పాఠక్రమన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సూత్రపఠితమైన పాఠక్రమము నతిక్రమింపక విధులయందు ప్రవర్తించునట్లు. శ్రుతిక్రమము, అర్థక్రమము, పాఠక్రమము, ప్రవృత్తిక్రమము, స్థానక్రమము, ముఖ్యక్రమము అని క్రమము ఆఱువిధములు. (1) ఇందు శ్రుత్యుద్దిష్టక్రమము ననుసరించుట శ్రుతిక్రమము. (2) వాక్యములు వ్యత్యస్తములుగానున్నను అర్థమునుబట్టి విధియందు ప్రవర్తించుట అర్థక్రమము. ఉదా:- అగ్నిహోత్రం జుహోత్యోదనం పచతి- మున్నగు వానివలె. (3) సూక్తములయందు నుడువఁబడిన పాఠముయొక్క వరుస నత్రికమింపక క్రమముగ విధులయందు ప్రవర్తించుట పాఠక్రమము. ఉదా:- సమిథో యజతి; తనూనపాతం యజతి; ఇడో యజతి; బర్హి ర్యజతి; స్వాహాకారం యజతి- మున్నగు వానివలె. ఇందు తొలుత సమిత్తు, తరువాత అగ్నిహోత్రుని. ఇట్లు వరుసగ యజింపవలెను. (4) అనుభవమును ఆచారమునుబట్టి విధులయందు ప్రవర్తించుట ప్రవృత్తిక్రమము. ఏతావతా చెప్పినది చెప్పినట్లు క్రమము తప్పక పనుల యందు ప్రవర్తించునపు డీన్యాయము ప్రవర్తించునని యెఱుంగనగును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]