విక్షనరీ:మొలక
Jump to navigation
Jump to search
- మొలకలు అంటే పదములే, కానీ ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న దశలో ఉన్నాయన్న మాట. ఇంకా విక్షనరీ సభ్యుల దృష్టి వాటి మీద పడలేదు. పదము ప్రారంభం అయితే జరిగింది గాని, పూర్తి స్థాయి పదానికి ఉండవలసినంత సమాచారం అందులో ఇంకా చేర్చబడలేదు. అంత మాత్రం చేత మొలకలు అంటే పనికిరానివని అనుకోరాదు. పదము పుట తయారయే క్రమంలో మొలక అనేది మొదటి అడుగు!
మొలక వర్గీకరణ[<small>మార్చు</small>]
- చిన్న పదాన్ని రాసాక అది మొలక అని తెలియ జేయడానికి మొలక మూసను పదానికి జత చెయ్యండి. మొలక మూస రెండు భాగాలుగా ఉంటుంది: మొదటిది, ఇది మొలక అని, సభ్యులు మార్పు చేర్పులు చెయ్యవచ్చనీ తెలియ చెప్పే ఒక సందేశం; ఇక రెండోది, పదాన్ని మొలకల వర్గంలో పెట్టే ఒక వర్గపు లింకు. ఇందువలన మొలకలను వెదకటం బాగా తేలిక అవుతుంది..
- మొలక సంబంధిత కార్యకలాపాలకు విక్షనరీ:మొలకల వర్గీకరణ (shortcut విక్షనరీ:WSS) కేంద్ర స్థానం.
- ఒక మొలకను ప్రారంభించేటపుడు, దాని ప్రధాన ఉద్దేశ్యం విస్తరణ అని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. దానికి తగినట్లుగా, ఆ పదంలో విస్తరణకు వీలైనంత కనీస మాత్రపు సమాచరం ఉండేలా చూడాలి. పుస్తకాల నుండి గానీ, యాహూ, గూగుల్ వంటి సెర్చి ఇంజనుల నుండి గాని మీ తొలి సమాచారాన్ని సేకరించ వచ్చు. ఇతర మార్గాల నుండి సేకరించిన సమాచారాన్ని కూడా పొందుపరచ వచ్చు; ఆ సమాచారం సరియైనదీ,నిష్పాక్షికమైనది అయి ఉండాలి.
- విషయాన్ని నిర్వచించడంతో మొలకను మొదలుపెట్టండి. కొన్ని సార్లు విషయాన్ని నిర్వచించడం అసాధ్యం; అటువంటప్పుడు విషయం గురించి స్పష్టమైన వివరణ ఇవ్వండి.
- తరువాత, ఈ ప్రాధమిక నిర్వచనాన్ని విస్తరించాలి. ఇంతకు ముందు సూచించిన పధ్ధతుల ద్వారా తగినంత సమాచారాన్ని సేకరించవచ్చు. కొన్ని వాక్యాలు రాసిన తరువాత వాటిలోని పదములకు సంబంధిత అంతర్గత లింకులు పెట్టాలి. అనవసరంగా, అతిగా లింకులు పెట్టవద్దు; అవసరం లేదనిపించిన చోట లింకులు పెట్టకండి.
- పదాన్ని సమర్పించిన తరువాత అది ఎన్నో దశల గుండా ప్రస్థానం చెందుతుంది. ఎవరైనా సభ్యుడు దానిని విస్తరించవచ్చు, సరైన సమాచారం దొరికినపుడో, తీరుబడిగా ఉన్నపుడో మీరే దానిని విస్తరించవచ్చు.