విక్షనరీ:బ్రౌణ్య ఆంగ్ల-తెలుగు పదకోశము A2

విక్షనరీ నుండి

Acacia, n. s. కనివిందచెట్టు.

Academical, adj. పాఠశాలా సంబంధమైన. * persons పాఠశాలా సంబంధమైన వాండ్లు.

Academician, n. s. పాఠశాలా సంబంధమైన వాడు.

Academy, n. s. పాఠశాల.

Acanthus, n. s. ఒక విధమైన పుష్పచెట్టు.

Acatalectic, adj. సంపూర్ణమైన, ఇది ఛంధస్సులో వచ్చే మాట.

To Accede, v. n. సమ్మతించుట, ఒప్పుట, అంగీకరించుట.

To Accelerate, v. a. త్వరపెట్టుట, తీవ్రించుట.

Accelerated, adj. త్వరపెట్టబడ్డ, తీవ్రించబడ్డ.

Acceleration, n. s. త్వర, తీవ్రము.

Accent, n. s. స్వరము, ఒత్తిపలికే స్వరము, ఒత్తుపలుకుకు సూచకమైన గురుతు, వానికే, అనే శబ్దములో accent మూడో అక్షరము మీద వున్నది, వాల్మీకి అనే శబ్దములో accent రెండో అక్షరము మీద వున్నది. soft *s తిన్నని పలుకులు. humble *s వినయోక్తులు. fierce *s క్రూరవచనములు.

To Accent, v. a. ఒత్తిపలుకుట, ఊనిపలుకుట, ఒత్తుపలుకుకు గురుతు వేసుట.

To Accentuate, v. a. ఉచ్చారణ క్రమముగా గురుతులు వేసుట.

Accentuation, n. s. ఉచ్చారణ క్రమముగా గురుతులు వేయడము.

To Accept, v. a. అంగీకరించుట, పుచ్చుకొనుట, పరిగ్రహించుట, ఒప్పుకొనుట. he *ed the bill or draft ఉండిని వొప్పుకొని చేవ్రాలు చేసినాడు. he *ed homage దండము గైకొన్నాడు.

Acceptability, n. s. మనోహరత్వము, ఉపయుక్తత, ఇష్టత, హితము. this proves the * of your advice యిందువల్ల మీరు చెప్పిన బుద్ధి అతనికి యిష్టమైనట్టు తెలుస్తున్నది.

Acceptable, adj. మనోహరమైన, ప్రియమైన, ఉపయుక్తమైన, ఇష్టమైన, హితమైన, అనుకూలమైన. this rain is very * to the crops యీ వాన పైరుకు నిండా అనుకూలమైనది. Unacceptable ప్రతికూలమైన.

Acceptableness, n. s. హితము, ఇష్టము, ఉపయుక్తత.

Acceptably, adv. హితముగా, ఇష్టముగా.

Acceptance, n. s. అంగీకారము, పరిగ్రహము, సమ్మతి.

Acceptation, n. s. అంగీకారము, అర్థము, తాత్పర్యము.

Accepted, adj. అంగీకరించిన, పుచ్చుకొన్న, పరిగ్రహించిన, ఒప్పుకొన్న, రూఢియైన. the

  • meaning or sense రూఢ్యర్థము.

Access, n. s. ప్రవేశము. he found * to them వాండ్ల వద్ద అతనికి ప్రవేశము కలిగినది, అనగా వాడికి వాండ్ల దర్శనము చిక్కినది. he is easy of * అతని వద్ద ప్రవేశము కలగడము సులభము, అనగా అతని దర్శనము కావడము సులభము. there was an * of fever last night నిన్న రాత్రి జ్వరము ముమ్మరముగా వుండినది.

Accessary, n. s. దుర్మార్గమునకు సహాయపడేవాడు.

Accessible, adj ప్రవేశించ కూడిన. the house is * thro' the garden ఆ యింట్లోకి తోటగుండా ప్రవేశించవచ్చును. he is * through flattery స్తోత్రముగుండా వాడు వశ్యుడవుతాడు.

Accession, n. s. ప్రవేశము. after this * ఆయనకు ప్రవేశమైన తరవాత, అనగా ఆయన సింహాసన మెక్కిన తరవాత.

Accessory, adj. దుర్మార్గమునకు సహాయపడే.

Accidence, n. s. లఘువ్యాకరణము.

Accident, n. s. అకస్మాత్తుగా సంభవించిన పని. this was an * యిది తనంతట సంభవించినది, యిది ఆకస్మికము. a misfortune అపాయము, ఆపద. he met with an * వాడికి ఒక ఆపద వచ్చినది. by * అకస్మాత్తుగా, అయత్నపూర్వకముగా. in philosophy సంభవము, విశేషము, అవివక్షితము.

Accidental, adj. అకస్మితమైన, అకస్మాత్తైన. causeless నిష్కారణమైన.

Accidentally, adv. అకస్మికముగా, అకస్మాత్తుగా. causelessly నిష్కారణముగా.

Acclamation, n. s. జయధ్వని.

Acclimated, adj. అలవాటుగల.

Acclivity, n. s. ఎక్కుడు, ఎగుడు. a house was built on the * of the hill కొండ యొక్క యెక్కుడులో వొక యిల్లు కట్టి వుండెను.

To Accommodate, v. a. వసతి చేసుట, అనుగుణ్యపరచుట, సమాధానము చేసుట. I can * you in my house మా యింట్లో నీకు వొక గుర్రము యిస్తాను. we must * ourselves to the times మనము కాలానికి తగినట్టు నడుచుకోవలెను. they *ed the affair ఆ సంగతిని రాజీచేసినారు. the matter was *ed ఆ సంగతి రాజీ అయిపోయినది. Can you * men with ten rupees ? నాకు పది రూపాయలు సహాయము చేస్తావా, వొదుగుతావా. he *d himself to the customs of these people వీండ్ల మర్యాడలకు అనుగుణ్యముగా ప్రవర్తించినాడు, వొద్దికగా నడుచుకొన్నాడు.

Accommodating, adj. తాళిమిగల, ఓర్పుగల. he is of an * temper వాడు తాళిమిగలవాడు. you should be more * నీకు నిండా తాళిమి వుండవలెను.

Accommodation, n. s. వసతి, ఇమిడిక, పొసగుదల, వొదుగుదల, సమాధానము, రాజీ. can you give me * in your house? మీ యింట్లో నాకు స్థలమిస్తావా. there is a house with * for twenty people యిరువై మందికి వసతియైన వొక యిల్లు వున్నది. his giving me these books was a great * యీ పుస్తకములను నాకు అతడివ్వడము నిండా సహాయమైనది. an * boat వసతిగా వుండే పడవ.

Accompaniment, n. s. శ్రుతి, మేళము.

To Accompany, v. a. వెంబడించుట, అనుసరించుట, కూడాపోవుట. I accompanied him to his house అతనితో కూడా అతని యింటికి పోతిని. his friends accompanied him for a short way out of the town అతని స్నేహితులు అతణ్ని వూరిబయటికి సాగనంపిరి. a translation accompanies the letters ఆ జాబులతో కూడా భాషాంతరము వున్నది. fever accompanies ague చలివెంట జ్వరము వస్తున్నది. he came accompanied by his wife భార్యాసమేతుడై వచ్చినాడు. a Ramayanam accompanied by a commentary సవ్యాఖ్యానముగా వుండే రామాయణము.

Accompanying, adj. వెంబడించే, అనుసరించే, కూడా వుండే.

Accomplice, n. s. సహకారి, దుర్మార్గమునకు సహాయపడ్డవాడు. I will not be an * in this నేను యీ దుర్మార్గమునకు సహకారిగా వుండను.

To Accomplish, v. a. నెరవేర్చుట, నిర్వహించుట, ఈడేర్చుట. he *ed the ancient prophecy పూర్వికులు జరగబోతున్నదన్నట్టు వీడివల్ల సంభవించినది.

Accomplished, adj. నెరవేరిన, పూర్ణమైన, పరిపక్వమైన, సిద్ధించిన. after the period was * ఆ కాలము పరిపక్వమైన తరువాత. after the business was * ఆ పని నెరవేరిన తరువాత. after his prophecy was * అతను చేప్పిన ప్రకారము సిద్ధించిన తరువాత. * in archery ధనుర్విద్యా పారంగతుడైన. an * scholar సంపూర్ణ పండితుడు, ప్రవీణుడు. an * woman వ్యక్తురాలు, నిపుణురాలు. an * dancer ఆటలో బాగా తీరిన వాడు.

Accomplisher, n. s. నెరవేర్చేవాడు, నిర్వాహకి.

Accomplishment, n. s. or elegant art విద్య అనావశ్యకమైన విద్య, అనగా ఆట, పాట, చిత్రము, సాము, మొదలైనవి. of a prophecy సిద్ధి, సిద్ధించడము. after the * of his prophecy సిద్ధి, సిద్ధించడము. after the * of his prophecy వాడు నడవబోతున్నదన్నది సిద్ధించిన తరువాత, this prevented the * of this business ఆ పని నేరవేరడమునకు యిది అభ్యంతరమైనది. a man of great *s మహాప్రవీణుడు. Drawing is a pretty * చిత్రపని వొక స్వల్పవిద్య.

Accompt, n. s. లెక్క. See account.

Accomptant, n. s. లెక్కవాడు. See Accountant.

To Accord, v. a. or to bestow దయ చేసుట, ఆమోదించుట, అనుకూలించుట. he

  • ed his permission ఆయన సెలవు దయచేసినారు.

To Accord, v. n. సరిపడుట, జతపడుట. his statement does not * with theirs వాడు చెప్పేదానికిన్ని వాండ్లు చెప్పేదాన్నికిన్ని సరిపడలేదు, అసంగతముగా వున్నది.

Accord, n. s. సమ్మతి. he came of his own * తనకు తానే వచ్చినాడు. All with one * అందుకు వొక మనసుగా, ఏక గ్రీవముగా.

Accordance, n. s. అనుగుణ్యము. in * to his wish అయన కోరికకు అనుగుణ్యముగా. in * with his mandate ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారము.

According to, prep. ప్రకారము. * to orders ఆజ్ఞ ప్రకారము. * to him వాడు చెప్పిన ప్రకారము.

Accordingly, adv. అదే ప్రకారముగా.

To Accost, v. a. ఎచ్చరించుట, మందలించుట, పలకరించుట.

Accoucheur, n. s. మంత్రసానితనము చేసేవాడు.

Account, n. s. of money లెక్క. value ఘనత. a man of * ఘనుడు. people of no * స్వల్పులు. they made no * of him వాండ్లు వాణ్ని లక్ష్యపెట్టలేదు. Or profit ఫలము. this turned to account యిది సఫలమైనది. You will find your * in going there నీవు అక్కడికి పోతివా నీకు సఫలమీను. he turned his time to good * సత్కాలక్షేపము చేసినాడు. he turns his land to no * వాడి నేలను వృధాగా వేసి పెట్టుతాడు. Reason నిమిత్తము. on this * యిందు నిమిత్తము. they called him to

  • for his వాణ్ని యిందుకేమి సమాధానము చెప్పుతావు అని అడిగినారు. Description,

explanation వైనము, వృత్తాంతము, చరిత్ర. this is a foolish * యిది పనికిమాలిన కధ. I have received accounts from home మా దేశము నుంచి వర్తమానము వచ్చినది. I settled his accounts వాడి లెక్కలను తీర్చినాను, లేక, వాణ్ని చంపినాను. By all accounts he is gone వాడు పోయినాడట. When you blame them, you must take their ignorance into * వాండ్ల మీద దోషము చెప్పేటప్పుడు వాండ్ల అవజ్ఞతనున్ను నీవు యోచించవలెను. On * of his absence అతను లేనందున. he bought it on his own * దాన్ని తన సొంతానికి కొనుక్కొన్నాడు. on * of the rain వానవల్ల. You must on no * go there నీవు అక్కడికి యెంతమాత్రము పోకూడదు. he is gone to his final * or to his great * చచ్చినాడు.

To Account, v. a. యెంచుట, తించుట. they accounted him a fool వాణ్ని పిచ్చివాణ్నిగా యెంచినారు. they account him a prophet. అతణ్ని భవిష్యద్వక్త అంటారు.

To Account, v. n. సమాధానము చెప్పుట. you must * to me for that money ఆ రూకలకు నీకు సమాధానము చెప్పదలచినది. Can you account for it అందుకు సమాధానము చెప్పగలవా. Can you * for this fever యీ జ్వరానికి హేతువు చెప్పగలవా. his father's death accounts for the delay యీ సావుకాశమునకు వాడి తండ్రి చావు కారణమౌతున్నది.

Accountable, adj. ఉత్తరవాదియైన, జవాబుదారియైన.

Accountant, n. s. లెక్కవాడు. of a village కరణము.

Account-book, n. s. లెక్కపుస్తకము.

To Accountre, v. a. ముస్తీబుచేయించుట. I accountred myself with a sword కత్తిని ధరించినాను, తొడిగితిని, సన్నద్ధము చేసుట. being accountred with a sword ఖడ్గమును ధరించినవాడై. he accountnred his men తన సిపాయీలకు కావలసిన ముస్తీబు యిచ్చినాడు, అనగా పుడుపు ఆయుధములు మొదలైనవి.

Accountred, adj. ధరించిన, తొడిచిన, ముస్తీబు చేయబడ్డ, సన్నద్ధము చేయబడ్డ. * with a sword ఖడ్గధారియైన, కత్తికట్టుకొన్న. he was then * with two pistols అప్పట్లో వాడు రెండు పిస్తోలులు కట్టుకొని యుండినాడు.

Accoutrement, n. s. ఆయుధములు, బట్టలు, మొదలైన ముస్తీబు.

Accredited, adj. వకాలత్తు నామాగల అధికారముగల.

Accretion, n. s.పెరిగినది, సంభవించినది.

To Accrue, v. n. సంభవించుట, కలుగుట. the profits accruing therefrom అందువల్ల వచ్చే లాభము.

To Accumulate, v. a. పోగుచేసుట, చేర్చుట. he accumulated much wealth నిండా రూకలు కూడ బెట్టినాడు.

Accumulated, adj. పోగుచేసిన, ఆర్జించిన, చేరిన, కూడిన. * injustice బహు అన్యాయము.

Accumulation, n. s. పోగు, రాశి. he left a great * of debts విస్తారము అప్పుపెట్టి పోయినాడు. * of wealth బహుధనము.

Accuracy, n. s. ఖండితము, పరిష్కారము, శుద్ధత. he wrote this with great * దీన్ని తప్పులు లేకుండా వ్రాసినాడు. a man of great * నిండా ఖండితమైనవాడు.

Accurate, adj. ఖండితమైన, పరిష్కారమైన, శుద్ధమైన. an * translation పరిష్కారమైన భాషాంతరము, సరియైన భాషాంతరము. an * copy శుద్ధప్రతి.

Accurately, adv. ఖండితముగా, సరిగ్గా, పరిష్కారముగా. a copy written * శుద్ధముగా వ్రాసి ప్రతి.

Accurateness, n. s. ఖండితము, పరిష్కారత, శుద్ధత, సుబద్ధత. From the * of this account I saw his talent వాడు దీన్ని వర్నించిన పరిష్కారతవల్ల వాని ప్రజ్ఞ నాకు తెలిసినది.

Accursed, adj. శపించబడ్డ, దౌర్భాగ్యమైన, చెడ్డ, పాపిష్టి.

Accusation, n. s. నిందమోపడము, నెపము, అపవాదము. they brought an * of theft against him దొంగలించినాడని వాడిమీద ఫిర్యాదు తెచ్చినారు.

the Accusative case, n. s. ద్వితియ్యా విభక్తి.

To Accuse, v. a. నిందమోపుట. they accused me of going there అక్కడికి పోయినానని నా మీద ఫిర్యాదు చేసినారు.

Accused, adj. నిందమోపబడిన. those who are * of doing this యీ పని చేసినారని అనబడ్డవాండ్లు. the accused ప్రతివాది, నేరము మోపబడ్డవాండ్లు.

Accuser, n. s. పిర్యాది, వాది. who is the * in this యీ పని జరిగినట్టు చెప్పేవాడెవడు.

To Accustom, v. a. అభ్యాసము చేసుట, అలవాటు చేసుట, వాడిక చేసుట, మరుపుట. he accustomed his son to swim కొడుకుకు యీత వాడిక చేసినాడు. he accustomed himself to drink సారాయి తాగమరిగినాడు.

Accustomed, adj. అభ్యాసపడ్డ, అలవాటుపడ్డ, వాడికపడ్డ, మరిగిన.

Ace, n.s . పగడ, వంచ. in cards వకచుక్క, దీన్ని ఆసు అంటారు. I was within an

  • of falling నేను పడడానకు పగడ తప్పింది.

Acerbity, n. s. చెడుపులుసు, క్రౌర్యము.

Acescency, n. s. పులిసేగుణము.

Acescent, adj. పులుసుగావుండే.

Acetous, adj. పులిసే.

Ache, n. s. నొప్పి. heart * మనోవ్యధ. tooth * పండ్లతీపు. ear * చెవిపోటు.

To Ache, v. n. నొచ్చుట, సళుపుట, తీపుతీసుట. my legs * నా కాళ్లు నొస్తవి, తీపులు తీస్తవి.

To Achieve, v. a. సాధించుట, పొందుట. he achieved the victory జయము పొందినాడు.

Achievement, n. s. కార్యము, సాధించిన కార్యము. or ensigns armorial చిహ్నము. this was a great * మహత్తైన కార్యము. his achievements are two lions వాడికి బిరుదు రెండు సింహములు.

Achilles, n. s. ద్రోణాచార్యులవంటి వక శూరుడు.

Achromatic, adj. వర్నవిహీనమైన.

Acid, adj. పుల్లని. * gruel పులిగంజి.

Acid, n. s. పులుసు. * muriatic లవణ ద్రావకము. vitriolic * గంధక ద్రావకము. nitrious * పెట్లుప్పు ద్రావకము.

Acidity, n. s. పులుసు.

Acidulated, adj. పులియబెట్టిన.

To Acknowledge, v. a. వొప్పుట, అంగీకరించుట. Please to * the receipt ప్రవేశము కనవలెను. I * that he is theif father but అతడు వాండ్ల తండ్రి వాస్తవ్యమే గాని.

Acknowledged, adj. వొప్పిన, అంగీకరించిన. or renowned ప్రసిద్ధమైన. It must be * that some of them are rich వారిలో కొందరు భాగ్యవంతులుగా వుండేది వాస్తవమే. she is an * beauty అది అందకత్తె యని ప్రసిద్ధురాలైనది.

Acknowledgement, n. s. అంగీకారము, వొప్పుకోవడము. or receipt for money చెల్లుచీటి. * of a benefit కృతజ్ఞత, ఉపకారస్మృతి. * of a bow ప్రతివందనము. we make you these acknowledgements for our new dresses మేము కొత్త బట్టలు కట్టుకొన్నాము గనుక తమకు దండము పెట్టుతాము.

Acme, n. s. శిఖరము, ఊర్ధ్వభాగము, ఉఛ్రాయము. the * of a disease రోగము యొక్క ముమ్మరము. the * of felicity అనందాతిశయము.

Acolyte, n. s. శిష్యుడు.

Aconite, n. s. వకతరహా విషమూలిక.

Acorn, n. s. కాయ, విత్తు, యిది Oak మొదలైన కొన్ని గొప్ప వృక్షముల యొక్క కాయ, వీటిని పందులు తింటవి.

Acoustics, n. s. ధ్వని విషయక శాస్త్రము.

To Acquaint, v. a. యెరుక చేసుట, తెలియచేసుట. I acquainted him with this దీన్ని అతనికి తెలియచేసినాను. * thyself with god దేవుణ్ని తెలుసుకో.

Acquaintance, n. s. పరిచయము, యెరుక, నెళువు, యెరిగినవాడు, పరిచయము గలవాడు. he told a mutual * of ours తన్ను నన్ను యెరిగిన వకడితో చెప్పినాడు. this shews his * with grammar యిందువల్ల అతనికి వ్యాకరణమందు పరిచయము కద్దని తెలుస్తుంది. they scraped * with me నన్ను పరిచయము చేసుకొన్నారు. he has many acquaintances అతనికి యెరిగినవాండ్లు శానామంది వున్నారు. they are acquaintances of mine వాండ్లు నా కెరిగిన వాండ్లు. he has no * with English అతనికి ఇంగ్లీషు పరిచయము లేదు.

Acquainted, adj. యెరిగిన, పరిచయముగల. I am not * with his name వాడి పేరు నాకు తెలియదు.

To Acquiesce, v. n. వొప్పుకొని వుండుట, సమ్మతించుట, అంగీకరించుట. he aquiesced in this decision యీ తీర్పుకు సమ్మతించినాడు.

Acquiescence, n. s. సమ్మతి, అంగీకారము. In consequence of his * అతను వొప్పుకొన్నందున.

To Acquire, v. a. సంపాదించుట, ఆర్జించుట. or to learn గ్రహించుట, నేర్చుకొనుట. he acquired a name మంచి పేరెత్తినాడు.

Acquired, adj. సంపాదించిన, ఆర్జించిన, గ్రహించిన, నేర్చుకొన్న.

Acquirement, n. s. సంపాదించడము. After the * of this forture యీ ఐశ్వర్యము వచ్చిన తరువాత, ప్రాప్తమైన తరువాత. After the * of this language యీ విద్యను గ్రహించిన తరువాత. in plural విద్య, పాండిత్యము. a man of great acquirements మహావిద్వాంసుడు, మహాపండితుడు.

Acquisition, n. s. సంపాద్యము, ఆర్జన. personal * స్వార్జితము.

Acquisitiveness, n. s. విచారించే బుద్ధి. See under Cranology.

To Acquit, v. a. దోషము లేదనుట, నేరము లేదని తీర్చుట. or to behave ones self నడుచుకొనుట. he acquitted himself very well బాగా నడుచుకొన్నాడు. he acquitted them of the robbery వాండ్ల మీద ఆ దొంగతనము లేదని తీర్పు చెప్పినాడు. I * you of a wrong intention in this యిందులో నీ దగ్గెర దురాలోచన వున్నదని నేను అనలేదు. he acquitted them of the murder but he did not release them వాండ్ల మీద ఖూని నేరము లేదని తీర్పు చెప్పినాడుగాని విడుదల చేయలేదు.

Acquittal, n. s. దోషము లేదనడము, నేరము లోదని తీర్పువ్వడము.

Acquittance, n. s. రుణవిమోచనము, చెల్లుచీటి.

Acquittance, n. s. రుణవిమోచనము, చెల్లుచీటి.

Acre, n. s. నాలుగువేల యెనమన్నూట, నలభైగెజాల చదర భూమి, దీన్ని వొక ఏకరా, లేక వొక కాణి అంటారు.

Acrid, n. s. వగరు, కారము, వేండ్రము.

Acridity, n. s. వగరు, కారము, వేండ్రము, తీక్ష్ణము, చురుకు. the * of the lime powder burnt his tongue సున్నపు వేండ్రముచేత నాలికెపొక్కింది.

Acrimonious, adj. క్రూరమైన, పరుషమైన, కఠోరమైన. * language కర్ణకఠోరమేన మాటలు. * humours in the body శరీరములో వుండే విష నీరు.

Acrimoniously, adv. క్రూరముగా, కఠోరముగా.

Acrimony, n. s. క్రూరత, పరుషత, కఠోరత, తీక్ష్ణత.

Across, adv. అడ్డముగా. there is a bridge * the river ఆ యేటికి వంతెన కట్టివున్నది. a house * the river యేటికి ఆ తట్టువుండే బంగళా. they went * the river యేటిని దాటినారు. when I came * him అతడు నాకు యెదురు పడ్డప్పుడు.

Acrostic, n. s. ఒక తరహా చిత్రబంధ కావ్యము, యిందులో ప్రతి చరణము యొక్క మొదటి అక్షరములను కూర్చి చదివితే ఒక మనిషి యొక్కగాని ఒక వస్తువుగాని పేరు అవుతున్నది.

To Act, v. n. ఆడుట, ప్రవర్తించుట, నడుచుకొనుట. I will * in conformity to your wishes తమ అభిప్రాయపద్ధతికి నడుచుకొంటాను. he acted as a minister మంత్రిగా ప్రవర్తించినాడు. he acted upon his own authority స్వతంత్రముగా ప్రవర్తించినాడు. when a watch is broken the hands do not * ఘటియారము పగిలితే ముండ్లు తిరగవు. this acted as a purge యిది భేదిమందుగా వుపయోగించినది. this medicine did not * on the fever యీ మందు ఆ జ్వరమును పట్టలేదు. she acted excellentely in this comedy యీ నాట్యములో బహు ఘనముగా ఆడింది. she acted to me as a mother అది నాకు తల్లిమారు తల్లిగా వుండినది. their words acted upon him as a discouragement వాండ్ల మాటలు వాడికి అధైర్యమును చేసింది. he will not act without orders వుత్తరవు లేక వాడు చేయడు, ప్రవర్తించడు. to * for another బదులుగా పనిచూచుట. he acted up to his principles తన యోగ్యతకు అనుగుణ్యముగా నడిచినాడు. he acted up to his orders అతని వుత్తరవు చొప్పున నడుచుకొన్నాడు. the troops acted against them ఆ దండు, వాండ్ల మీద యుద్ధము చేసినది.

To Act, v. a. నటించుట, వేషము కట్టి ఆడుట. he acted the fool పిచ్చి వేషము వేసుకొన్నాడు, పిచ్చివాడుగా నటించినాడు. Last night she acted the queen అది రాత్రి రాణివేషము కట్టింది. he acted the part of a father to them వాండ్లకు వాడు తండ్రివలే ప్రవర్తించినాడు. నడుచుకొన్నాడు. he acted the friend but in reality he was an enemy of mine వాడు స్నేహితుడుగా నటించినాడుగాని వాడు నిజముగా నాకు శత్రువు.


బ్రౌణ్య ఆంగ్ల-తెలుగు పదకోశము