అశ్వత్థామ

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • కృపి, ద్రోణుల పుత్రుడైన అశ్వత్థామ పుట్టగానే ఉచ్చైశ్శ్రవం (గుర్రం)లా సకిలించాడట. అందుకే అతనికి అశ్శ్వత్థామ అనే పేరు స్థిరపడిందట.
  • గుర్రము వలె సామర్ధ్యము/బలము కలవాడు,
  1. ఇతడు సప్తచిరంజీవులలో ఒకడు. సప్తచిరంజీవులు. వీరు..... 1. అశ్వత్థామ, 2. బలిచక్రవర్తి. 3. వ్వాసమహర్షి. 4. హనుమంతుడు. 5. విభీషణుడు. 6. కృపాచార్యుడు. 7. పరశురాముడు.
  • ద్రోణుని కొడుకు. ఇతని తల్లి కృపి. ఇతడు చిరంజీవి; భారతయుద్ధమున కడపటినాటిరేయి పాండవుల శిబిరము చొచ్చి నిద్రించువారలను అందఱను దయలేక హత్యచేసెను. అందు ద్రౌపదీపుత్రులైన ఉపపాండవులు ఏవురు చచ్చిరి. అందునిమిత్తము ఈతడు అర్జునునిచే వెనుక అవమానింపబడెను. ఇతడు బాలవధ చేసినందులకై వ్యాసునిచే దుర్గంద రక్త దిగ్ధ దేహుండు అగునట్లు శపింపబడెను. పాండవులమీది క్రోధముచే ఇతడు లోకమునందు ఎక్కడ పాండవులు అను పేరులేక ఉండునట్లు ఒక యస్త్రము ప్రయోగింపగా, అది ఉత్తర గర్భమందు ఉన్నయభిమన్యుని కొడుకు అగు పరీక్షిత్తుని దహింపను ఆరంభించెను; అపుడు పరీక్షిత్తు నాశము ఒందకుండునట్లు శ్రీకృష్ణుడు రక్షించెను. ఇతడు కామక్రోధాదుల యంశమున జనించినవాడు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]