీచయోనులను పొందఁడు అన్నట్లు. ఇందు రెండవది వ్యతిరేక వాక్యము. రెండువాక్యముల తాత్పర్యము నొక్కటియే. (మొదటిదానికి వ్యతిరేకము రెండవది; రెండవదానికి వ్యతిరేకము మొదటిది.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939