డబ్బుకు లోకం దాసోహం (సామెత)

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

డబ్బుకు లోకం దాసోహం అంటే ధనానికి అంతా దాసులవుతారని. దాసః + అహం = దాసోహం - అనగా నేను దాసుడను అని అర్ధం. తెలుగు పదాలనూ, సంస్కృత సమాసాన్నీ కలగలపడం ఈ సామెతలో ఒక ప్రత్యేకత.

దాదాపు అందరికీ తెలిసిన జీవిత సత్యాన్ని చాటే నానుడి ఇది. ఇదే అర్ధంలో ఎన్నో పాటలు, పద్యాలు, వాడుక పదాలు ఉన్నాయి.

  • ధనమేరా అన్నిటకీ మూలం - అనే తెలుగు సినిమా పాట
  • పైసా మే పరమాత్మా - అన్న నానుడి
  • అర్ధము పురుషార్ధములలోనుత్తమము. అర్ధవంతునకసాధ్యము లోకమందేదియును కానరాదు - అని చిన్నయసూరి రచించిన మిత్రలాభములో ఉన్నది.