అనుబంధం:లలితా సహస్ర నామములు/401-500
స్వరూపం
ఈ పేజీ ఏ ఇతర పేజీ లింక్ లేదు. ఈ పేజీకి ఒక లింక్ జోడించడం ద్వారా విక్షనరీ సహాయం చేయండి. |
లలితా సహస్రనామ స్తోత్రములోని అయిదవ నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.
శ్లోకం 87
[<small>మార్చు</small>]- వ్యాపినీ - వ్యాపనత్వ లక్షణము కలది.
- వివిధాకారా - వివిధములైన ఆకారములతో నుండునది.
- విద్యావిద్యాస్వరూపిణీ - విద్యకు సంబంధించిన భాగమును, అవిద్యకు సంబంధించిన భాగమును తన రూపముగా గలది.
- మహాకామేశ నయనకుముదాహ్లాద కౌముదీ - మహాకామేశ్వరుని కన్నులనెడు కలువపువ్వులకు ఆనంద వికాసమును కలిగించు వెన్నెలవెల్లువ.
శ్లోకం 88
[<small>మార్చు</small>]- భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతిః - భక్తుల హృదయగతమైన అంధకార అజ్ఞానమును భేదించునట్టి కాంతితో కూడిన సూర్యకిరణ పుంజము.
- శివదూతీ - శివుని వద్దకు పంపిన దూతిక.
- శివారాధ్యా - శివునిచే ఆరాధింపబడునది.
- శివమూర్తిః - శివునియొక్క స్వరూపము.
- శివంకరీ - శుభములు చేకూర్చునది.
శ్లోకం 89
[<small>మార్చు</small>]- శివప్రియా - శివునికి ఇష్టమైనది.
- శివపరా - శివుని పరమావధిగా కలిగినది.
- శిష్టేష్టా - శిష్టజనులు అనగా సజ్జనుల యందు ఇష్టము గలిగినది.
- శిష్టపూజితా - శిష్టజనుల చేత పూజింపబడునది.
- అప్రమేయా - ప్రమాణము లేనిది; ప్రమాణములకు లొంగనిది.
- స్వప్రకాశా - తనంతట తానే ప్రకాశించునది.
- మనోవాచామగోచరా - మనస్సు చేత వాక్కుల చేత గోచరము కానిది అనగా గ్రహింప వీలుకానిది.
శ్లోకం 90
[<small>మార్చు</small>]- చిచ్ఛక్తిః - చైతన్య శక్తి.
- చేతనారూపా - చలించు తెలివి యొక్క రూపము.
- జడశక్తిః - ఒక స్థితిలో ఉండి పోవునట్లు చేయు శక్తి.
- జడాత్మికా - జడశక్తి యొక్క స్వరూపము.
- గాయత్రీ - గానము చేసిన వారిని రక్షించునది.
- వ్యాహృతిః - ఉచ్చరింపబడి వ్యాప్తి చెందునది.
- సంధ్యా - చక్కగా ధ్యానము చేయబడునది.
- ద్విజబృంద నిషేవితా - ద్విజుల చేత నిశ్శేషముగా సేవింపబడునది.
శ్లోకం 91
[<small>మార్చు</small>]- తత్త్వాసనా - తత్ సంబంధమైన భావమే ఆసనముగా గలది.
- తత్ - ఆ పరమాత్మను సూచించు పదము.
- త్వమ్ - నీవు.
- అయీ - అమ్మవారిని సంబోధించు పదము.
- పంచకోశాంతరస్థితా - ఐదు కోశముల మధ్యన ఉండునది.
- నిస్సీమ మహిమా - హద్దులు లేని మహిమ గలది.
- నిత్యయౌవనా - సర్వకాలములందును యవ్వన దశలో నుండునది.
- మదశాలినీ - పరవశత్వముతో కూడిన శీలము కలది.
శ్లోకం 92
[<small>మార్చు</small>]- మదఘూర్ణితరక్తాక్షీ - పరవశత్వము వలన తిరుగుటచే ఎర్రదనమును పొందిన కన్నులు గలది.
- మదపాటల గండభూః - ఆనంద పారవశ్యము వలన తెలుపు, ఎరుపుల సమిశ్ర వర్ణములో ప్రకాంశించు చెక్కిళ్లు కలది.
- చందనద్రవదిగ్ధాంగీ - మంచి గంధపు రసముతో పూయబడిన శరీరము గలది.
- చంపేయకుసుమప్రియా - సంపెంగ పుష్పములందు ప్రీతి కలది.
శ్లోకం 93
[<small>మార్చు</small>]- కుశలా - క్షేమము, కౌశల్యమును గలది.
- కోమలాకారా - సుకుమారమైన లేదా మృదులమైన స్వరూపము గలది.
- కురుకుల్లా -
- కులేశ్వరీ - కులమార్గమునకు ఈశ్వరి.
- కులకుండలయా - కులకుండమును నిలయముగా గలది.
- కులమార్గతత్పరసేవితా - కౌలమార్గమును అనుసరించువారిచే సేవింపబడునది.
శ్లోకం 94
[<small>మార్చు</small>]- కుమార గణనాథాంబా - కుమారస్వామికి, గణపతికి తల్లి అయినది.
- తుష్టిః - తృప్తి, సంతోషముల రూపము.
- పుష్టిః - సమృద్ధి స్వరూపము.
- మతిః - బుద్ధి
- ధృతిః - ధైర్యము.
- శాంతిః - తొట్రుపాటు లేని నిలకడతనము గలది.
- స్వస్తిమతీ - మంచిగా లేదా ఉండవలసిన విధానములో ఉండు మనోలక్షణము గలది.
- కాంతిః - కోరదగినది.
- నందినీ = ఆనందిని అంటే ఆనందమును అనుభవించునది.
- విఘ్ననాశినీ - విఘ్నములను నాశము చేయునది.
శ్లోకం 95
[<small>మార్చు</small>]- తేజోవతీ - తేజస్సు కలది.
- త్రినయనా - మూడు కన్నులు కలది.
- లోకాక్షీ కామరూపిణీ - స్త్రీలకు కూడా మోహము పుట్టు రూపము గలది.
- మాలినీ - మాలికారూపము చెల్లునది. లేదా మాల గలది.
- హంసినీ - హంసను (శ్వాసను) గలిగినది.
- మాతా - తల్లి.
- మలయాచలవాసినీ - మలయపర్వమున వసించునది.
శ్లోకం 96
[<small>మార్చు</small>]- సుముఖీ - మంగళకరమైన ముఖము కలది.
- నళినీ - నాళము గలిగినది.
- సుభ్రూః - శుభప్రధమైన కనుబొమలు కలిగినది.
- శోభనా - సౌందర్యశోభ కలిగినది.
- సురనాయికా - దేవతలకు నాయకురాలు.
- కాలకంఠీ - నల్లని కంఠము గలది.
- కాంతిమతీ - ప్రకాశవంతమైన శరీరము కలది.
- క్షోభిణీ - క్షోభింపచేయునది అనగా మథించునది.
- సూక్ష్మరూపిణీ - సూక్ష్మశక్తి స్వరూపిణి.
శ్లోకం 97
[<small>మార్చు</small>]- వజ్రేశ్వరీ - వజ్రేశ్వరీ నామంగల ఒక అతిరహస్యశక్తి.
- వామదేవీ - అందముగా నున్న దేవత.
- వయోవస్థావివర్జితా - వయస్సు యొక్క ప్రభావం గాని అవస్థా ప్రభావం గాని లేనిది.
- సిద్ధేశ్వరీ - సిద్ధులకు అధికారిణి.
- సిద్ధవిద్యా - సిద్ధిని ప్రసాదించు విద్యారూపిణి.
- సిద్ధమాతా - సిద్ధులకు తల్లి, సిద్ధులను కొలుచునది.
- యశస్వినీ - యశస్సంపన్నురాలు అనగా కీర్తిమంతురాలు.
శ్లోకం 98
[<small>మార్చు</small>]- విశుద్ధి చక్రనిలయా - విశుద్ధి చక్రములో వసించునది.
- ఆరక్తవర్ణా - రక్తవర్ణములో నుండునది.
- త్రిలోచనా - మూడు లోచనములు కలది.
- ఖట్వంగాది ప్రహరణా - ఖట్వాంగాది ఆయుధములు ధరించునది.
- వదనైక సమన్వితా - ఒకే ఒక నోటితో సమన్వయింపబడిన రూపము గలది.
శ్లోకం 99
[<small>మార్చు</small>]- పాయసాన్న ప్రియా - పాయసాన్నములో ప్రీతి గలది.
- త్వక్ స్థా - చర్మధాతువును ఆశ్రయించి ఉండునది.
- పశులోక భయంకరీ - పశుప్రవృత్తికి భయమును కలుగచేయునది.
- అమృతాది మహాశక్తి సంవృతా - అమృతా మొదలైన మహాశక్తులచేత పరివేష్టింపబడి యుండునది.
- ఢాకినీశ్వరీ - ఢాకినీ అని పేరుగల విశుద్ధి చక్రాధిష్టాన దేవత.
శ్లోకం 100
[<small>మార్చు</small>]- అనాహతాబ్జ నిలయా - అనాహత పద్మములో వసించునది.
- శ్యామభా - శ్యామల వర్ణములో వెలుగొందునది.
- వదనద్వయా - రెండు వదనములు కలది.
- దంష్ట్రోజ్వలా - కోరలతో ప్రకాశించునది.
- అక్ష్మమాలాదిధరా - అక్షమాల మొదలగు వాటిని ధరించి యుండునది.
- రుధిర సంస్థితా - రక్త ధాతువును ఆశ్రయించి ఉండునది.
శ్లోకం 101
[<small>మార్చు</small>]- కాళరాత్ర్యాది శక్త్వౌఘవృతా - కాళరాత్రి మొదలైన పన్నెండి మంది శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది.
- స్నిగ్థౌదన ప్రియా - నేతితో తడిపిన అన్నములో ప్రీతి కలది.
- మహావీరేంద్ర వరదా - శ్రేష్ఠులైన ఉపాసకులకు అవసరమైన వన్నీ సమకూర్చునది.
- రాకిణ్యంబా స్వరూపిణీ - రాకిణీ దేవతా స్వరూపిణి.
శ్లోకం 102
[<small>మార్చు</small>]- మణిపూరాబ్జనిలయా - మణిపూర పద్మములో వసించునది.
- వదనత్రయ సంయుతా - మూడు ముఖములతో కూడి యుండునది.
- వజ్రాదికాయుధోపేతా - వజ్రం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది.
- డామర్యాదిభిరావృతా - డామరము, ఆదిభి మొదలైన శక్తి దేవతలచే పరివేష్టింపబడి యుండునది.
శ్లోకం 103
[<small>మార్చు</small>]- రక్తవర్ణా - ఎర్రని రక్త వర్ణంలో ఉండునది.
- మాంసనిష్ఠా - మాంస ధాతువును ఆశ్రయించి ఉండునది.
- గుడాన్నప్రీతమానసా - గుడాన్నములో ప్రీతి కలది.
- సమస్త భక్త సుఖదా - అన్ని రకముల భక్తులకు అవసరమైన సుఖసంతోషాలను ప్రసాదించునది.
- లాకిన్యంబా స్వరూపిణీ - లాకినీ దేవతా స్వరూపముగా నున్నది.