Jump to content

బాల్యక్రీడలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

బాల్యక్రీడలు అనగా చిన్న పిల్లలు ఆడుకునే ఆటలు అని అర్థం. గతంలో పిల్లలు వెన్నెల రాత్రులలో వీదులలో ఎన్నో ఆటలు ఆడేవారు. సాధారణంగా ప్రతి ఆట ఒక పాటపాడుతూ ఆడే వారు. ప్రతి పాటకు ఒక ప్రత్యేకమైన పాట వుండేది. ఆ పాటలు కొన్ని అర్థ వంతంగా వుండేవి. కొన్ని హాస్యాస్పదంగా వుండేవి., .... ఆలాంటి ఆటలలో కొన్ని:..... తత్తెం బిత్తెం. వెన్నేకుప్పలు, గుచ్చుగుచ్చు పుల్ల, వత్తొత్తి వారొత్తి మొదలగునవి. తత్తెం బిత్తెం ఆట పాట గురించి:............ నలుగురు పిల్లలు బాసింపట్టాం వేసుకుని ఎదురెదురుగా కూర్చుంటారు. వారిలో ఒకడు తన అరచేత్తో మిగగా పిల్లల తొడలమీద తడుతూ ఇలా పాట పాడుతాడు. తత్తెం - బిత్తెం - తగడా బిత్తెం - ఏకుంజిల్ల - వెలగా పండు - మామిడి ముట్టి - మన్నేరు గాయ - xxxx - xxxx - xxxx - xxxx - కాకులం బెరడు - కలబందాకు - గజ్జి మొగ్గ - తుర్ ర్ ర్ . పై పాటలో ఒక్కొక్క నుడుగుకు ఒకరి తొడమీద తట్టాలి. చివరగా తుర్ ర్ ర్ అనే నుడుగు ఎవరి తొడ తట్టినప్పుడు వస్తుందో ఆ పిల్లవాడు ఔట్. ఇలా సాగుతుంది ఆ ఆట పాట. ఈ పాటలో గజ్జి - తామర వంటి చర్మ వ్వాదికి ఆయుర్వేద సంబంధమైన మందు తయారీ పద్ధతి వున్నదని పెద్దలు చెప్పేవారు.ఆ రోజుల్లో ఇలాంటి పాటలేన్నో..... ఒక్కటీ పూర్తిగా గుర్తు లేదు. ప్రస్తుతం ఈ పాటలో కొన్ని నుడుగులు గుర్తు లేదు, కొన్ని నుడుగులకు అక్షర దోషాలుండ వచ్చు. మరొక ఆటకు పాట . జొన్న చేనుకాడ , సొగసు కత్తిని చూసి - నిన్నటేలనుండి నిదుర లేదు, - దాన్ని నన్ను గూర్చి దయచేయు మాధవా - పొన్న పూల తోటి పూజ చేతు. ఇదేదో మంచి కత్తి కి సంబంధించిన పాట అనుకున్నాను ఆ రోజుల్లో... తరువాత తెలిసింది ఇది ఒక మంచి కంద పద్యమని. వత్తొత్తి వారొత్తి ఆటలో మరో పాట:... వత్తొత్తి.... వారోత్తి..... చూసినోళ్ళ .....కళ్ళల్లో - సూరొత్తి ....... ధనా ధన్ .... ఘల్ బీగాల్. ఆనాటి పిల్లలాటలు కూడ విజ్ఞానదాయకంగా వుండేవని అర్థమవుతుంది. ప్రస్తుత కాలంలో ఇలాంటి ఆటలు గానీ పాటలు గానీ పూర్తిగా తుడిచి పెట్టుక పోయాయి.

నానార్థాలు
సంబంధిత పదాలు

అంజి, అందలము, అక్కిబిక్కిదండ, అచ్చనగండ్లు, అచ్చనగాయల,అచ్చనగుండ్లు, అచ్చనలు, అత్తనకాయలు, అత్తకోడలియాట, అప్పచి, అప్పళము, అమ్మనములు, అల్లి, అల్లోనేరేడు, ఆకుపీకెలు, ఆలంకిగుడి, ఆలుమగలయాట, ఇఱికి, ఈనెగాజులు, ఈలకూతలు, ఉడ్లపల్లంచి, ఉద్ది, ఉప్పనబట్టెల.ఉప్పుగుందము, ఉవ్వలపోటీ, ఊదుగ్రోవి, ఏలపాటలు, ఒక్కసికొక్క, ఒడ్డువిడుపు, ఓటిల్లుచిందఱ, ఓమనగుంటలు, కంబాలాట, నలుకంబాలాట, నాలుగుకంబాలాట, కట్టెగుఱ్ఱమ,కనుమూసిగంతల, కన్నుకట్ట, కన్నులకచ్చి, కాలికంచము, కిఱ్ఱుగానుగ త్రిప్పుళ్లు, కీచుబుఱ్ఱలు, కుందికట్టు, కుందికాళ్లు, కుందెనగిఱి, కుందెనగుడి, కుందెనగుళ్లు, కు(చ్చె)(చ్చి)ళ్లు, కుప్పటగురిగింజ, కుప్పిగంతులు, కుప్పీలు, గచ్చకాయలు, గ్రచ్చకాయలు, కుమ్మరసారె, కొండకోతి, కోతికొమ్మంచి, కోలక్రోతులు, కోలాటము, హల్లీసకము, కోలుకోలన్నలు, ఖంజపాదము, గంజనగాలు, గంగెద్దులాట, గట్టినబోది, గనికెకుండలు, గాలిపటాలు, గిలక, గీర(న)(నం)గింజలు, గుంటచాళ్ళు, గుజగుజరేకులు, గుజ్జెనగూళ్ళు, గుడుగుడు గుంచములు, గుఱ్ఱమెక్కుడు, గూవనాలు, గొడుగు, గొబ్బిళ్ళు, గోటదొర్లుడుకాయ, గోడిపట్టెలు, గోరింపుబంతులు, చండ్రలాటలు, చక్రాలత్రిప్పుడు, చాకిబాన, చింతపూవు, చింతాకు, చిందఱ, చిందుపరువు, చిక్కనాబిళ్లలు, చిట్లపొట్టలు, చిట్లపొట్లకాయ, చిడుగుడు, చిడుగుడుపురుగులు, చిప్పచిప్పగోళ్ళు, చిమ్మనగ్రోవి, చిమ్మనబిళ్ళలు, చిమ్ముబిల్లలు, చిఱుతనగోడు, చిఱుతనబిల్లలు, చిఱ్ఱిపట్టె, చిఱ్ఱుబుఱ్ఱులు, చిల్లకట్టె, చీకటిమొటికాయ, చీకటిమొటికిళ్ళు, చుండ్రాళ్ళు, చుణుదులు, చెండు, చెండుగోరింపులు, చెఱుకులపందెములు, చేబంతులు, చొప్పబెండ్లమంచము, జాబిల్లి, జీరుకురాతి, జిల్లజీర్కులు, జీర్కుబండ, జీర్కురాయి, జెల్లెము, జోడురాలు, తగరులవిడుపులు, తన్నుబిల్ల, త్రొక్కుడుబిల్ల, తఱుముడుచెండు, తాటాకుచక్రాలు, తాటిచెట్టాట, తాటియాకులచిలకలు, తాళ్ళపాములు, తిరుగుడుబిళ్ళల త్రిప్పుళ్ళు, తుంపెసలు, తుమ్మెదరేపుళ్ళు, తూనిగ తానిగ, తూరనగోలలు, తూరనతుంకములు, దాండ, దాగలిమూతలు, కికురింతలాట, డాగనమ్రుచ్చిళ్ళు, డాగనమ్రుచ్చులు, డాగిలిమూతలు, డాగిలుమ్రుచ్చులు, డాగుడుమూతలు, డాగురింత, డాగురుమూతలు, దాగనమ్రుచ్చిళ్లు, దాగనమ్రుచ్చులు, దాగిలిమూతలు, దాగిలిమ్రుచ్చులు, దాగుడుమూతలు, దాట్రాయి, దాయాలు, గవ్వలాట, దోయము, దూచి, దూబూచి, దోపిడీ, దోపిడియాటలు, దోపిళ్ళు, నట్టకోతి, నాలుగుమూలలాట, నిట్టుక్కి, నీగ, నెటికతట్లు, నెట్టు, నెట్టుడుగాయ, పచ్చాకు, పత్తికాయ, పాడుపాతరమాళ్ళు, పాతరలు, పారపట్లు, పాఱిగంతులు, పింపిళ్ళు, పిల్లగిరులు, పిల్లగోరు, పిల్లదీవి, పుక్కటిల్లు, పుట్టచెండు, పుణికిళ్లు, పులియాట, పెంచులభేరి, పెనకువవితములు, పొళ్లులు, పోగిస, పోతుటీనెగుఱ్ఱములు, బండ్లకల్లులు, బంతిఆట, బందారుబసవన్న, బరిగాయపోటు, బిరిగాయలు, బిల్లగోళ్ళు, బిల్లవిద్యము, బుడికిస్సు, బువ్వంపుబంతి, బూచి, బేడిసతిరుగుళ్లు, బొంగరాలాట, బొట్టనగోలలు, బొమ్మరిలు, బొమ్మలపెండ్లిండ్లు, బోర్లపక్క, మంటిగూండ్లు, మూతపొడుపు, మేల్మచ్చులు, మోపిళ్లు, యాలాకి, రామన్నాట, విండ్లమ్ములాట, విదియము, వెన్నెలకుప్పలు, వెన్నెలకూన, వెన్నెలపులుగము, వెన్నెలప్రోవు, వ్రేలుబొట్టగ, సింగన్నదాటులు, సిరిసింగణాలవత్తి, సిరిసింగనాలవృత్తి, సూడుపట్టె, సూళ్ళు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]