అనుబంధం:లలితా సహస్ర నామములు/301-400
స్వరూపం
ఈ పేజీ ఏ ఇతర పేజీ లింక్ లేదు. ఈ పేజీకి ఒక లింక్ జోడించడం ద్వారా విక్షనరీ సహాయం చేయండి. |
లలితా సహస్రనామ స్తోత్రములోని నాలుగవ నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.
శ్లోకం 70
[<small>మార్చు</small>]- నారాయణీ - నారాయణత్వ లక్షణము గలది.
- నాదరూపా - నాదము యొక్క రూపము అయినది.
- నామరూపవివర్జితా - పేరు, ఆకారము లేనిది
- హ్రీంకారీ - హ్రీంకార స్వరూపిణి.
- హ్రీమతీ - లజ్జాసూచిత బీజాక్షర రూపిణి.
- హృద్యా - హృదయమునకు ఆనందము అయినది.
- హేయోపాదేయవర్జితా - విడువదగినది, గ్రహింపదగినది, లేనిది.
శ్లోకం 71
[<small>మార్చు</small>]- రాజరాజార్చితా - రాజులకు రాజులైన వారిచేత అర్చింపబడునది.
- రాజ్ఞఈ - రాణి.
- రమ్యా - మనోహరమైనది.
- రాజీవలోచనా - పద్మములవంటి కన్నులు కలది.
- రంజనీ - రంజింప చేయునది లేదా రంజనము చేయునది.
- రమణీ - రమింపచేయునది.
- రస్యా - రస స్వరూపిణి.
- రణత్కింకిణి మేఖలా - మ్రోగుచుండు చిరుగజ్జెలతో కూడిన మొలనూలు లేదా వడ్డాణము గలది.
శ్లోకం 72
[<small>మార్చు</small>]- రమా - లక్ష్మీదేవి.
- రాకేందువదనా - పూర్ణిమ చంద్రుని పోలిన ముఖము గలది.
- రతిరూపా - ఆసక్తి రూపమైనది.
- రతిప్రియా - ఆసక్తి యందు ప్రీతి కలది.
- రక్షాకరీ - రక్షించునది.
- రాక్షసఘ్నీ - రాక్షసులను సంహరించునది.
- రామా - ఎప్పుడూ సంతోషంగా, క్రీడాత్మకంగా వుండేది.
- రమణ లంపటా - రమణునితో అత్యంత సాన్నిహిత్య, సామ్య సంబంధము గలది.
శ్లోకం 73
[<small>మార్చు</small>]- కామ్యా - కోరదగినటువంటిది.
- కామకళారూపా - కామేశ్వరుని కళయొక్క రూపమైనది.
- కదంబకుసుమప్రియా - కడిమి పువ్వులయందు ప్రేమ కలిగినది.
- కళ్యాణీ - శుభ లక్షణములు కలది.
- జగతీకందా - జగత్తుకు మూలమైనటువంటిది.
- కరుణా రససాగరా - దయాలక్షణానికి సముద్రము వంటిది.
శ్లోకం 74
[<small>మార్చు</small>]- కళావతీ -కళా స్వరూపిణీ.
- కలాలాపా - కళలను ఆలాపనా స్వరూపముగా కలిగినది.
- కాంతా - కామింపబడినటువంటిది.
- కాదంబరీ ప్రియా - పరవశించుటను ఇష్టపడునది.
- వరదా - వరములను ఇచ్చునది.
- వామనయనా - అందమైన నేత్రములు గలది.
- వారుణీమదవిహ్వలా - వరుణ సంబంధమైన పరవశత్వము చెందిన మనోలక్షణము గలది.
శ్లోకం 75
[<small>మార్చు</small>]- విశ్వాధికా - ప్రపంచమునకు మించినది అనగా అధికురాలు.
- వేదవేద్యా - వేదముల చేత తెలియదగినది.
- వింధ్యాచలనివాసినీ - వింధ్యపర్వత ప్రాంతమున నివాసము గలది.
- విధాత్రీ - విధానమును చేయునది.
- వేదజననీ - వేదములకు తల్లి.
- విష్ణుమాయా - విష్ణుమూర్తి యొక్క మాయా స్వరూపిణి.
- విలాసినీ - వినోదాత్మక, క్రీడాత్మక లక్షణము గలది.
శ్లోకం 76
[<small>మార్చు</small>]- క్షేత్రస్వరూపా - క్షేత్ర పదంచే సంకేతింపబడే వాటి స్వరూపంగా నుండునది.
- క్షేత్రేశీ - క్షేత్రమునకు అధికారిణి.
- క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ - స్థూలభాగమైన దేహమును, సూక్ష్మభాగమైన దేహిని పాలించునది లేదా రక్షించునది.
- క్షయవృద్ధివినిర్ముక్తా - తరుగుదల, పెరుగుదల లేనిది.
- క్షేత్రపాల సమర్చితా - క్షేత్రపాలకులచే చక్కగా అర్చింపబడునది.
శ్లోకం 77
[<small>మార్చు</small>]- విజయా - విశేషమైన జయమును కలిగినది.
- విమలా - మలినములు స్పృశింపనిది.
- వంద్యా - నమస్కరింపతగినది.
- వందారుజనవత్సలా - నమస్కరించు శీలము గల జనుల యందు వాత్సల్యము గలది.
- వాగ్వాదినీ - వాక్కులను చక్కగా వ్యక్తపరచగలుగుటకు ప్రేరణ నిచ్చు పరావాగ్దేవత.
- వామకేశీ - వామకేశ్వరుని భార్య.
- వహ్నిమండవాసినీ - అగ్ని ప్రాకారమునందు వసించునది.
శ్లోకం 78
[<small>మార్చు</small>]- భక్తిమత్కల్పలతికా - భక్తికలవారిపట్ల కల్పవృక్షపు తీగవంటిది.
- పశుపాశ విమోచనీ - వివిధ పాశములచే బంధింపబడువారిని బంధ విముక్తులను చేయునది.
- సంహృతాశేషపాషండా - సంహరింపబడిన సకలమైన పాషడులు కలది.
- సదాచారప్రవర్తికా - సంప్రదాయబద్దమైన, శ్రోత్రీయ మార్గము ననుసరించి యుండునట్లు ప్రవర్తింప చేయునది.
శ్లోకం 79
[<small>మార్చు</small>]- తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా - ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపములనెడి అగ్నిచేత తపింప చేయబడిన వారలకు మిక్కిలి సంతోషమును కలుగజేయునట్టి వెన్నెల వంటిది.
- తరుణీ - ఎప్పుడు తరుణ వయస్సు, అనగా ఒకేరీతి యౌవనము గలది.
- తాపసారాధ్యా - తపస్సు చేయువారిచే ఆరాధింపబడునది.
- తనుమధ్యా - కృశించిన అనగా సన్నని కటి ప్రదేశము అనగా నడుము గలది.
- తమో పహా - చీకటిని లేదా అజ్ఞానమును పోగొట్టునది.
శ్లోకం 80
[<small>మార్చు</small>]- చితిః - కూర్పు, జ్ఞానబిందు సమీకరణ.
- తత్పదలక్ష్యార్థా - తత్ పదముచే నిర్దేశింపబడు లక్ష్యము యొక్క ప్రయోజనముగా నున్నది.
- చిదేకరసరూపిణీ - జ్ఞానచైతన్యమే ఒకే ఒక రసముగా లేదా సర్వసారముగా స్వరూపముగా గలది.
- స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః - తనకు సంబంధించిన ఆనందముతో లేశమాత్రమైన బ్రహ్మానందము, ప్రజాపతి ఆనందము - మొదలైన ఆనందముల సమూహము గలది.
శ్లోకం 81
[<small>మార్చు</small>]- పరా - పరాస్థితిలోని వాగ్రూపము.
- ప్రత్యక్చితీరూపా - స్వస్వరూపము యొక్క జ్ఞానమే స్వరూపముగా గలది.
- పశ్యంతీ - రెండవస్థితిగా వ్యక్తం కాబోయే వాక్కు
- పరదేవతా - పశ్యంతీ వాక్కు యొక్క సూక్ష్మరూపము.
- మధ్యమా - పశ్యంతీ, వైఖరీ వాక్కులకు మధ్య వుండు స్థితికి సంబంధించిన వాక్కు.
- వైఖరీరూపా - స్పష్టముగా వ్యక్తమైన వాక్కు.
- భక్తమానసహంసికా - భక్తుల యొక్క, మనస్సులందు విహరించు ఆడు హంస.
శ్లోకం 82
[<small>మార్చు</small>]- కామేశ్వరప్రాణనాడీ - శివుని ప్రాణనాడీ స్వరూపిణి.
- కృతజ్ఞా - చేయబడే పనులన్నీ తెలిసింది.
- కామపూజితా - కామునిచే పూజింపబడునది.
- శృంగారరససంపూర్ణా - శీర్షములతోను, కోణములచేతను, నవరసాదినావముల చేతను కూడి నిండుగా ఉంది.
- జయా - జయస్వరూపిణి.
- జాలంధరస్థితా - జాలంధరసూచిత స్థానము నందున్నది.
శ్లోకం 83
[<small>మార్చు</small>]- ఓడ్యాణపీఠనిలయా - ఓడ్యాణ పీఠమునందు ఉంది.
- బిందుమండలవాసినీ - బిందువును పరివేష్టించి యుండు స్థానమున వసించునది.
- రహోయాగక్రమారాధ్యా - ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో క్రమముగా ఆరాధింపబడునది.
- రహస్తర్పణతర్పితా - రహస్యముగా చేయు తర్పణములచే తృప్తి చెందునది.
శ్లోకం 84
[<small>మార్చు</small>]- సద్యఃప్రసాదినీ - తక్షణములోనే అనుగ్రహించునది.
- విశ్వసాక్షిణీ - విశ్వములోని కృత్యములకు ఒకే ఒక సాక్షి.
- సాక్షివర్జితా - సాక్షి లేనిది.
- షడంగదేవతాయుక్తా - ఆరు అంగదేవతలతో కూడి ఉంది.
- షాడ్గుణ్య పరిపూరితా - ఆరు విధములైన గుణములచే పుష్కలముగా నిండి యుండునది.
శ్లోకం 85
[<small>మార్చు</small>]- నిత్యక్లిన్నా - ఎల్లప్పుడూ దయార్ద్రతతో తడుపబడి యుండునది.
- నిరుపమా - పోల్చిచెప్పుటకు ఉపమానము ఏమియు లేనిది.
- నిర్వాణసుఖదాయినీ - సర్వనివృత్తి రూపమైన బ్రహ్మపద ప్రాప్తి లేక మోక్ష సంబంధమైన ఆనందమును ఇచ్చునది.
- నిత్యాషోడాశికారూపా - నిత్యాదేవతలగానున్న పదహారు కళల రూపము.
- శ్రీకంఠార్థశరీరిణీ - శివుని సగము శరీరముగా నున్నది.
శ్లోకం 86
[<small>మార్చు</small>]- ప్రభావతీ - వెలుగులు విరజిమ్ము రూపము గలది.
- ప్రభారూపా - వెలుగుల యొక్క రూపము.
- ప్రసిద్ధా - ప్రకృష్టముగా సిద్ధముగా నున్నది.
- పరమేశ్వరీ - పరమునకు అధికారిణి.
- మూలప్రకృతిః - అన్ని ప్రకృతులకు మూలమైనది.
- అవ్యక్తా - వ్యక్తము కానిది.
- వ్యక్తావ్యక్తస్వరూపిణీ - వ్యక్తమైన, అవ్యక్తమైన అన్నిటి యొక్క స్వరూపముగా నున్నది.
శ్లోకం 87
[<small>మార్చు</small>]- వ్యాపినీ - వ్యాపనత్వ లక్షణము కలది.
- వివిధాకారా - వివిధములైన ఆకారములతో నుండునది.
- విద్యావిద్యాస్వరూపిణీ - విద్యకు సంబంధించిన భాగమును, అవిద్యకు సంబంధించిన భాగమును తన రూపముగా గలది.
- మహాకామేశ నయనకుముదాహ్లాద కౌముదీ - మహాకామేశ్వరుని కన్నులనెడు కలువపువ్వులకు ఆనంద వికాసమును కలిగించు వెన్నెలవెల్లువ.