అగు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
క్రియ
అవుర.(ఆమ్రేడితమందు అగురగుర "క. అగురగుర ముఖరముఖుఁడై, జగము వినం దనబలంబు చాటె సముద్రుం, డొగి బిరుదు దక్కఁడయ్యెన్‌, సగర కుమారులుగదా ప్రశంసార్హతముల్‌." రామా. ౭, ఆ.)

(రూ. అగురా)

 1. విధేయవిశేషణమునకు అనఁగా విశేష్యము తరువాత నుపయోగించెడు విశేషణమునకు అన్వయసంపూర్తికి నుపయోగించు క్రియ.

"వాడు సదాచారుడయ్యె;"

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

 1. విశేషణమునకు విశేష్యమునకు అన్వయము కలుపుటకై యుపయోగించును. అప్పుడు క్రియాజన్య విశేషణముగానే యుండును. ="ధర్మపరుండగు రాజు;"
 2. పరిణమించు, మాఱు; ="సీ. ఒకమాటతప్పు గావక యహల్యాదేవి నక్షత్రపాదుఁడు ఱాయి యగు మనండె." శివ. మా.౩,ఆ. ౧౨౯;
 3. తగు, అర్హమగు; ఆవశ్యకమగు; ="క. ..కార్యజ్ఞానో, దారుడవగు నీవౌచి, త్యారూఢముగాఁగఁ జెప్పు మగుసమయమునన్." భార. అశ్వ. ౧,ఆ. ౧౪౭;

="తే. అగ్రమార్గజాగ్రన్నిభృతాపదంధు, బంధుసంరక్షణము పాడిబాంధవులకు, నైన కార్యంబు గానికార్యమును దెలిసి, యాడుడా యేను." నై.౩,ఆ. ౧౪౧;

 1. కలవాఁడగు. ="తే. ధర్మజుడు రాజసూయంబుఁ బేర్మిజేసి, నంతనుండియు నమ్మహితాధ్వరమున, యం దభిప్రాయమైయుండు నొంద నాకు, నమ్మఖంబు సేయింపవే యనఘ నన్ను." భార.అర.౬,ఆ. ౬౮; అభిప్రాయమైయుండు=అభిప్రాయము కలవాఁడయియుండు. ఇట్టిచోట సకర్మకక్రియగాని అన్వయింపవచ్చును;
 2. నెఱవేఱు, సిద్ధించు. ="తే. కార్యమగుటయు నరిగెదుగాక పిదప, నిల్వు మంతకు ననుటయు నీవు నన్ను, గదియకుండెదవేని నిల్చెద నధర్మ, వృత్తి వగుమని వారించె నత్తపస్వి." భార.అను.౨,ఆ. ౨౦;
 3. సిద్ధమగు.="సీ...శిఖి..రాజిన రవులుకోల్ వాసాలఁగాని కల్గదు మఱి దానఁ గలిగె, నేనిఁ గూడగుట నుందయినఁ బెన్బొగ సుఖభుక్తి సేకూరదు..." ఆము.౪,ఆ. ౧౨౭;
 4. సంపూర్ణమగు. ="పుస్తకము వ్రాఁత యైనది; భోజనములైనవి; చదువు అయినది." (అయినది=పూర్తియైనది;)
 5. ఓపు, సమర్థుడగు, చాలు. =(పాండవులు) "క. పరిచారకులై యుండుదు, రరివర్గ వ్యతికరమున కగుదురు వీరిన్, సరిఁ దనకొడుకుల మెలసిన, తెరువున మెలఁగింపవలదె ధృతరాష్ట్రునకున్." భార.ఉ.౧,ఆ. ౩౫౯;
 6. ఉండు, జీవించుయుండు. ="వ. అనిన విని కర్ణుండు గమలనాభుని పెంపును బార్థుబలిమియు నెఱుంగక యేనేల వారి దొడరెద నెట్లు సెప్పినను దొడరుదు దొడరి వారొండె నేనొండె నగుదు మింతియ నీవు వెడమాటలాడక యుడుగుమని పలికి." భార.కర్ణ.౨,ఆ. ౮౭;
 7. జరుగు. ="వారియింట పెండ్లియగుచున్నది."

స.క్రి.

  1. కలుగు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

వాడెళ్ళిన పని అవునో కాదో

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అగు&oldid=950587" నుండి వెలికితీశారు