Jump to content

విక్షనరీ:పదము-సరైన ఉచ్చారణ

విక్షనరీ నుండి

పదాల ఉచ్చారణకు సంబంధించిన సందేహాల నివృత్తికి ఈ పేజీ సాయపడుతుంది. విక్షనరీలో ఇంకా పేజీ సృష్టించబడని పదాలకు సంబంధించింది మాత్రమే! ఒకవేళ మీకు సందేహం ఉన్న పదానికి ఇప్పటికే పేజీ ఉంటే.. మీ సందేహాన్ని అక్కడే రాయండి.

సందేహాలడిగే సభ్యులకు సూచనలు: మీకు సందేహం ఉన్న పదాన్ని రాస్తూ, మీ సందేహం ఏమిటో వివరంగా రాయండి. మీ సందేహం పదం యొక్క అర్థానికి సంబంధించినదైతే.. ఆ పదానికి పేజీ సృష్టించి, దాని చర్చాపేజీలో రాయండి. ఇక్కడ రాయవద్దు. ఇది కేవలం పదం యొక్క స్పెల్లింగు గురించిన సందేహాల కొరకు మాత్రమే!

సలహాలిచ్చే సభ్యులకు సూచనలు: సమాధానం మీకు ఖచ్చితంగా తెలిస్తేనే సలహా రాయండి. మీక్కూడా సందేహాస్పదంగా ఉంటే.. అదే విషయాన్ని విపులంగా రాయండి. వీలయితే ఏదైనా మూలాన్ని ఉదహరించండి.


స్మశానం/శ్మశానం

[<small>మార్చు</small>]

స్మశానం, శ్మశానం -ఈ రెంటిలో ఏది సరైనది?

స్మశానం అనేదే నాకు తెలిసినంత వరకూ సరైన పదం. పలికేటప్పుడు కొంత మంది శ్మశానం అంటారు కానీ నమ్మదగిన పుస్తకాలలో శ్మశానం అని ఉండడం నేనెప్పుడూ చూడలేదు.

శ్మశానం సరైనదని బూదరాజు రాధాకృష్ణ గారు రాసిన మాటలూ మార్పులూ పుస్తకంలో రాసారు. __210.18.146.227 09:38, 18 సెప్టెంబర్ 2006 (UTC)

కల్యాణం / కళ్యాణం

[<small>మార్చు</small>]

కల్యాణం / కళ్యాణం --ఈ రెంటిలో ఏది సరైనది?

  • కళ్యాణం సరి అయిన పదము.

ళ కింద ళ ఒత్తు/ల ఒత్తు

[<small>మార్చు</small>]
  • పెళ్ళి / పెళ్లి
  • రాళ్ళు / రాళ్లు

ఇటువంటి ళ కింద ళ/ల ఒత్తులుండే పదాలు ఎలా రాయాలి?