అగస్త్యభ్రాత
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
అగస్త్య(=అగస్త్యుని)+భ్రాత(=సోదరుడు).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ప్రసిద్ధులైన వారి సంబంధీకులను ఆ ప్రసిద్ధులైన వారి పేర్లను ఉపయోగించే నిర్దేశంచడం సహజం. కొత్తల్లుడు చుట్టుపక్కల వాళ్లందరికీ సీతమొగుడు. కొత్తగా కాపరానికి వచ్చిన అమ్మాయి కరణంగారి కోడలు. ఒక్కొక్కప్పుడు వాళ్లవాళ్ల అసలు పేర్లు మరుగున పడి ఈ పేర్లే స్థిరపడిపోతాయి. రామాయణంలో రాముడు వనవాస సమయంలో దర్శించిన ఆశ్రమాల్లో అగస్త్యభ్రాత ఆశ్రమం ఒకటి. రామాయణంలో ఈయన అసలు పేరు ఎక్కడా కనిపించదు. లోకప్రసిధ్ధుడైన అగస్త్యమహర్షి సోదరుడవటం చేత అగస్త్యభ్రాతగా స్థిరపడి పోయాడు.
- లోకంలో 'వాడుత్త అగస్త్యభ్రాతరా' అంటే వాడికొక తనదైన గుర్తింపు గాని వ్యక్తిత్వం గాని లేదని అర్థం.
- అగస్త్యుని తోడఁ బుట్టినవాఁడు;
- పనికిరానివాఁడు : చూ, వ్రాజె./ఊరు-పేరు లేనివాడు.
పేరు ప్రస్తావించని వ్యక్తి
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు