ఎగ్నాస్టిసిజం

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

(ఎగ్నాస్టిసిజం.) దేవుడు ఉన్నాడో లేడో చెప్పడానికి కావలసిన ఆధారాలు లేవు కనుక ఎటూ తేల్చి చెప్పలేమనే సిద్ధాంతం. ఈ పదాన్ని మొదట ఉపయోగించిన వ్యక్తి థామస్‌ హెన్రీ హక్స్‌లీ (1825-95). ఆయన జీవ శాస్త్రజ్ఞుడు. (థామస్‌ హెన్రీకి ప్రసిద్ధ ఇంగ్లీషు నవలా రచయిత ఆల్డస్‌ హక్స్‌లీ సొంత మనుమడు.) మెటాఫిజికల్‌ సొసైటీలో మాట్లాడుతూ బైబిల్‌ న్యూటెస్టమెంట్‌ లోని The Acts 17వ అధ్యాయం 23వ వచనాన్ని ప్రస్తావించి ‘ఎగ్నాస్టిసిజం’ పదాన్ని వాడాడు. ఏథెన్స్‌ పౌరులను ఉద్దేశించి పాల్‌ ఇలా అన్నట్లు ఈ వచనంలో ఉంది. ‘‘For as I passed by, and beheld your devotions, I found an altar with this inscription, TO THE UNKNOWN GOD. Whom therefore ye ignorantly worship, him declare I unto you.’’ ఈ వాక్యాన్ని ప్రస్తావించి, థామస్‌ హెన్రీ హక్స్‌లీ మొదటి సారిగా తెలియని దేవుడు అనే భావనను ఎగ్నాస్టిసిజం అన్నారు. నాస్తికత్వం గురించి గానీ, ఆస్తికత్వం గురించి గానీ తప్పో ఒప్పో ఇదమిత్థంగా చెప్పలేక పోవడం ఎగ్నాస్టిసిజం. ఇలా భావించేవారిని ‘ఎగ్నాస్టిక్స్‌’ అంటారు. (అగ్నాస్టిక్‌ అని కూడా కొందరు పలుకుతారు.) మనిషికి అంతుపట్టని ఒక దివ్య శక్తి ఉన్నదా అనేది ఎడతెగని చర్చ ‘‘ఇది పరిష్కారం కాలేకపోవడమే కాదు, ఇక ముందు పరిష్కారం కాదు కూడా’’ అని ఈ వాదం చేసే వారు అంటారు. ఎగ్నాస్టిక్‌ అనే పదానికి మొదట కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు 1936లో ప్రచురించిన తమ ‘’పారిభాషిక పదకోశము’లో తెలుగు సమానార్థకాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు. దైవం తెలియడానికి సాధ్యం కానిది (అజ్ఞేయం) కనుక ఎగ్నాస్టిసిజాన్ని ‘అజ్ఞేయతావాదం’ అన్నారు. తెలియడం సాధ్యం కాదనే భావన ప్రకారం ఇది సరైన అర్థమే. ఐతే, 21వ శతాబ్ది ప్రారంభం అవుతున్న దశలో దేవుడు ఉన్నాడో లేడో ఇప్పుడున్న ఆధారాలను బట్టి చెప్పలేము కనుక ‘ఇప్పుడు’ ఎటూ చెప్పలేమనే వాదం ఒకటి బయల్దేరింది. అంటే, ఒక అనిశ్చిత పరిస్థితిని ఇది సూచిస్తున్నది. కనుక అజ్ఞేయతా వాదం అనే పదబంధం సరిపోవడం లేదు. ‘అనిశ్చితి’ అనే భావన కూడా జతపడితేనే గానీ సమానార్థకం సరిపోదు. ఏమైనప్పటికీ, ఎగ్నాస్టిసిజం ఇప్పుడు స్థిరంగా కొన్ని వర్గాలలో ఉంది. ఎగ్నాస్టికుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]