బానిస
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకము
- నపుంసకలింగము.
- వ్యుత్పత్తి
- బహువచనం
- బానిసలు.
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]బానిస అంటే అమ్మబడిన మనిషి. బానిసీడు
- బానిస అనే పదం దేశ్యమా.... తద్బవమా? అనే చర్చ వుండనే వుంది. బానసం అంటే వంటిల్లు అని అర్థం. అక్కడ చేసే పని బానసం. అనగా ఆ పని చేసే వాడు బానసీడు . ఈ పదాన్ని కావ్వ భాషలో వాడుతారు. నేటి భాషలో బానిస అనే మాటకు వెట్టి చాకిరి చేయు వాడు అని అర్థం స్థిర పడింది. వారసత్వం లో లాగ,...... త్వం అనే సంస్కృత భావార్థక ప్రత్యయాన్ని చేర్చి బానిసత్వం అనే మాటనూ ప్రస్తుతం విరివిగా వాడుతున్నారు. తెలంగాణాలో వంట పాత్రలను బాసన్లు అని అంటారు. దీని పూర్వ రూపం బాసనలు వంట పనికీ,, బానిసత్వానికి చాల సంబందమున్నది. ఏది ఎలా వున్నా నేడు ఈ బానిస పదానికి ..... నోరెత్తకుండ చెప్పిన పని చేసే వాడనే అర్థం స్థిర పడి పోయింది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- సానితనంబేల బానిసగ నమ్ముమనన్