షింటోయిజం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

షింటోయిజం. జపాన్‌లో ఒక ప్రాచీన మతం. దీనికి ఒక వ్యవస్థాపకుడు అంటూ ఎవరూ లేరు. వేదం, బైబిల్‌, ఖుర్‌ ఆన్‌ల వలె ఒక ప్రామాణిక పవిత్ర గ్రంథం కూడా లేదు. ఒకప్పుడు జపాన్‌లో రాజాదరణ పొందిన మతం. జపాన్‌ రాజవంశం తాము సూర్య దేవుడి నుంచి వచ్చిన వారమని నమ్మారు. 1945లో అప్పటి జపాన్‌ రాజు తాము సామాన్య మానవులమేననీ, దైవాంశ సంభూతులం కామనీ, సూర్య దేవుడి సంతతి వారమని గతం నుంచి వస్తున్న విశ్వాసాన్ని వదలుకొంటున్నామనీ ప్రకటించాడు. షింటోయిజంలో బహుదేవతా రాధన ఉంది. పూర్వీకుల ఆత్మల ఆరాధన ఉంది. పవిత్రాత్మల ఆరాధన షింటోయిజంలో ఒక ముఖ్య ఆచారం. క్రీస్తు శకం ఆరవ శతాబ్దం నుంచి బౌద్ధం విస్తరించి షింటో యిజాన్ని కనుమరగు చేసింది. ఐతే, ఒక విశ్వాసంగా అంతరించినా షింటోయిజం ఆచారాల ప్రభావం ఇప్పటికీ జపాన్‌ ప్రజల నిత్య జీవితంలో కనిపిస్తుంది. జపాన్‌లోని బౌద్ధ విశ్వాసాలు సైతం షింటో ఆచారాల వల్ల ప్రభావితమైనాయి. జపాన్‌లో కుటుంబ వ్యవస్థ పదిలంగా ఉండటానికి షింటో ఆచారాలు పునాదిగా ఉపయోగ పడుతున్నాయి. భౌతికంగా పరిశుభ్రతను పాటించడం, ప్రకృతి పట్ల ప్రేమ, ఆదరణ, పితృదేవతలను ఆరాధించడం షింటోయిజం నుంచి జపాన్‌ ప్రజలకు అందిన వారసత్వం. షింటో యిజానికి తెలుగులో సమానార్థకం లేదు. షింటోయిజం అని వ్యవహరించ వలసిందే.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]