అస్థూలారుంధతీన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అరుంధతీ నక్షత్రం చాలా చిన్నది. వధూవరులకు దాన్ని చూపించేప్పుడు అది వెంటనే కనబడదు. అందుచేత మొదట చంద్రుణ్ణి చూపించి, చంద్రునికి దగ్గరగా ఉండి స్పష్టంగా కనబడే నక్షత్రాలను చూపించి, తరువాత వాటికి దగ్గరగా ఉండే సప్తర్షులనే నక్షత్రాలను చూపించి, వాటిలోని వశిష్ఠనక్షత్రాన్ని చూపించి, దానిప్రక్కన ఉన్న చిన్న నక్షత్రమే అరుంధతి అని చెపుతారు.అట్లే ఈ ఇల్లు, భార్యాపుత్రులు మొదలైనవారే నేను అని తలచి ఆ గృహాదులు నష్టమైతే తానుకూడా నశించినట్లు ఏద్చేవానికి బోధపరచడం కోసం 'ఆత్మా వై జాయతే పుత్రః' అని మొదట చెప్పి, తరువాత 'స ఏష పురుషో అన్నరసమయః' అని చెప్పి, తరువాత 'అన్యోంతరాత్మా ప్రాణమయః' అని చెప్పి, తరువాత 'అన్యోంతరాత్మా మనోమయః' అని చెప్పి, తరువాత 'అన్యోంతరాత్మా విజ్ఞానమయః' అని చెప్పి, తరువాత 'అన్యోంతరాత్మా‌ఽఽనందమయః' అని యీ రీతిగా అంతకంతకూ పుత్రులు, అన్నం, ప్రాణం, మనస్సు, విజ్ఞానం, ఆనందం- ఈ మొదలైనవేవో అవి ఆత్మకాదు అనే తత్వాన్ని శ్రుతులు తెలుపుతున్నాయి. ------------ సంస్కృతన్యాయదీపిక (రవ్వా శ్రీహరి) 2006

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]