స్మృతులు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ధర్మశాస్త్రములు. ఇవి వేదార్థ ప్రతిపాదక గ్రంథములు. అందు మనుస్మృతి మిక్కిలి దొడ్డగ్రంథము. ఈమానవ ధర్మశాస్త్రమున జగత్సృష్టి మొదలుకొని సర్వవిషయములును చెప్పఁబడి ఉన్నవి. ఇందు బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రులు అను చాతుర్వర్ణ్యాశ్రమ ధర్మములు, వివాహక్రమ పంచమహాయజ్ఞాతిథిపూజా పార్వణవిధి శ్రాద్ధవిధాన భోజననియమాదులు, స్త్రీపుంధర్మములు, రాజధర్మములు, వ్యవహార ధర్మములు, ప్రాయశ్చిత్త నియమములు మొదలుగాఁగల హిందువుల వైదిక లౌకిక విషయములు అన్నియు వచింపఁబడి ఉండును. మఱియు స్మృతులు వేదముల వలెనే గౌరవింపఁబడును. కలియుగమునకు విహితములు అగు ధర్మములు పరాశర స్మృతియందు చెప్పఁబడి ఉన్నవి. (జ్యోతిశ్శాస్త్రం) వేదార్థాలను స్మరించి వ్రాసిన గ్రంథాలను స్మృతులు అని అంటారు. ఇవి పద్దెనిమిది 1.మనుస్మృతి, 2. పరాశరస్మృతి. 3. వశిష్ట స్మృతి. 4. శంఖ స్మృతి. 5. లిఖిత స్మృతి: 6. అత్రి స్మృతి. 7. విష్ణుస్మృతి. 8. హరితస్మృతి. 9. యమస్మృతి. 10. అంగీరస స్మృతి. 11. ఉశస్మృతి. 12. సంవర్తనస్మృతి. 13. బృహస్పతిస్మృతి. 14. కాత్యాయనిస్మృతి. 15. దక్షస్మృతి. 16. వ్వాస స్మృతి. 17. యాజ్ఞవల్కస్మృతి. 18.శాతాతపస్మృతి. వీటన్నిటిలోను మను స్మృతి అతి ముఖ్యమైనది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

Wikipedia-logo-te.png
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:


"https://te.wiktionary.org/w/index.php?title=స్మృతులు&oldid=850770" నుండి వెలికితీశారు