కృష్ణాజినం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కృష్ణాజినం అనగా జింక చర్మం. నల్ల ఇఱ్ఱి (లేడి) చర్మం. యోగులు, సన్యాసులు, తాపసులు ఆసనంగా జింకచర్మాన్ని వాడతారు. ఈ చర్మంలో శుక్ల, కృష్ణ, బభ్రు వర్ణాలు ఉంటాయి. ఇవి ఋక్, యజుః, సామ వేదాల రూపాలని ఒక విశ్వాసం. ఈ విధంగా కృష్ణాజినం త్రయా విద్యా స్వరూపం. ఈ మూడు రూపాలు లోక త్రయ రూపాలని కూడా ఒక సిద్ధాంతం ఉంది. కృష్ణాజినాన్ని ధరించి యజ్ఞం చేసినందువల్ల యజమాని లోకత్రయ దీక్షితుడు. కృష్ణాజినం విూద కూర్చునే ముందు యజమాని ‘‘శర్మాసి- శర్మమే యచ్ఛ’’ అనే మంత్రం పఠించడం పద్ధతి. శర్మ అంటే సుఖం. ‘నీవు సుఖ రూపానివి. నాకు సుఖాన్ని ప్రసాదించు’ అని మంత్ర భావం. జింక చర్మం అంటామే గాని జింకలలో హరిణం, ఏణం, కురంగం మొదలైన ఎనిమిది జాతులు ఉన్నాయి. కృష్ణాజినానికి పవిత్రత ఎలా వచ్చిందో తెలియజేసే రెండు గాథలు వైదిక వాఙ్మయంలో కనిపిస్తాయి. 1. ప్రజాపతి అగ్నిచయనం చేసినప్పుడు అగ్ని అతి తీవ్రరూపుడై ఉద్భవించాడట. తీవ్రతను భరించలేకపోయిన దేవతలు అగ్నిని సవిూపించలేకపోయారట. బ్రహ్మరూపమైన కృష్ణాజినంతో వారు అప్పుడు రక్షణ చేసుకున్నారని ఒక గాథ. 2. యజ్ఞం దేవతలకు దూరంగా వెళ్ళి కృష్ణమృగ రూపంలో సంచరిస్తుంటే దేవతలు దాని వెంట వెళ్ళి చర్మాన్ని తెచ్చుకున్నారట. అప్పటి నుంచి కృష్ణాజినం పరమ పవిత్రమైనదట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు