నేతకాని

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

నేతకాని కులం షెడ్యూల్డ్ కులాల్లో ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో నేతకాని కులాన్ని netkani అని పిలుస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాల సాలే గా పిలుస్తారు.మహారాష్ట్రలో మహార్ గా పిలుస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా లో మంచిర్యాల అసిఫాబాద్ బెల్లంపల్లి అదిలాబాద్ ప్రాంతాలలో ఎక్కువగా గా నేతకాని ప్రజానీకం ఉంది.కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా లో గోదావరి నది పరివాహక ప్రాంతాలలో ఎక్కువగా నివసిస్తున్నారు. నేతకాని ప్రజల ప్రధాన వృత్తి పూర్వకాలంలో చేనేత వస్త్రాలను తయారు చేయడం మరియు గ్రామ సుంకరి,నీరటి గా పనిచేసేవారు. కాలక్రమేణా యాంత్రీకరణ మూలంగా ఆదరణ లేనందున క్రమక్రమంగా చేనేత వృత్తి అనేది కనుమరుగైపోయింది. నేటికీ నేతకాని కులం వారు చాలా గ్రామాలలో సుంకరి గా,ఏలోడు గా , నీరటి గా పని చేస్తున్నారు. నేతకాని ప్రజలు చాలామంది వ్యవసాయం చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ జనాభా లో నేతకాని కులం జనాభా పరంగా మూడవ స్థానంలో ఉంటుంది. నేతకాని ప్రజలు మహారాష్ట్ర నుండితెలంగాణ ప్రాంతానికి వలస రావడం జరిగింది.నేతకాని సమాజం నుండి దుర్గం చిన్నయ్య గారు బెల్లంపల్లి శాసనసభ స్థానం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి బోర్లకుంట వెంకటేష్ నేత ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

"https://te.wiktionary.org/w/index.php?title=నేతకాని&oldid=965761" నుండి వెలికితీశారు