విక్షనరీ:సముదాయ పందిరి

విక్షనరీ నుండి

కలసి పనిచేద్దాం రండి[<small>మార్చు</small>]


విభాగం 1 (అసలిదేంటి?)[<small>మార్చు</small>]

  • అసలీ విక్షనరీ ఏంటి?
    స్వాగతం! విక్షనరీ ఓ స్వేచ్ఛా నిఘంటువు. అందరూ కలిసి రాస్తున్న పదకోశం. ఎవరైనా ఇక్కడ రాయవచ్చు, రాసిన వాటిని సరిదిద్దవచ్చు. జరిగిన మార్పులన్నీ రికార్డు చేయబడతాయి.
  • దీని ప్రామాణికత ఏంటి? దీనిపై ఎంతవరకు ఆధారపడవచ్చు?
    ఎవరైనా రాయవచ్చు కాబట్టి ఇది ప్రామాణికంగా ఉండకపోవచ్చని అనుకోవచ్చు. అయితే ఎవరైనా రాయవచ్చు, సరిదిద్దవచ్చు కాబట్టే ఇక్కడి పదాల అర్థాలు, అనువాదాలు ఎప్పటికప్పుడు మెరుగుపడుతూ దోషరహితంగా ఉంటాయి. మచ్చుకు కొన్ని పేజీలను ఇక్కడ గానీ, ఇంగ్లీషు విక్షనరీలోని పదాలకు తెలుగు అర్థాలను గాని చూడండి. మీకేమైనా తప్పులు కనిపిస్తే వెనుకాడకుండా వెంటనే సరిదిద్దండి. ఈ విక్షనరీ పనిచేసే మూల సూత్రమదే! మరీ ముఖ్యంగా వివిధ మాండలికాలలోని పదాలను రాసేటపుడు ఒకరికో లేదా ఏ కొద్దిమందికో అన్ని మాండలిక పదాల గురించీ తెలీకపోవచ్చు. ఆయా ప్రాంతాలకు చెందినవారికే ఈ పదాలు తెలుస్తాయి. ఎంత ఎక్కువమంది సభ్యులు పాల్గొంటే అంత మెరుగైన పదకోశం తయారవుతుంది.
  • ఇక్కడ రాసేవారు తెలుగు పండితులా, భాషావేత్తలా?
    ఇక్కడ ఎవరైనా రాయవచ్చు.. పండితులైనా, లేక సాధారణ పాఠకులైనా! ప్రస్తుతం ఇక్కడ రాస్తున్నవారిలో సాధారణ తెలుగు పరిజ్ఞానం ఉన్నవారే ఎక్కువ!
  • విక్షనరీ గురించి ప్రముఖులేమంటున్నారు?
    ఇంకా అటువంటిదేమీ లేదు.
  • విక్షనరీని వాడుతున్న లేదా ఇక్కడ రాస్తున్న ప్రముఖ వ్యక్తులు గానీ సంస్థలు గానీ ఉన్నాయా?
    ప్రస్తుతానికి లేరు.
  • వ్యాకరణం గురించి కూడా ఇక్కడ ఉంటుందా?
    ఉండదు.
  • విక్షనరీ గురించి నా అభిప్రాయాలెక్కడ రాయాలి?
    1. మీ అభిప్రాయం ప్రత్యేకించి ఏదైనా పదం గురించినదైతే సదరు పదం యొక్క చర్చా పేజీలో రాయండి.
    2. విక్షనరీ భావన, పనితీరు, ఆకృతి మొదలైనవాటి గురించి చర్చించదలిస్తే Wiktionary:రచ్చబండ లో రాయండి.
    3. ఎవరైనా ఒక సభ్యుని రచనల గురించి చర్చించదలిస్తే సదరు సభ్యుని చర్చా పేజీలో రాయండి.
    మీ అభిప్రాయాలు, విమర్శలు కేవలం చర్చా పేజీల్లోనే రాయాలి. ప్రతీ రచన చివర నాలుగు లేదా ఐదు టిల్డె లతో - ~~~~ - ఇలా సంతకం చెయ్యడం మాత్రం మరువకండి.

విభాగం 2 (మాటలూ మాట్లూ)[<small>మార్చు</small>]

  • విక్షనరీని శోధించడం ఎలా?
    1. ఒక వ్యాసం నుండి మరోదానికి లింకులు పట్టుకుని పోవచ్చు.
    2. పైన ఉన్న అన్వేషణ పెట్టెను వాడవచ్చు.
    3. వర్గాలను అనుసరించి శోధించవచ్చు.
    4. ఇటీవలి మార్పులు లింకు ద్వారా శోధించవచ్చు. ఈ మధ్య కాలంలో ఏమేం మార్పులు జరిగాయో ఇక్కడ చూడొచ్చు.
    5. నా మార్పులు చేర్పులు లింకు ద్వారా శోధించవచ్చు. అయితే మీరు లాగిన్ అయి ఉండాలి.
    6. ఎడమ వైపు పరికర పెట్టెలో ఇక్కడికి లింకున్న పేజీలు ద్వార కూడా శోధించవచ్చు.
    7. అక్కడే ఉన్న ప్రత్యేక పేజీలు లింకును నొక్కితే వచ్చే ప్రత్యేక పేజీలోని కొత్త పేజీలు, అన్ని పేజీలు లింకుల ద్వారా కూడా శోధించవచ్చు.
    8. ఇంకా యాదృచ్ఛిక పేజీ ద్వారా కూడా శోధించవచ్చు
  • నాక్కావలసిన పదం కోసం ఎలా వెదకాలి?
    1. పైన గల అన్వేషణ పెట్టెలో పదాన్ని రాసి వెళ్ళు లేదా అన్వేషణ నొక్కండి.
    2. పేజీ దొరక్కపోతే.., పేరు రాయడంలో తప్పుందేమో చూడండి.
    3. ఒకవేళ మీరు వెతికింది, పదం యొక్క బహువచనం కోసమైతే.. ఈసారి ఏకవచనం రాసి, మళ్ళీ ప్రయత్నించండి.
    4. అయినా దొరక్క పోతే.. ఇతర రూపాల కోసం ప్రయత్నించండి. క్రియా పదమైతే.. ఇతర క్రియా పదాల కోసం చూడండి. ఉదాహరణకు వినెను అనే పదం దొరకలేదనుకోండి.., విను, వినుట కోసం కూడా వెతకండి. అవి దొరకొచ్చు.
    5. ఇంత ప్రయత్నించినా దొరక్కపోతే.. ఇక ఆ పదం లేనట్లే! ఆ పదాన్ని Wiktionary:కోరిన పదాలు పేజీలో చేర్చండి.
  • నేనూ రాద్దామనుకుంటున్నాను. పద్ధతులేంటి?
    • ఓ పేజీలో ఉన్న సమాచారం తప్పనిపిస్తే ఏంచెయ్యాలి?
      1. ముందుగా సంబంధిత పేజీ యొక్క చర్చా పేజీని చూడండి. ఇదివరలో అక్కడ జరిగిన చర్చ ద్వారా మీకో పరిష్కారం దొరకొచ్చు.
      2. పేజీలో ఉన్న సమాచారం తప్పని మీకు నిర్ధారణగా తెలిసినపుడు, తగు మార్పు చేసెయ్యండి. అయితే మీ వాదనను బలపరచే ప్రచురణనో, లింకునో జతపరచండి. దానితో మీరు చేసిన మార్పును అందరూ అంగీకరించేందుకు మార్గం సులువవుతుంది.
      3. తప్పని మీకు తెలిసినా, మీ వాదనను బలంగా నొకి చెప్పలేని పరిస్థితి ఉంటే.. మీ వాదనను చర్చా పేజీలో రాసి, సభ్యుల స్పందనకోసం ఓ రెండు రోజులు చూడండి. మీ వాదనను ఎవ్వరూ వ్యతిరేకించకపోతే, మార్పులు చేసెయ్యండి.
      4. తప్పు అని ఖచ్చితంగా మీకు తెలీకపోతే.. మీ అభిప్రాయాన్ని చర్చలో పెట్టండి.
    • ఉన్న పేజీలలో కొత్త సమాచారాన్ని ఎలా చేర్చాలి?
      1. కొత్త సమాచారాన్ని పేజీలోని ఏ విభాగంలో రాయాలో చూసి, అక్కడ రాయండి.
      2. సంబంధిత విభాగం అక్కడ లేకపోతే, ఆ విభాగాన్ని మీరే సృష్టించండి.. ==కొత్త విభాగం పేరు==, ===కొత్త ఉప విభాగం పేరు=== - ఇలా. అయితే విభాగం సృష్టించేటపుడు విక్షనరీ ప్రామాణిక మూసకు తగినట్లుగా ఉండాలని గుర్తుంచుకోండి.
    • కొత్త పదానికి పేజీని తయారుచేసేటపుడు ఏమైనా ప్రత్యేక మూసలు, పద్ధతులను పాటించాలా?
      అవును, పాటించాలి.
      1. ముందుగా ఆ పదానికి పేజీ ఇప్పటికే ఉందేమో చూడండి. ఎడమ పక్క్కన ఉన్న అన్వేషణ పెట్టెలో పదాన్ని రాసి వెళ్ళు నొక్కండి. ఇప్పటికే ఆ పదానికి పేజీ ఉంటే, ఆ పేజీకి వెళ్తుంది. లేదంటే, లేదని చెప్తూ ఆ పేజీని సృష్టించేందుకు పేజీని సృష్టించు అనే ఎర్రని లింకు ఇస్తుంది. ఆ లింకును నొక్కినపుడు పేజీ సృష్టించే దిద్దుబాటు పేజీకి వెళ్తుంది. అక్కడ మీరు పేజీని సృష్టించవచ్చు.
      2. వికషనరీని ఒక ప్రత్యేక ఆకృతిలో తయారుచెయ్యడం కోసం పెజీ ఎలా ఉండాలనే విషయమై ఒక మూసను తయారుచేసాం. మీరు సృష్టించే పేజీ ఆ మూసలోనే ఉండాలి. అయితే మూసలో మార్పులు అవ్సరమని మీకనిపిస్తే, ఆ మూస చర్చా పేజీలో రాయండి. సభ్యులు చర్చించిన తరువాత తగువిధమైన మార్పులు చెయ్యవచ్చు.
    • నాకో పదం తెలుసు.., దానికో పేజీ తయారు చేద్దామనుకుంటున్నాను. కానీ ఆ పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఖచ్చితంగా తెలీదు. ఏంచెయ్యాలి?
      ఈ సమస్య సాధారణంగా సభ్యులెదుర్కొనేదే! మీరా పదాన్ని Wiktionary:పదము-సరైన ఉచ్చారణ పేజీలో రాయండి. సభ్యుల వ్యాఖ్యలతో ఓ రెండు మూడు రోజుల్లో సరైన ఉచ్చారణేదో తెలిసిపోతుంది. ఆ తరువాత ఆ పేజీని సృష్టించవచ్చు. ఓ ముఖ్యవిషయం.. తొందరపడి ఓ తప్పు రాసేబదులు కొంత ఆలస్యమైనా సరైన పదం రాయడం మంచిది.
    • ఇప్పటి వరకూ లేని కొత్త పదం ఒకదాన్ని ఫలానా పత్రికలో చూసాను. దాని గురించి రాయొచ్చా?
      తప్పకుండా! మీరది ఎక్కడ చూసారో ఆ వనరును రాస్తూ, సందర్భ వివ్రణ కోసం కొన్ని వాక్యాలు కూడా రాయండి. వెబ్‌లింకుంటే మరీ మంచిది. ముద్రిత వనరైతే, ఆ పేజీని స్కాను చేసి పంపించండి.
    • నేనే ఓ కొత్త పదాన్ని చలామణీ చేద్దామనుకుంటున్నాను. చెయ్యొచ్చా? అయితే ఎలా?
      చెయ్యొచ్చు. మామూలుగానే ఆ పదానికి పేజీని సృష్టించండి. అర్థాన్ని వివరించండి. ఆ పదానికి వ్యుత్పత్తి రాయడం తప్పనిసరి. అలాగే, పేజీకి పైభాగంలో {{కొత్తమాట}} అనే మూసను తప్పక పెట్టండి.
    • నేను రాసిన దాన్ని మరొకరు సరిదిద్దారు.. పైగా తప్పులు రాసారు. ఇలా అయితే ఎలాగండీ?
      వికీ అంటేనే ఎవరైనా రాయొచ్చు, రాసిన దాన్ని ఎవరైనా దిద్దవచ్చు అని అర్థం. మీరు రాసినదాన్ని దిద్దడమనేది ఆక్షేపణీయమేమీ కాదు. అయితే, ఆ దిద్దుబాటు తప్పైతే, ఆ పేజీ యొక్క చర్చా పేజీలో వివరించండి. రెండు మూడు రోజుల్లో తగు సమాధానం రాకుంటే, మళ్ళీ మీరా పేజీని సరిదిద్దండి. ఈ విధమైన తప్పుడు దిద్దుబాట్లు ఒకే సభ్యుడు పదే పదే చేస్తున్నట్లు మీరు గమనిస్తే తగు చర్య కొరకు ఎవరైనా నిర్వాహకుడి దృష్టికి తీస్కువెళ్ళండి.
  • ఓ పదానికి అర్థం కోసం చూస్తున్నాను. కానీ దానికిక్కడ పేజీ లేదు. విక్షనరీ నాకేమైనా సాయం చేస్తుందా?
    కొత్త పదాలకు పేజీలు సృష్టించడంలో విక్షనరీ సభ్యులు ఉత్సాహంగా ముందుకొస్తారు. మీకు అవసరమైన పదాన్ని కోరిన పదాలు పేజీలో చేర్చండి. కొద్ది రోజులలోనే మీ పేజీ తయారవుతుంది.
  • ఓ పదానికి పేజీ ఇప్పటికే ఉంది. దాని బహువచనానికి కూడా ఓ పేజీ చేద్దామనుకుంటున్నాను, చెయ్యొచ్చా?
    మామూలుగా తెలుగులో బహువచనాలు ఏకవచన పదానికి లు చేర్చడంతో ఏర్పడతాయి. అంచేత ప్రత్యేకించి బహువచనానికి పేజీ అవసరం లేదని భావించాము. అయితే కొన్ని పదాలకు బహువచనాలు అలాకాక విభిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు కాలు - కాళ్ళు. ఇటువంటి పదాల విషయంలో ఏకవచనంతో పాటు, బహువచన పదానికి కూడా పేజీ సృష్టించవచ్చు. మీకీ విధానంపై ఆక్షేపణలుంటే Wiktionary:విధానాలు పేజీ చర్చా పేజీలో రాయండి.

విభాగం 3 (సాంకేతికం, విధానాలు)[<small>మార్చు</small>]

  • కంప్యూటర్లో తెలుగెలా రాయాలి?
    ఈ వివరాల కొరకు ‌టైపింగ్ సహాయం చూడండి.
  • ఈ నేంస్పేసులేంటి?
    విక్షనరీ అనేది ప్రజలే స్వయంగా తయారుచేస్తున్న ఒక పదకోశం. ఈ బ్ర్హత్తర కార్యంలో ఎవరైనా పాల్గొనవచ్చు. సార్వజనీనమైన ఈ పనిలో సాఫ్ట్‌వేరు గురించి ఏమాత్రం తెలీనివారు కూడా పాలుపంచుకుంటారు. కాబట్టి, విక్షనరీ అనేది ఎవరైనా తేలికగా పనిచెయ్యగలిగేలా ఉండాలి. ఈ సౌలభ్యాన్ని సాధించేందుకు విక్షనరీని అనేక విభాగాలుగా విభజించారు. ఆ విభాగాలే నేంస్పేసులు. విక్షనరీలో కింది నేంస్పేసులు ఉన్నాయి.
  1. మెయిన్: పదకోశంలోని పదాల పేజీలన్నీ ఇందులో ఉంటాయి. పేజీ పేరుకు ముందు ఏమీ ఉండదు.., పదం పేరే పేజీ పేరవుతుంది.
  2. టాక్: పదాల పేజీలకు సంబంధించిన చర్చా పేజీలు ఇందులో ఉంటాయి.
  3. యూజర్: సభ్యుల స్వంత పేజీలు ఇందులో ఉంటాయి. సభ్యులు తమ వివరాలను ఇక్కడే రాసుకుంటారు.
  4. యూజర్ టాక్: సభ్యులకు సంబంధించిన చర్చా పేజీలు ఈ నేంస్పేసులో ఉంటాయి.
  5. విక్షనరీ: విక్షనరీ అంతర్గత విషయాల కోసం ఈ నేంస్పేసు ప్రత్యేకించబడింది.
  6. విక్షనరీ టాక్: విక్షనరీ అంతర్గత విషయాలపై చర్చ కోసమిది.
  7. ఇమేజి: ఈ నేంస్పేసులో బొమ్మలు ఉంటాయి.
  8. ఇమేజి టాక్: బొమ్మలపేజీలపై చర్చ కొరకిది
  9. హెల్ప్: విక్షనరీలో పనిచెయ్యడం ఎలా అనే విషయమై సహాయం పేజీలు ఈ నేంస్పేసులో ఉంటాయి
  10. హెల్ప్ టాక్: సహాయం పేజీలపై చర్చ కొరకిది.
  11. స్పెషల్: కొన్ని ప్రత్యేక పేజీలు ఈ నేంస్పేసులో ఉంటాయి. ఈ పేజీలను సభ్యులు సృష్టించేవి కావు.. సాఫ్ట్‌వేరే వీటిని సృష్టిస్తుంది.
  12. టెంప్లేట్: మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకొనగల మూసలను ఈ నేంస్పేసులో తయారు చెయ్యాలి.
  13. టెంప్లేట్ టాక్: మూసలకు సంబంధించిన చర్చా పేజీలు ఇందులో ఉంటాయి.
  14. కాటగిరీ: వర్గాల పేజీలు ఇక్కడ ఉంటాయి
  15. కాటగిరీ టాక్:వర్గాల చర్చా పేజీలు ఇందులో ఉంటాయి.
  • మూసలేమిటి?
    ఏదైనా ఒక సమాచారం అనేక పేజీలకు సామాన్యంగా ఉంటే, సదరు సమాచారాన్ని ప్రతీ పేజీలోనూ రాసేపనిలేకుండా చేసిన ఏర్పాటిది. ఆ సమాచారంతో ఓ కొత్త పేజీని తయారుచేస్తాం. అదే మూస. ఈ మూస పేరును మా..త్రం ఆయా పేజీల్లో రాస్తే చాలు, ఆ సమాచారం ఆ పేజీల్లో వచ్చి చేరుతుంది. దీనివలన ప్రతీపేజీలోను ఆ సమాచారం రాసే అవసరం తప్పుతుంది. మరింత సమాచారం కొరకు Wiktionary:మూసలు చూడండి. మూసను మామూలు పేజీని సృష్టించినట్లే సృష్టించవచ్చు. నామూస అనే మూసను సృష్టించాలనుకోండి.. ఇలా రాయాలి..
    [[Template:నామూస]]
    ఈ మూసను ఏదైనా పేజీలో వాడేటపుడు ఆ పేజీలో మీరు వాడదలచిన చోట ఇలా రాయాలి..
    {{నామూస}}. అంతే! ఆ మూసలో ఉన్న సమాచారం ఈ పేజీలోకి వచ్చి చేరుతుంది.
  • వర్గాలేమిటి?
    ఒకే విధమైన లక్షణాలు కలిగిన పేజీలను ఒక సమూహంగా చేర్చడమే వర్గీకరణ. ఈ సమూహాలే వర్గాలు. ఒక ఉదాహరణ: అమ్మ, నాన్న, అన్న, అక్క అనే పదాలన్నీ మానవ సంబంధాలకు చెందినవి. వీటిని మానవసంబంధాలు అనే వర్గానికి చేర్చవచ్చు. అలాగే అమ్మ, అక్క లను స్త్రీలింగ పదాలు అనే వర్గానికి, నాన్న, అన్న లను పుల్లింగ పదాలు అనే వర్గానికి చేర్చవచ్చు. ఒక్కో పేజీని ఎన్ని వర్గాలలోకైనా చేర్చవచ్చు.. అవి తార్కికంగా ఉంటే చాలు. వర్గాల కారణంగా పేజీల శోధన సులువవుతుంది. విక్షనరీకి ఒక చక్కటి ఆకృతి ఏర్పడుతుంది కూడా. వర్గాల గురించి మరింత సమాచారం కోసం Wiktionary:వర్గాలు చూడండి. ఒక పేజీని ఏదైనా వర్గంలోకి చేర్చడమంటే ఆ పేజీలో సదరు వర్గం పేరును చేర్చడమే! ఆ పేజీలో అన్నిటికంటే చివరన, ట్రాన్స్‌వికీ లింకులకు పైన [[Category:వర్గం పేరు]] అని రాయాలి. దాంతో ఆ పేజీ sadaru వర్గం లోకి చేరిపోతుంది.
  • దిద్దుబాటు చెయ్యడం ఎలాగో టూకీగా చెబుతారా? పేజీలకు పేజీలు చదివే ఓపిక ప్రస్తుతం నాకు లేదు.
    1. మీరు దిద్దుబాటు చెయ్యదలచిన పేజీ యొక్క "మార్చు" లింకును నొక్కండి.
    2. దిద్దుబాటు పేజీ ప్రత్యక్షమౌతుంది.
    3. అక్కడ మీరు చెయ్యవలసిన మార్పులు చెయ్యండి.
    4. మీరు చేసిన మార్పులను వివరిస్తూ ఒక చిన్న సారాంశాన్ని కిందనున్న పెట్టెలో రాయండి.
    5. మీరు చేసింది చిన్న మార్పయితే, చిన్నమార్పు పెట్టెను టిక్కు చెయ్యండి.
    6. ఆ పేజీ మీ వీక్షణ జాబితాలో చేర్చాలనుకుంటే.. ఆ పెట్టెను కూడా టిక్కు చెయ్యండి.
    7. పేజీని భద్రపరచేముందు, సరిచూడు మీటను నొక్కి, మీరు చేసిన మార్పులను ఒక్కసారి సరిచూసుకోండి.
    8. అంతా బాగుందనుకుంటే, భద్రపరచు మీటను నొక్కి, మీ మార్పులను భద్రపరచండి.
    అయితే మీరు రాసిన గద్యాన్ని ఒక ఆకృతిలో పెట్టదలిస్తే దానికి అనుగుణంగా తగు అలంకారాలు చెయ్యాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొంత భాగాన్ని బొద్దుగా చెయ్యడం, ఇటాలిక్కుగా మార్చడం, ఒక కొత్త విభాగం తయారుచెయ్యడం, ఒక జాబితాను కూర్చడం, ఒక నిర్వచనాన్ని రాయడం వంటి అనేక అలంకారాలు ఈ ఎడిటరు ద్వారా చెయ్యవచ్చు. అయితే ఈ ఎడిటరు మీరేది రాస్తే అదే కనపడే WYSYWIG రకం కాదు. ఫలానా అలంకారం కావాలంటే ఫలానా విధంగా రాయాలి అనే పద్ధతులున్నాయి. ఆయా పద్ధతులను ఇక్కడ చూడండి.
  • చర్చించడం ఎలా?
    • ఫలానా పదం గురించి
    • విధానాలు, సంవిధానాల గురించి
  • కాపీహక్కుల గొడవేమిటి?
  • నాదగ్గరో నిఘంటువు ఉంది. దాన్లోంచి ఉన్నదున్నట్లు దించొచ్చా?
  • బొమ్మలు కూడా పెట్టొచ్చా? అయితే ఎలా?
  • ఇక్కడ రాయాలంటే సభ్యత్వం తప్పనిసరా?
    తప్పనిసరేమీ కాదు. అయితే ఉంటే మంచిది. దీనివలన కింది ప్రయోజనాలు ఉన్నాయి.
    1. మీ ఎకౌంటు ద్వారా లాగిన్ అయిన తరువాత రచనలు చేస్తే.. మీ రచనల శ్రేయస్సు మీకే చెందుతుంది.
    2. ఎవరు రాసారో మిగతా సభ్యులకు తెలుస్తుంది కూడా. దీనివలన వారు మీతో కలిసి పనిచెయ్యడం సౌకర్యంగా భావిస్తారు. ఓ శంకరరావు గారితోటో, లక్ష్మి గారితోటో కలిసి పనిచెయ్యడానికి బాగుంటుందిగానీ, 66.221.78.112 తో కలిసి పని చెయ్యాలంటే కష్టమే కదండీ!
    3. చర్చలో పాల్గొన్నపుడు తాము ఎవరితో చర్చిస్తున్నామో మిగతా సభ్యులకు తెలుస్తుంది. అంచేత వారు మరింత చొరవగా చర్చలో పాల్గొనగలుగుతారు.
    4. అన్నిటికీ మించి, అజ్ఞాతంగా రాస్తున్నపుడు, మీ పేరుకు బదులు మీ ఐ.పి.అడ్రసు నమోదవుతుంది. అదే అడ్రసుతో ఇతరులు కూడా రాసే సంభావ్యత ఉంది. ఒకవేళ వారు తప్పుడు పనులు చేస్తే..దానిపై నిర్వాహకులు చర్య తీసుకుంటే.., దానికి మీరు అనవసరంగా బలవుతారు.. అన్యాపదేశంగా బాధ్యులూ అవుతారు.
    కాబట్టి ఎకౌంటు తెరిచి, లాగిన్ అయి, రచనలు చేస్తే మంచిది.
  • నా అభిరుచులు ఎలా సెట్ చేసుకోవాలి?
  • ప్రత్యేక పేజీలేమిటి?
  • నిర్వాహకత్వం ఏమిటి? ఇక్కడ నిర్వాహకులెవరు? నిర్వాహకత్వం కావాలంటే ఏంచెయ్యాలి?

విభాగం 4 (తప్పక చూడండి)[<small>మార్చు</small>]

అనేక పేజీలను ప్రభావితం చేయగల పెద్ద మార్పులను తలపెట్టారా? అయితే ఇవి చూడండి.

  1. మొత్తం మూసల జాబితా (కొత్త మూస తయారు చేసేముందు దీన్ని చూడండి)
  2. మొత్తం వర్గాల జాబితా (కొత్త వర్గం తయారు చేసేముందు దీన్ని చూడండి)