చెంగలించు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
క్రియ

అకర్మక క్రియ

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

దే.అ.క్రి. మొలచు, వికసించు, అతిశయించు, ఉత్సాహపడు, ఉల్లాసముగా దూడలు గంతులు వేయు.......క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

1. అతిశయించు;"చ. కనుఁగొని యద్భుతంబును వికాసము భక్తియుఁ జెంగలింప." వి, పు. ౭, ఆ.
2. ప్రకాశించు;"వ. కుముదంబులు ముదంబందె, లాంగలి చెంగలించె." కాశీ. ౩, ఆ.
3. విజృంభించు;"ఎ, గీ. అంతఁదనియక మదిఁజాలనాగ్రహించి, మఱియుఁదక్కిన యోధుల మదమడంచి, పగటిసూర్యుని గతి బ్రతాపమున మించి, సింహనాదంబు గావించెఁ జెంగలించి." జై. ౭, ఆ.
4. హసించు."ఉ. విందులు విందులంచుదను వేడుక నెత్తుకొనంగఁ బిల్వనిం, పొందఁగ నేగి పైఁబడుచు నుబ్బునఁ గేరుచు జెంగలించుచున్‌, సందిలిపట్టి యాడుమన నాట్యములాడుచు ముద్దులన్‌ మహా, నందమొనర్చె బాలిక దినంబును జుట్టపుఁబూవుబోండ్లకున్‌." కళా. ౬, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]