గోపగృహిణీన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పూర్వము ఇరువురు రాజదంపతు లుండేవారు. వారికొకుమారుఁడు. రాణి కొంచెము చీకటితప్పులమనిషి. ఆమెకు రాజుగారన్న అసహ్యము. ఒకనాడామె రాజును విషము పెట్టి చంపి ఱంకుమగని యింటికి పోగా అతడు సర్పదష్టుడై చనిపోయెను. ఆమె దేశాంతరమునకు పోయి అచట వేశ్యావృత్తితో జీవించుచుండెను. కొన్నాళ్ళ కొకరాజపుత్రునకు నామెకు సంబంధము కలిగెను. ఇష్టాగోష్టిలో వారిరువురు తల్లి, కొడుకులని తెలియవచ్చి ఒకరి నొకరు వదలివైచి ఆపాపప్రాయశ్చిత్తికై చితిపేర్చుకొని దానిపై నెక్కిరి. రాజకుమారుడు చనిపోయెను. ఆమె మాత్రము చావక చితినుండి దొర్లి ప్రక్కనున్ననదిలో పడెను. నదీప్రవాహవశమున కొట్టుకొనిపోవుచుండగా నామెనొక గొల్లవాడు ఒడ్డునుకు జేర్చి తనయింటికి దీసి కొనిపోయెను. వారిరువురును మహానురాగముతో అలుమగలవలె మెలఁగజొచ్చిరి. ఒకనాఁడామె పెరుగమ్ముటకు పోవుచు త్రోవలో నెదురు దెబ్బతగిలి క్రింద పడెను. తలమీది పెరుగుబాన నేలపైబడి పగిలి పెరుగు నేలపాలయ్యెను. అది చూచి ఆరాణి యిట్లను కొనుచు నేడువదొడగెను- "హత్వా నృపం పతి మవాప్య భుజంగదష్టం, దేశాంతరే విధివశా ద్గణికాస్మి జాతా, పుత్త్రం స్వకం సమధిగమ్య చితాం ప్రవిష్టా, శోచామి గోపగృహిణి కథ మధ్య తక్రమ్‌?" అంతకంతకు భ్రష్టత్వము నొంది ఆపదలంబడినవారి విషయమున నీన్యాయము ప్రవర్తించును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]