call
Appearance
(to call నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, పిలుపు.
- I heard his calls వాడు కేకలు వేసి పిలవడము విన్నాను.
- or occasion అక్కర.
- you had no call to do this దీన్ని చేయడమునకు నీకు యేమి పట్టినది.
- or visit దర్శనమునకు పోవడము.
- he passed his morning in calls వాడికి తెల్లవారి అంతా దర్శనమునకు పోవడముతో సరిపోయినది.
- he came at a call పిలవగానే వచ్చినాడు.
- I made a call upon him for the money ఆ రూకలను యిమ్మని వాణ్ని తగాదా చేసినాను.
- these two birds have different calls యీ పక్షి కూత వేరు, ఆ పక్షి కూత వేరు.
- he went to obey a call of nature : or he went to the necessary మల బాధకు పోయినాడు.
క్రియ, విశేషణం, పిలుచుట, కూసుట.
- to denominate పేరు బెట్టుట, అనుట, చెప్పుట.
- nothing took place that you could call injustice అన్యాయమన్నది యేమిన్ని సంభవించ లేదు.
- what do you call this in Telugu ? తెనుగులో దీనికి పేరేమి.
- the head farmers are called Reddis పెద్ద కాపులు రెడ్లు అనబడుతారు.
- he calls me his mother వాడు నన్ను తల్లి అంటాడు.
- he brought me a jumkhan (as rung) as it is called జంబుఖానా అనే ఒకటిని నాకు తీసుకొని వచ్చినాడు he called me నన్ను పిలిపించినాడు, రప్పించినాడు.
- she called me names నన్ను తిట్టింది.
- he called a council about this యిందున గురించి సభ కూర్చి ఆలోచించినాడు.
- call him అతణ్ని రమ్మను, అతణ్ని పిలువు.
- he called for me నన్ను రమ్మని చెప్పినాడు.
- he called for the accounts లెక్కలు తెమ్మన్నాడు.
- he called a meeting సభ కూర్చినాడు.
- I call you to witness that he did this వాడు యీ పని చేసినది నీవు యెరిగి వుండు దానికి నీవు సాక్షి.
- the ship called at Madras on her way toCalcutta ఆ వాడ కలకత్తాకు పోవడములో చన్న పట్టణపు రేవుకు పోయినది.
- I called him back to life.
- వాణ్ని మళ్లీ బ్రతికించినాను.
- I will call for you at your house మీ యింటికి వచ్చి నిన్ను పిలుచుకొని పోతాను.
- to call for పిలుపించుట, తెమ్మని ఆజ్ఞాపించుట.
- he calls for you అతడు నిన్ను పిలుస్తాడు.
- he called for help రక్షించమని అరిచినాడు.
- he called the boon in ఆ పుస్తకము మీద బరువెత్తి పెట్టి అణిగేటట్టు చేసినాడు.
- he called his debts in తనకు యివ్వవలసిన అప్పును వాండ్లు వాండ్లు చెల్లించి వేయ వలసిన దని ప్రకటన చేసినాడు.
- to call in old coin పాత నాణ్యమును కరిగి వేసుట.
- I called his account in question వాడి లెక్కను గురించిసందేహించినాను.
- when he was beaten he called out కొట్టేటప్పుడు అరిచినాడు.
- when I call this to mind నేను దీన్ని జ్ఞాపకము చేసుకొన్నప్పుడు.
- to call out in a duel కాల్చుకొని చత్తాము రమ్మని పిలుచుట.
- they called out upon him అతణ్ని కూకలు పెట్టినారు, చీవాట్లు పెట్టినారు.
- to call over or examine పట్టీ ప్రకారము 1ఝడ్తీ చూచుట.
- I called him to account for his conduct నీవు చేశిన పనికి సమాధానము చెప్పుమని అడిగినాను.
- God called him to light దేవుడు వాణ్ని భూమిలో పుట్టించినాడు.
- I called him up వాన్ని నిద్ర లేపినాను.
- I called the dogs off పయి బడకుండా కుక్కలను యివతలికి పిలిచినాను.
- they called upon him, to do thisదీన్ని చేయమని వాణ్ని వేడుకొన్నారు.
- I call upon you to answer this దీనికి నీవు జవాబు చెప్పవలసినది.
- I call upon or defy you to prove this దీన్ని నీవు రుజువు చేయగలవా, దీన్ని నీవు రుజువు చెయ్యగలవా 0చూతాము.
- when you go there you had better call on my brother నీవు అక్కడికిపోతే మంచిది మా అన్నను పోయి చూడు.
- I called upon God to help me నన్ను రక్షించుమని దేవుణ్ని ప్రార్థిస్తిని.
- to call upon (pay a visit) దర్శనమునకు పోవుట.
- I called upon him this morning నేడు తెల్లవారి అతని దర్శనమునకు పోయినాను. am I called upon to pay the money? ఆ రూకలను చెల్లించవలశిన భారము నాదా?
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).