కృష్ణుఁడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వసుదేవునికి దేవకీదేవియందు పుట్టిన కొడుకు. ఇతఁడు ఈపేరితో అవతారము ఎత్తిన శ్రీమహావిష్ణువు. కంసుఁడు తన్ను కృష్ణుఁడు చంపును అని ఒకప్పుడు ఆకాశవాణి పలికినందున కృష్ణుని పుట్టినప్పుడే చంపవలెను అని దానికి తగిన యత్నములన్ని చేసి ఉండెను. అట్లుండినను యోగమాయా సహాయమున కృష్ణుఁడు తప్పించుకొని వ్రేపల్లెలో నందుని భార్యఅగు యశోదాదేవియొద్ద చేరి అందు పెరిగెను. ఈతని లీలలు అనేకములు. ఇతఁడు చేసిన కృత్యములు అనేకములు పలువిధముల తెలియవచ్చును. భారతయుద్ధ ప్రారంభమునకు ముందు అర్జునుఁడు తన బంధువులతోడను గురువులతోడను యుద్ధము చేయను అని విరమింపఁగా అతనికి కృష్ణుఁడు యోగశాస్త్రమును ఉపదేశించి యుద్ధముచేయు బుద్ధి పుట్టించెను. ఆ యోగశాస్త్రము "భగవద్గీత" అను పేరిచే మనవేదాంత గ్రంథములలో మిగుల దొడ్డది అయి ఉన్నది.

మఱియు ధర్మరాజుచేత చేయఁబడిన రాజసూయ యాగకాలమున ఇతఁడు శిశుపాలుని సంహరించెను. కౌరవసదస్సున దుర్యోధనాదులచే ద్రౌపది అవమానింపఁబడినప్పుడు ఇతఁడు ఆమె మొఱ ఆలకించి సంరక్షించెను. పాండవులకును కౌరవులకును సంధిచేయఁగోరి రాయబారము పోయిన కాలమున ఇతఁడు తన విశ్వరూపమును చూపెను. ఇది మొదలైన మానుషములును అద్భుతములును అయిన కృత్యములను ఇతఁడు చేసినందున కేవలము మనుష్యమాత్రుఁడు కాఁడు అని నమ్మఁదగి ఉన్నది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]