Jump to content

విక్షనరీ:విధానాలు

విక్షనరీ నుండి

తెలుగు విక్షనరీకి సంబంధించిన విధానాలను ఈ పేజీలో చూడవచ్చు. ఈ పేజీలోని విధానాలు ఇంకా రూపకల్పన దశలోనే ఉన్నాయి. విస్తృతామోదం పొందాకే అధికారిక విధానాలవుతాయి. ఈ విధానాలపై మీ అభిప్రాయాలను చర్చాపేజీలో రాయండి.

ఎటువంటి పదాలకు పేజీ తయారుచెయ్యవచ్చు

[<small>మార్చు</small>]

ఏయే పదాలకు పేజీలు సృష్టించవచ్చో ఏయే పదాలకు కూడదో ఈ విభాగంలో చూడవచ్చు. పేజీ సృష్టించబోయేముందు ఒక విషయాన్ని మననం చేసుకోవాలి. మీరు తయారుచేసే పేజీని చిన్నపిల్లలు కూడా చూస్తారు. మీ రచన వారికి ఉపయోగపడేదిగా ఉండాలి.

తెలుగు పదాలు

[<small>మార్చు</small>]
  • ఇది ప్రధానంగా తెలుగు నిఘంటువు. ప్రతీ తెలుగు పదానికీ ఓ పేజీ ఉంటుంది. ఆ పేజీల్లో తెలుగు అర్థాలతో పాటు ఇంగ్లీషు, హిందీ వంటి ఇతర భాషల అర్థాలు కూడా అదే పేజీలో ఇస్తాము. ఏ భాష పదమైనా దాన్ని తెలుగు లిపిలో తప్పకుండా రాయాలి. సదరు భాషకు చెందిన లిపిలో కూడా రాయవచ్చు, రాయకున్నా పరవాలేదు. కానీ ఆయా భాషల పదాలకు ప్రత్యేకించి పేజీలు తయారు చెయ్యరాదు. అయితే ఇంగ్లీషు భాష వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, ఇంగ్లీషు పదాలకు కూడా పేజీలు తయారుచెయ్యాలని నిశ్చయించాము. అయితే ఈ ఇంగ్లీషు పదానికి సంబంధించిన పేజీ, సంబంధిత తెలుగు పదానికి దారి చూపించే దారిమార్పు పేజీ మాత్రమే! ఇతర భాషా పదాలకు ప్రత్యేకించి పేజీలుండవు.
  • లింగ తటస్థత: పేజీలో పదానికి వివరణ ఇచ్చేటపుడు సాధ్యమైనంత వరకు లింగ తటస్థతను పాటించాలి.
  • లింగ స్పష్టత: స్త్రీ, పురుష లింగాల్లోను, బహువచనంలోను పదం పొందే మార్పులను ఉదాహరణలతో వివరించాలి.
  • సాధారణంగా పదం యొక్క వ్యావహారిక రూపానికి పేజీ సృష్టించాలి. ఆ పేజీలో పదం యొక్క గ్రాంధిక, సరళ గ్రాంధిక రూపాలను కూడా రాయవచ్చు.

జాతీయాలు

[<small>మార్చు</small>]

జాతీయాలు, నుడికారాలకు కూడా పేజీలు సృష్టించవచ్చు.

సామెతలు

[<small>మార్చు</small>]

తెలుగు సామెతలకు పేజీలు తయారుచెయ్యవచ్చు. విరివిగా వాడుకలో ఉన్న సంస్కృత సామెతలకు ("యథా రాజా తథా ప్రజా" వంటివి) కూడా పేజీలు తయారుచెయ్యవచ్చు.

బహువచనాలు

[<small>మార్చు</small>]

మామూలుగా తెలుగులో ఏకవచన పదానికి లు చేర్చడంతో బహువచనాలు ఏర్పడతాయి. అంచేత ప్రత్యేకించి బహువచనానికి పేజీ అవసరం లేదని భావించాము. అయితే కొన్ని పదాలకు బహువచనాలు అలాకాక విభిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు కాలు - కాళ్ళు. ఇటువంటి పదాల విషయంలో ఏకవచనంతో పాటు, బహువచన పదానికి కూడా పేజీ సృష్టించవచ్చు.

క్రియాపదాలు

[<small>మార్చు</small>]

సాధారణంగా నామవాచక రూపానికి పేజీని సృష్టించాలి. పేజీలో ఆ రూపానికి వివరణ ఇస్తూనే పదం యొక్క క్రియా రూపానికి కూడా వివరణ ఇవ్వాలి. క్రియారూపానికి ప్రత్యేక పేజీని సృష్టించినప్పటికీ, అందులో ఫలానా పదానికి క్రియారూపమని రాసి నామవాచక పేజీకి లింకిస్తే సరిపోతుంది. క్రీయా పదాల యొక్క భూత, భవిష్యత్, వర్తమాన రూపాలన్నిటికీ పేజీలు సృష్టించవచ్చు. ప్రతీ పేజీనుండి మిగిలిన వాటికి లింకులు ఉండాలి.

కొత్త పదాలు

[<small>మార్చు</small>]

పత్రికల్లోను, ఇతరవిధాలుగానూ వ్యాప్తిలోకి వస్తున్న కొత్త పదాలకు కూడా పేజీలు సృష్టించవచ్చు. తెలుగు పదాల స్థానంలో వ్యాప్తిలోకి వస్తున్న ఇంగ్లీషు పదాలు ఈ కోవలోకి రావు. బ్లాక్ హోల్ అనే ఇంగ్లీషు పదాన్ని కృష్ణబిలం గా పత్రికలు అనువదించాయి. కృష్ణబిలం అనేది కొత్త పదం అవుతుంది. అంతేకాని, బ్లాక్ హోల్ అనేది కాదు. ఈ పదానికి పేజీ తయారుచేసినపుడు, ఆ పదాన్ని ఎవరు ప్రయోగించారో.., ఆ మూలాన్ని కూడా వివరించాలి.

కూడనివి

[<small>మార్చు</small>]

కింది పదాలకు విక్షనరీలో పేజీలు తయారుచెయ్యరాదు. వీటికి పేజీలు తయారుచేసే విషయమై మీ అభిప్రాయాన్ని రచ్చబండలో రాయండి.

  1. మనుష్యుల పేర్లు
  2. ఇంటిపేర్లు
  3. ఊరిపేర్లు
  4. సాధారణ బహువచన పదాలు: ఏకవచన పదానికి లు చేర్చగా ఏర్పడే బహువచనపదాలు.