Jump to content

దెయ్యాలు వేదాలు వల్లించినట్లు

విక్షనరీ నుండి

వేదాలు అతి పవిత్రమయినవి. అలాంటి వేదాల్ని దెయ్యాలు వల్లిస్తుంటే ఎంత విచిత్రంగా ఉంటుందో అలానే దుర్మార్గులు, మూర్ఖులు ఇతరులకు సన్మార్గబోధ చేస్తుంటే మనకు విచిత్రంగానే ఉంటుంది. దీనినే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అంటారు.