కాళిదాసుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కాళిదాసుడు ఒక సంస్కృతకవి. కాళికాదేవిని కొలిచి ఆదేవి యొక్క వరప్రసాదమును పొందినందున ఇతనికి ఈ పేరు కలిగెను. ఇతఁడు మిక్కిలి ప్రసిద్ధుఁడు. కవిసమయము చక్కగా తెలిసినవాఁడు. ఉపమానోపమేయములను పోల్చి చెప్పుటయందు మిక్కిలి సమర్ధుఁడు కాబట్టి ఇతఁడు చెప్పెడు ఉపమాలంకారము శ్లాఘింపఁ దగినదిగా ఉండును. కనుకనే "ఉపమా కాళిదాసస్య" అను వచనము లోకమునందు ప్రసిద్ధముగా వాడఁబడుచున్నది. మఱియు ఈమహాకవి విక్రమార్కుని ఆస్థానమునందలి కవులలో ఒకఁడై ఉండెను.

"శ్లో|| ధన్వంతరి క్షపణ కామరసింహశంకు, బేతాళభట్టిఘటఖర్ప కాళిదాసాః|, ఖ్యాతో వరాహమిహిరో నృపతేస్సభాయం, రత్నానివై వరరుచే ర్నవ విక్రమస్య|| " అను ఈ శ్లోకమునందు చెప్పఁబడిన చొప్పున ధన్వంతరి, క్షపణకుఁడు, అమరసింహుఁడు, శంకువు, బేతాళుఁడు, భట్టి, ఘటఖర్పరుఁడు, కాళిదాసుఁడు, వరాహమిహిరుఁడు అను కవులు తొమ్మండ్రును విక్రమార్కుని సభయందలి నవరత్నములు అని తెలియఁబడుచు ఉన్నది. శాకుంతలము, మాళవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయము అను నాటకములును, రఘువంశము, మేఘసందేశము, కుమారసంభవము అను కావ్యములును ఇతనిచే రచియింపఁ బడెను. ఇదిగాక భోజప్రబంధమువలన భోజరాజు యొక్క సభలోను ఒక కాళిదాసుఁడు ఉన్నట్టు తెలియవచ్చుచు ఉన్నది. ఇతఁడు సకల విషయములందును మొదటియాతనిని పోలినవాఁడు. ఒకానొక కాలమున భోజుని సభయందలి కవులలో ఒకఁడు అగు దండి అనువానికిని ఇతనికిని వివాదము కలిగి అప్పుడు సరస్వతిని ఆరాధించి మాయిరువురిలో కవి ఎవఁడో తెలుపవలయును అని ప్రార్థింపఁగా వారికి సరస్వతి ప్రత్యక్షమై "కవిర్దండీ కవిర్దండీ నసంశయః" అనఁగా కాళిదాసునికి కోపము వచ్చి "రండే అహం కః" అనఁగా "త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం నసంశయః" అని సరస్వతి చెప్పినందున ఈ కాళిదాసుఁడు సరస్వతి అవతారము అని చెప్పుదురు. ఈయన నళోదయము, శృంగార తిలకము, ప్రశ్నోత్తరమాల, కవికంఠ పాశము, కర్పూరమంజరి, భోజచంపువు అనెడు గ్రంథములను, శ్యామలా దండకమును రచియించెను. ఇందు కడపట ఉదహరించిన దండకము తనకు కాళికాదేవి ప్రత్యక్షము అయినప్పుడు చెప్పినది. ఇంతటి కవులు లోకములో మఱియెవరును కారు. కనుకనే, "పురా కవీనాం గణనాం ప్రసంగే, కనిష్ఠకాధిష్ఠితకాళిదాసా|, అద్యాపి తత్తుల్యకవే రభావా, దనామికా సార్థవతీ బభూవ|| " అని చెప్పఁబడి ఉన్నది. ఈతని విషయమై కట్టుకథలు అనేకములు ఉన్నవి. అయినను మీఁద ఉదహరించిన విషయములనుపట్టి కాళిదాసులు ఇరువురు అనియు వాస్తవము ఐన చరిత్రము ఇదియే అనియు ఊహింపవలసి ఉన్నది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]