వాడుకరి:Mpradeep

విక్షనరీ నుండి

వీక్షనరీలో నేను చేసిన దిద్దుబాట్లు ఇంటరిఓట్ సాధనం ఈ విధముగా చూపుతుంది.

తెలుగు వికీపీడియాలో నా పేజీ చూడండి.

తెలుగు వీక్షనరీని గూగుల్లో వెతకండి

తెలుగు వీక్షనరీ గణాంకాలు[<small>మార్చు</small>]

మొత్తం వ్యాసాలు 1,06,548
మొత్తం పేజీలు 1,22,532
ఇప్పటిదాకా జరిగిన మార్పులు-చేర్పులు 9,67,488
వ్యాసాలు, మార్పులు-చేర్పుల నిష్పత్తి 9.08
వ్యాసాల పేజీలు, వ్యాసంకాని పేజీల నిష్పత్తి 0.15
తెలుగు విక్షనరీ వ్యాసాల లోతు 1.36

WX ఫార్మాటులో డేటాబేసులో నిక్షిప్తమైన పదాలు[<small>మార్చు</small>]

chop-fallen నుండీ cleverly వరకూ ఉన్న పేజీలు.

వీక్షనరీలో ఎలా రాయాలి?[<small>మార్చు</small>]

ఇక్కడ రాసిన సమాచారం నాకోసం నేను రాసుకున్నది. ఇతరులకు కూడా పనికి రావచ్చును.

  • మొదట మీరు ఏ పదం గురించి రాయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు అమ్మ తీసుకుందాము.
  • తరువాత అదే పేరుతో ఒక పేజీని తెరువండి. అందులో ఆ పదానికి సంబందిచిన అర్ధాలు, నానార్ధాలు, పద ప్రయోగాలు వగైరాలన్నీ చేర్చేయండి.
  • ఆ తరువాత ఇతర వికీపిడియాలతో లింకులు చేర్చాలి. ఇది ఒక ముఖ్యఘటం. దీనిని మనము కూలంకుషంగా పరిశీలిద్దాం.
    • ఫ్రెంచు భాషను మీరు నేర్చుకుందామని అనుకుంటే మొదటగా మీరు మీ భాషలో ఉన్న పదానికి ఆ భాషలో ఏ పదముందో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు కదా.
    • అంటే మొదటగా మీరు మీ భాషలో ఆ పదానికున్న పేజీని చూస్తారు. మన ఉదాహరణ ప్రకారం మీరు అమ్మ అనే పేజీని సందర్శిస్తారు.
    • అక్కడ మీకు అనువాదాల జాబితా కనిపిస్తుంది. ఈ జాబితాలో ఆ పదాన్ని వేరే భాషలలో ఎలా రాస్తారో తెసుకోగలుతాము. అప్పుడు మనకు అమ్మ అనే పదాన్ని ఫ్రెంచులో mèreగా రాస్తారు అని తెలుస్తుంది. ఇలా వేరే భాషలో రాసిన పదానికి ఒక లింకు కూడా ఉంటుంది. ఆ పక్కనే దానిని ఎలా ఉచ్చరించాలో కూడా ఉండవచ్చును.
    • దానిని పట్టుకుని వెలితే గనక ఆ వేరే భాష పదానికి మన భాషలో ఉన్న ఇతర పదాలను చూడవచ్చు. ఈ పేజీలో మనకు ఆ పదానికి సంబందించిన మన భాష యొక్క పదాలకు లింకులు మాత్రమే ఉంటాయి. ఆ పదం గురించి ఏపయినా చెప్పదలుచు కుంటే దానిని మీభాషలో చెప్పవచ్చు. ఇలాంటి పదాలకు, ఆ పదం మాతృ భాషలో, అర్ధాలు, నానార్ధాలు, పద ప్రయోగాలు వంటివి, వాటి విక్షనరీలు చూసుకుంటాయి.
  • ప్రతీ పేజీలో ఇతర విక్షనరీలకు లింకులు ఉంటాయి. ఈ లింకులన్నీ ఆ పేజీ పేరుతోనే ఉండాలి. వేరే పేరుతో ఉండకూడదు. ఇది మన భాష పదాలకు మరియు ఎతర భాషా పదాలకు సమానంగా వర్తిస్తుంది.


ఫ్రెంచి వీక్షనరీలో వారు చాలా మంచి మంచి మూసలు తయారు చేసారు. వాటిని మనము తెలుగులోకి దిగుమతి చేసుకుంటే ఇక్కడ మార్పులు చేర్పులు చేయటం సులువుగా ఉండటమే కాకుండా ఒక క్రమ పద్దతిలో కూడా సాగుతుంది. అంతే కాదు ఇతర భాషల వారు మన భాష పదాల పేజీలో వారి పదాలు చేర్చటం కూడా కొంచెం సులువు అవుతుంది.

పతాకాలు[<small>మార్చు</small>]

తెలుగు విక్షనరీని కదంతొక్కించి పదివేల పదాలకు చేర్చిన తెవికీ మాంత్రికుడు ప్రదీపుకు సభ్యులందరి తరఫున కృతజ్ఞతాపూర్వక వందనాలతో ఒక చిరుకానుక - వైఙాసత్య తెలుగు విక్షనరీకి అవసరమైన బాట్లు తయారు చేసి వాటిని సమర్థతతో పర్యవేక్షిస్తూ తెలుగు విక్షనరీని ముందుకు దూసుకెళ్ళిస్తున్న ప్రదీప్ గారికి మాటలబాబు సమర్పించే చిన్న పతాకం