అష్టాదశదోషములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామ వాచకము - బహువచనము

వ్యుత్పత్తి

ఎనిమిది విధములైన దోషములు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • (అ.) 1. క్షుధ, 2. పిపాస, 3. భయము, 4. ద్వేషము, 5. రాగము, 6. మోహము, 7. చింత, 8. జర, 9. రోగము, 10. మృత్యువు, 11. భేదము, 12. స్వేదము, 13. మదము, 14. అరతి, 15. విస్మయము, 16. జన్మ, 17. నిద్ర, 18. విషాదము [ఇవి దిగంబర సంప్రదాయమున ఆర్హతులకు కూడని దోషములు].
  • (ఆ.) 1. వీర్యాంతరాయము, 2. భోగాంతరాయము, 3. ఉపభోగాంతరాయము, 4. దానాంతరాయము, 5. లాభాంతరాయము, 6. నిద్ర, 7. భయము, 8. అజ్ఞానము, 9. జుగుప్స, 10. హాస్యము, 11. రతి, 12. అరతి, 13. రాగము, 14. ద్వేషము, 15. అవిరతి, 16. కామము, 17. శోకము, 18. మిథ్యాత్వము [ఇవి శ్వేతాంబర సంప్రదాయమున ఆర్హతులకు కూడనివి].
  • (ఇ.) 1. లోకద్వేషము, 2. ప్రాతికూల్యము, 3. అభ్యసూయ, 4. అసత్యవాక్కు, 5. కామము, 6. క్రోధము, 7. పారతంత్ర్యము, 8. పరివాదము, 9. పిశునత, 10. అర్థహాని, 11. వివాదము, 12. మాత్సర్యము, 13. ప్రాణిపీడనము, 14. ఈర్ష్య, 15. మోదము, 16. అతివాదము, 17. సంజ్ఞానాశము, 18. అభ్యసూయత [ఇవి మదమువలన కలుగు దోషములు] [మహాభారతము 5-45-9]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]