భరతుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- భరతుడు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- భరతుడు పేరు గలవారు ముగ్గురు కలరు. 1. దశరథ -కైకేయి కుమారుడు. శ్రీరాముని సోదరుడు. 2. ఋషభుని జ్యేష్ఠ పుత్రుడు. ఇతని పేరు మీదనే "భారతదేశము" అని పేరు వచ్చింది. 3. శకుంతల దుష్యంతులకు పుట్టినవాడు.
- తెలుగువారిలో ఒక పురుషుల పేరు.
- 1. స్వాయంభువుని వంశస్థుఁడు అగు ఋషభుని జ్యేష్ఠపుత్రుఁడు. ఇతని నామముచే హిందుదేశమునకు భరతఖండము అను పేరు కలిగెను. భరతమహారాజు సర్వసంగపరిత్యాగముచేసి భగవదారాధన కావించుచు తపోవృత్తి నుండి ఒకనాడు నదియందు అవగాహనము చేయునపుడు పూర్ణగర్భిణి అగు ఒక లేడి నీరు త్రావను అచటికి వచ్చి సింహగర్జనము ఒకటి విని భయపడి గంతువేయఁగా దానిగర్భమందు ఉన్న పిల్ల జాఱి ఆనదీజలముల పడి ఆలేడి చచ్చెను. అంత భరతుడు ఈ హరిణపోతమును చూచి కరుణార్ద్రచిత్తుఁడై దానిని కొనివచ్చి తన ఆశ్రమమునందు ఉంచి పెంచుచు వచ్చెను. సర్వసంగపరిత్యాగి అయ్యును ఇతనికి ఆహరిణమునందలి ప్రీతి ప్రాణోత్క్రమణకాలమునందు కూడ వదలమిఁజేసి మఱుజన్మమున హరిణగర్భమున జన్మించెను. అట్లైనను పూర్వజన్మసంస్కారమువలన ఇతఁడు తాను హరిణముగా పుట్టినందులకు కారణము ఎఱిఁగినవాఁడు కావున మహర్షుల యాశ్రమముల తిరుగుచు మృగదేహత్యాగావసరము కోరుచు ఉండెను. అనంతరము ఇతఁడు హరిణ దేహమును పాసి అంగీరసుఁడు అను బ్రాహ్మణునికి కొడుకు అయి పుట్టి కర్మమార్గమును ఒల్లక జ్ఞానవైరాగ్యములు కలవాఁడై జడుని వలె అడవులయందు సంచరించుచు ఉండ కొందఱు క్రూరులు ఇతనిని నరపశువుగ కాళికాదేవికి బలి ఇయ్య పోయిరి. అప్పుడు ఆదేవి ఇతనిని కొనిపోయినవారిని బలికొనెను. మఱియొకవేళ సింధుదేశపు రాజు అగు సౌవీరుని భటులు ఇతనిని పట్టుకొని పోయి తమ రాజుయొక్క పల్లకి మోయించిరి. అంత పల్లకి హెచ్చుతక్కువలుగా పోసాగెను. అదిచూచి రాజు దానికి కారణము విచారించి ఈతని వర్తమానము తెలిసి ఇతనివలన వేదాంతరహస్యములు తెలిసికొనినట్లు తెలియవచ్చుచు ఉన్నది. ఇతని కొడుకు సుమతి.
- వైదిక వాఙ్మయంలో వినవచ్చే పేరు. నానార్థాలలో కొన్ని : రాముడి తమ్ముడు, దుష్యంతుని కొడుకు, ఋషభ దేవుని పెద్ద కొడుకు (ఇతడు భారత వర్ష ప్రసిద్ధికి కారకుడు), నాట్య శాస్త్ర కర్త, నట్టువుడు, సాలెవాడు (బోయవాడు), అగ్నిపుత్రుడు, ఆయుధ ధారిగా జీవించేవాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
వైదిక వాఙ్మయంలో వినవచ్చే పేరు. నానార్థాలలో కొన్ని : రాముడి తమ్ముడు, దుష్యంతుని కొడుకు, ఋషభ దేవుని పెద్ద కొడుకు (ఇతడు భారత వర్ష ప్రసిద్ధికి కారకుడు), నాట్య శాస్త్ర కర్త, నట్టువుడు, సాలెవాడు (బోయవాడు), అగ్నిపుత్రుడు, ఆయుధ ధారిగా జీవించేవాడు.
- వ్యతిరేక పదాలు