గార్హస్థ్యసన్యాసపరీక్షాన్యాయం

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒక రాజు తన వద్దకు వచ్చే సన్యాసులను గృహస్థధర్మం గొప్పదా? సన్యాసధర్మం గొప్పదా? అని అడుగుతుండేవాడు. ఎవరూ దీనిని తేల్చి చెప్పలేకపోయేవారు. ఒకనాడొక సన్యాసి తన దగ్గరకు రాగా రాజు ఎప్పటిమాదిరిగానే ప్రశ్నించగా సన్యాసి రెండూ గొప్పవే, ఆచరణశూన్యులకు రెండూ చెడ్డవే అని చెప్పి దీనిని రుజువు చేయడానికి రాజును తనవెంట తీసుకొని వెళ్లివాడు. ఒక నగరంలో రాజసభలో రాజకుమార్తె స్వయంవరం జరుగుతుంది. ఆమె రాజపుత్రుల నెవరినీ వరింపక సభలో ఉన్న ఒక యువక సన్యాసిని వరించి ఆతని కంఠంలో పూలమాల వేస్తుంది. కాని సన్యాసి ఆ పూలమాలను నేలపై పడవేసి వెడలిపోయినాడు. రాజు తన కుమార్తెను వివాహమాడినవారికి సగం రాజ్యం, తన తరువాత పూర్తి రాజ్యాన్ని ఇస్తానని కేకలు వేసిన దానిని పట్టించుకోక ఆ సన్యాసి వెళ్లిపోయినాడు. ఐనా రాజు, రాజకుమార్తె అతణ్ణి వెంటాడినారు. సన్యాసి అది గ్రహించి అడవులలో ప్రవేశించి మాయమైనాడు. రాత్రి కావడంతో రాజు, సన్యాసి ఒకచోట చెట్టుకింద విశ్రమించినారు. ఆ చెట్టుమీద ఒక పక్షి ఆలుబిడ్డలతో నివసిస్తుంది. వాటిలో మగపక్షి చెట్టుకింద విశ్రమిస్తున్న వారిని చూచి 'వీరు చలితో బాధపడుతున్నా'రని జాలితో ఒక నిప్పుపుల్లను తెచ్చి కింద జారవిడుస్తుంది. వారు దాని సహాయంతో నిప్పు చేసుకుని చలిబాధ పోగొట్టుకుంటారు. పైనున్న పక్షి 'ఇంటికి వచ్చిన అతిథుల ఆకలి తీర్చడానికి నావద్ద ఏమీ లేదే! నా మాంసాన్ని తిని వీళ్లు సంతృప్తి పడెదరుగాక!' అని మంటలో పడి ఆహారమౌతుంది. అప్పుడు ఆడపక్షి 'నా మగని మాంసంతో వీళ్లకు తృప్తి కలుగుదు. కనుక నేను కూడా అతిథిసత్కారం కోసం మంటలో పడతా'నని మంటలో దూకుతుంది. తరువాత పక్షిపిల్లలు కూడా తమ తలిదండ్రులు మార్గంలోనే అతిథిసత్కారం కోసం తమ ప్రాణాలు అర్పిస్తాయి. అప్పుడు సన్యాసి రాజుతో 'ఈ యువకసన్యాసి రాజకుమార్తె రాజ్యవైభవం లభించినా వాటిని తృణీకరించినాడు. గృహస్థాశ్రమంలో ఉన్న పక్షికుటుంబం అతిథిసత్కారం కోసం తమ ప్రాణాలే అర్పించింది. స్వధర్మాన్ని పాలించేవాడు గృహస్థైనా, సన్యాసియైనా ముక్తికి అర్హుడే కదా' అని రుజువు చేసినాడు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]