అజ్ఞాన సప్తభూమికలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. బీజ జాగ్రం. 2. జాగ్రం. 3. మహా జాగ్రం. 4. జాగ్రత్స్వప్నం. 5. స్వప్నం. 6. స్వప్న జాగ్రం. 7. సుషుప్తి. (ఆం. వే. ప.). -అజ్ఞాన భూమికలకు అధోకాయంలోని 1. పొత్తి కడుపు, 2. పిరుదులు, 3. తొడలు, 4. మోకాళ్ళు, 5. పిక్కలు, 6. చీలమండలు, 7. అఱికాళ్ళు నెలవులు. సత్త్వ రజస్తమో గుణాల వల్ల ప్రభావితమైన మనస్సు సత్యమైన బ్రహ్మాన్ని తెలుసుకొనలేని స్థితిలో ఉంటుంది. దీనినే వేదాంత పరిభాషలో అవిద్య అనీ, అజ్ఞానమనీ అంటారు. ఈ స్థితి ఏడు విధాలుగా ఉంటుంది. స్వప్నావస్థ అందరికీ అనుభవమే. స్వప్నంలో ఉన్నప్పుడు తదనుభవం నిజమైనదిగానే తోస్తుంది. కాని, అది నిజం కాదని జాగ్రదవస్థలోకి వచ్చాక తెలుస్తుంది. ఇదే విధంగా మిగతా ఆరు అవస్థలూ ఉంటాయి. సుషుప్తిలో అనుభవాలే మైనా ఉంటే అవి జాగ్రదవస్థలో జ్ఞాపకానికి రావు. వస్తే అది సుషుప్తికాదు. ఇలా ఏడు రూపాలుగ ఉండే అజ్ఞానావస్థలకు ఈ పేర్లు పెట్టారు. సప్త అజ్ఞాన భూమికలుగా ఇంకా ఇవి కూడా వాడుకలో ఉన్నాయి. 1. అజ్ఞానం, 2. ఆవరణం, 3. విక్షేపం, 4. పరోక్ష జ్ఞానం, 5. అపరోక్షజ్ఞానం, 6. నిరంకుశ తృప్తి, 7. అత్యంతిక దుఃఖ నాశం. .............. పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]