విక్షనరీ చర్చ:విధానాలు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

పదమొక్కటే.., రూపాలెన్నో![<small>మార్చు</small>]

ఒక్కో పదానికి చెందిన వివిధ రూపాల జోలికి పోతే అనేక పదాలు, వాటికి పేజీలు అవసరమయ్యేట్లున్నాయి. ఉదాహరణకు నవ్వు అనే పేజీ ..

నామవాచకము

మనిషి ఆనందాన్ని, ఉల్లాసాన్ని వ్యక్తపరచే ఒక కవళిక బహు: నవ్వులు

క్రియ
నవ్వు, నవ్వుట
భూత
నవ్వెను, నవ్వేను, నవ్వింది, నవ్వేడు, నవ్వేరు, నవ్విరి, నవ్వినాడు, నవ్వినారు, నవ్వినది, నవ్వియున్నది, నవ్వియున్నాడు, నవ్వియున్నారు, నవ్వలేదు, నవ్వియుండలేదు

ఒక్క భూతకాలానికే ఇన్ని ఉన్నాయి కదా..! మరి అన్నిటికీ పేజీలు సృష్టించాలా!?

ఆమె అయినా, అతడయినా, వారయినా.. ఇంగ్లీషులో ఒకటే..laughed! కానీ మనకలా కాదే! స్త్రీ, పురుష లింగాలు, బహువచనాలు, గౌరవ వాచకాలు, వ్యావహారికాలు, గ్రాంధికాలు ఇన్ని రకాల రూపాలకు పేజీలో చోటివ్వాలంటే పేజీ మూస బాగా కట్టుదిట్టంగా ఉండాలి. ఇంగ్లీషు విక్షనరీ నుండి కాస్త పక్కకు జరిగి.. మనమే ఒక ఒరవడిని సృష్టించుకుంటే బాగుంటుందేమో! కొన్ని మూసలు చేసుకుంటే బాగుంటుందా..!?__చదువరి 12:27, 6 April 2006 (UTC)

పదాలు భాషలు[<small>మార్చు</small>]

ఇక్కడ ఉన్న మొదటి నిబంధన ఒక సారి పరిశీలించి, చర్చ జరిపి తగిన మార్పులు చేయాలి. అందులో ముఖ్యమైనది ఏఏ భాషల పదాలకు అర్ధాలు ఉండాలి, ఏ భాషలో అర్ధాలు ఉండాలి.

నా అభిప్రాయం ప్రకారం అన్ని భాషల పదాలకు పేజీలు ఉండాలి, ఆ పేజీలలో పదాలకు వివరణ మాత్రం తెలుగు మాతృభాషగా కలవారికి ఉపయోగపడేటట్లు ఉండాలి. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 03:51, 13 సెప్టెంబర్ 2007 (UTC)