అనుభవము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
సం.వి./సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
- వ్యు. అను + భూ + అప్. (కృ.ప్ర.)
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చూడు అనుభవం.లౌకిక జ్ఞానము / అనుభవించుట/ సుఖ దుఖాలను అనుభవించిన
- ఆ పనిలో అతనికి అనుభవము ఎక్కువ.
- అనుభవించుట, కుడుపు.
- సం.వి.అ.పుం.1. ఇంద్రియముల ద్వారమున అంతఃకరణము పదార్థములపై వ్యాపించి యాపదార్థముల స్వరూపమును గ్రహించుట, ప్రత్యక్షజ్ఞానము, వస్తువులను చూచుట, తినుట, తాఁకుట, మొదలగువానివలన కలిగిన జ్ఞానము, నీరు కాలువతూమునుండి మడిలోఁబ్రవేశించి మడియాకారము నొందునట్లు అంతఃకరణము ఇంద్రియముల ద్వారమున ఘటాదివస్తువులమీఁదఁ బ్రవేశించి తదాకారమునొంది దాని స్వరూపమును తెలిసికొనుట;
2. (కర్మఫలమగు) సుఖదుఃఖాదులనొందు. "కర్మఫలానుభవము."
సం.వి.అ.పుం/1. ప్రత్యక్షజ్ఞానము.2. సుఖదుఃఖాదులను పొందుట.3. ఫలితార్థము. 4. విషయమును అర్థము చేసికొనుట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదములు
- అనుభుక్తి, అనుభూతి, అనుభోగము, ఉపభోగము, ఉపలంభము, చవి, పరిభోగము, సంవేదన, స్వాదనము.
- సంబంధిత పదాలు
- అనుభావ్యము
- అనుభవించు
- అనుభవసిద్ధము
- అనుభవముగలవాడు.
- అనుభవదారుడు
- అనుభవించేవాడు
- అనుభవీకుడు
- అనుభవవేద్యము
- అనుభవశాలి
- నరకానుభవము
- సుఖానుభవము
- దుఃఖానుభవము
సుఖానుభవము the enjoyment of pleasure. దుఃఖానుభవము suffering distress or grief. నరకానుభవము the suffering of hell, falling into hell. వాడు చేసినది వాడికే అనుభవమునకు వచ్చినది he has come in for the fruits of his actions. అనుభవవేద్యము that can be known by experience. అనుభవసిద్ధము that is confirmed by experience అనుభవదారుడు or అనుభవీకుడు he who enjoys, he who is experienced. అనుభవించేవాడు, అనుభవముగలవాడు. అనుభవపరుడు, అనుభవి or అనుభవశాలి A man of experience. వాడుకపడ్డవాడు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అనుభవమునకు వచ్చినది
అనువాదాలు
[<small>మార్చు</small>]
|
]] |