ఐరావతము
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

- భాషాభాగము
- నామవాచకము.సం.వి
- వ్యుత్పత్తి
- వ్యు. ఇరాః = జలాని భూమ్నా సంత్యత్ర-ఇరావాన్ = సముద్రః. ఇరావతిభవః ఇరావత్ + అణ్. (త.ప్ర.) ఇరావంత మనఁగా సముద్రము. అందు పుట్టినది. క్షీరసముద్ర మథన సమయమున అందుండి పుట్టిన వెల్లయేనుఁగు. దీనిని మహేంద్రుఁడు గ్రహించెను.
- ఏక వచనం
అర్ధ వివరణ[<small>మార్చు</small>]
- హిందూ పురాణాల ప్రకారం ఐరావతం అంటే ఇంద్రుడి ఏనుగు. ఇది తెల్లగా ఉంటుంది. పాలసముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మిదేవి, కల్పవృక్షం, కామధేనువులతో పాటు ఐరావతం ఉద్భవించినట్లు పౌరాణిక గాధ.
- ఎంతో శ్రమ, డబ్బు, సమయం వెచ్చించి చేసిన పని అనుకున్న ఫలితాన్ని ఇవ్వని సందర్భంలో సదరు పనిని ఐరావతంగా/తెల్ల ఏనుగుగా అభివర్ణించడం కద్దు.
ఉదాహరణ: ఎంతో ఖర్చు పెట్టి పురపాలక సంఘం దిగుమతి చేసుకున్న రోడ్లు ఊడ్చే యంత్రం మన పరిస్థితులకు అనుగుణంగా పని చెయ్యలేక పోయి ఐరావతం లాగా తయారయింది.
- స్వర్గముననుండు ఏనుగు, లేక మేఘాధిష్ఠానమయిన యేనుగు, ఇంద్రుని యేనుగు.)
- ఇంద్రుని యేనుఁగు.
- . ఒకానొక సర్పము.
- . నారింజ†.
- . గజనిమ్మ†.
- . ఇరావతీనదీప్రాంత దేశము.
- వంపులేని ఇంద్రధనుస్సు.
- రక్తచందనము
- దేవయానము.
- అశ్విని మొదలు ఆశ్లేషవఱకునైన తొమ్మిది నక్షత్రముల గుంపు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్ధాలు
- వంపులేని నిడుపాటి యింద్రధనస్సు.
- ఒకానొక పాము
- మబ్బు మీద వచ్చెడి మబ్బు.
- నార దబ్బ
- నిమ్మ
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
*ఐరావతః పుండరీకో వామనః కుముదోఽఞ్జనః, పుష్పదంతః సార్వభౌమః సుప్రతీకశ్చ దిగ్గజాః