శరీరావస్థలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

శరీరావస్థలు - బాల్య, కౌమార, యౌవన, వార్థకములు. బాల్యము పంచదశ వర్ష పర్యంతము కౌమారము త్రింశద్వర్షపర్యంతము యౌవనము పంచాశద్వర్ష పర్యంతము తదూర్ధ్వము వార్ధకము. కొందఱమతమున పంచమాబ్దపర్యంతము కౌమారము, దశమావధిపర్యంతము పౌగండము, పంచదశవర్ష పర్యంతము కైశోరము, తరువాత యౌవనము, డెబ్బదిపైన వృద్ధత్వము. బాల్య, యౌవన, కౌమార, వార్ధకములు, అను వరుస. శ.ర.లో నీయఁబడినది. ఈ వరుస లోకమున వినఁబడుచునున్నది. ఇది ప్రామాదికమనిగాని శబ్దక్రమముకంటె అర్థక్రమము బలీయము అనున్యాయమున కౌమారమును రెండవయవస్థగ గ్రహింపవలయునని గాని యెంచుకొనఁదగును. భగవద్గీతయందు 'దేహినోऽస్మిన్‌ యథాదేహే కౌమారం యౌపనంజారా' అని బాల్య కౌమారములకు, కౌమారశబ్దమునే గ్రహించి యవస్థాత్రయమే చూపినాఁడు. ఏమైనను కౌమారము యౌవన పూర్వభావియేయగును. అదియే వ్యుత్పత్తికి సరిపడును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]