Jump to content

అంతా మన మంచికే

విక్షనరీ నుండి
(అంతా మనమంచికే. నుండి దారిమార్పు చెందింది)
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


దీనికే మరొక రూపం కూడా ఉంది.. ఏది జరిగినా మన మంచికే! అని. సాధారణంగా, ఏదన్నా చెడు జరిగి ఎవరన్నా బాధపడుతున్నప్పుడు ఇలా సర్ది చెప్పడం జరుగుతుంది. దిని వెనక ఒక కథ కూడా ఉంది.

అనగా అనగా ఒక రాజు, ఆ రాజు దగ్గర ఒక తెలివైన మంత్రి. మంత్రి చక్కని సలహాలతో రాజును సమస్యలనుండి తప్పిస్తూ ఉంటాడు. ఒకనాడు పండ్లు తింటుండగా కత్తివాటుకు పొరపాటున రాజుగారి వేలు తెగింది. పక్కనే ఉన్న మంత్రి "అంతా మన మంచికే" అన్నాడు. వేలు తెగి బాధ పడుతుంటే, ఈయనేమిటి అంతా మంచికేనంటాడు అని రాజుకు కోపం వచ్చింది! ఎలాగైనా మంత్రికి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు.

ఆ తరువాత రోజు అందరూ కలసి వేటకి వెళ్తారు. రాజు, మంత్రి దారి తప్పి పోతారు. రాజు మంత్రిని ఒక బావిలోకి (నూతిలోకి) తోసి "ఏది జరిగినా మన మంచికే, నువ్వు చెప్పిందే గదా" అని వెటకారంగా అని వెళ్ళిపోయాడు. కానీ దురదృష్టవశాత్తూ, రాజును ఒక అటవిక జాతివారు బంధించి కాళికాదేవికి బలి ఇవ్వబోయారు. ఇంతలో అతని వేలికి ఉన్న గాయాన్ని చూసి బలి ఇవ్వడానికి పనికిరాడు అని వదిలేసారు.

వేలు తెగినపుడు మంత్రి అన్న మాట గుర్తుకు వచ్చి, రాజు అతనిని బావినుండి వెలుపలికి తీసాడు. రాజు "నా వేలి గాయం నాకు మంచిదే అయింది, కానీ నిన్ను నూతిలోకి నెట్టడం నీకు మంచి ఎలా అయింది?" అని అడిగాడు. అప్పుడు మంత్రి "నన్ను నూతిలోకి పడెయ్యకపోతే, మీతోపాటు నన్నూ పట్టుకునేవాళ్ళు. అప్పుడు మిమ్మల్ని వదిలేసి నన్ను బలి ఇచ్చేవారే కదా ప్రభూ" అని బదులిచ్చాడు.

అందుకే అంటారు - "అంతా మన మంచికే", "ఏది జరిగినా మన మంచికే"