అంగన్యాస కరన్యాసాలు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సంధ్యావందన సమయంలో అంగన్యాస కరన్యాసాలు చేస్తారు. ఇవి రెండు భాగాలు. 1. అంగ న్యాసం, 2. కరన్యాసం. ‘ఓమ్ తత్సవితుః బ్రహ్మాత్మనే హృదయాయనమః’ అంటూ హృదయస్థానాన్ని స్పృశించడం, అదే పద్ధతిలో గాయత్రి మంత్రంలో మిగతా భాగాలను ఉచ్చరిస్తూ శిరస్సు, శిఖాదులను స్పృశించి ‘ఓమ్ ప్రచోదయాత్ సర్వాత్మనే అస్త్రాయఫట్’ అనడం, కుడిచేతి చూపుడు వేలు పైకి ఉండే విధంగా చూపుడు వేళ్ళు రెండింటిని లంకెవేస్తూ ‘దిగ్బంధః’ అనడం అంగన్యాసం. కరన్యాసంలోనూ గాయత్రీ మంత్ర భాగాలను ఉచ్చరిస్తూ అంగుష్ఠ, తర్జని, మధ్యమ, అనామిక, కనిష్ఠిక వేళ్ళను బొటన వేలిని తర్జనితోనూ, మిగతా వేళ్ళను బొటన వేలితోనూ తాకాలి. మంత్రంలో చివరి భాగమైన ‘ఓమ్ ప్రచోదయాత్’ అన్నప్పుడు ఒక అరచేతి వెనుక భాగంతో రెండవ అరచేతిని రాయడం కరన్యాసం చివరి అంశం. అంగన్యాస కరన్యాసాల తరువాత ‘ముక్తావిద్రుమ’తో మొదలయ్యే గాయత్రీ ధ్యాన శ్లోకం చదవడం పద్ధతి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు