అనుబంధం:లలితా సహస్ర నామములు/601-700
స్వరూపం
ఈ పేజీ ఏ ఇతర పేజీ లింక్ లేదు. ఈ పేజీకి ఒక లింక్ జోడించడం ద్వారా విక్షనరీ సహాయం చేయండి. |
లలితా సహస్రనామ స్తోత్రములోని ఏడవ నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.
శ్లోకం 121
[<small>మార్చు</small>]- దరాందోళితదీర్ఘాక్షీ - కొంచెముగా చలించు ఆకర్ణాంత విశాలమైన కన్నులు గలది.
- దరహాసోజ్జ్వలన్ముఖీ - మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది.
- గురుమూర్తిః - గురువు యొక్క రూపముగా నున్నది.
- గుణనిధిః - గుణములకు గని వంటిది.
- గోమాతా - గోవులకు తల్లి వంటిది.
- గుహజన్మభూః - కుమారస్వామి పుట్టుటకు తల్లి అయినది.
శ్లోకం 122
[<small>మార్చు</small>]- దేవేశీ - దేవతలకు పాలకురాలు.
- దండనీతిస్థా - దండనీతి శాస్త్రము లోని విషయములుగా ఉండునది.
- దహరాకాశరూపిణి - హృదయములో ఉండు చోటు రూపముగ ఉండునది.
- ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండల పూజితా - పాడ్యమి నుండి ముఖ్యమైన పౌర్ణమి వరకు ఉండు తిథివర్గముచే పూజింపబడునది.
శ్లోకం 123
[<small>మార్చు</small>]- కళాత్మికా - కళల యొక్క రూపమైనది.
- కళానాథా - కళలకు అధినాథురాలు.
- కావ్యాలాపవినోదినీ - కావ్యముల ఆలాపములో వినోదించునది.
- సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా - వింజామరలను కలిగియున్న ఎడమవైపున, కుడివైపున (వరుసగా) లక్ష్మీదేవి చేత, సరస్వతీదేవి చేత సేవింపబడునది.
శ్లోకం 124
[<small>మార్చు</small>]- ఆదిశక్తిః - ప్రథమముగా నున్న శక్తి స్వరూపిణి.
- అమేయా - కొలుచుటకు, గణించుటకు గాని, నిర్వహించుటకు గాని అలవికానిది.
- ఆత్మా - ఆత్మ స్వరూపిణి.
- పరమా - సర్వీత్కృష్టమైనది.
- పావనాకృతిః - పవిత్రమైన స్వరూపము గలది.
- అనేకకోటి బ్రహ్మాండజననీ - అనంతమైన సమూహములుగా నుండు బ్రహ్మాండములకు తల్లి.
- దివ్యవిగ్రహా - వెలుగుచుండు రూపము గలది.
శ్లోకం 125
[<small>మార్చు</small>]- క్లీంకారీ - ' క్లీం ' అను బీజాక్షరమునకు కారణభూతురాలు.
- కేవలా - ఒకే ఒక తత్వమును సూచించునది.
- గుహ్యా - రహస్యాతి రహస్యమైనది.
- కైవల్యపదదాయినీ - మోక్షస్థితిని ఇచ్చునది.
- త్రిపురా - మూడు పురములను కలిగి ఉంది.
- త్రిజగద్వంద్యా - మూడు లోకములచే పూజింపబడునది.
- త్రిమూర్తిః - త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, రుద్రుల రూపములో ఉండునది.
- త్రిదశేశ్వరీ - దేవతలకు ఈశ్వరి.
శ్లోకం 126
[<small>మార్చు</small>]- త్ర్యక్షరీ - మూడు అక్షరముల స్వరూపిణి.
- దివ్యగంధాడ్యా - దివ్యమైన పరిమళ ద్రవ్య గంధములచే ఒప్పునది.
- సిందూర తిలకాంచితా - పాపటయందు సిందూర తిలకముచే ప్రకాశించునది.
- ఉమా - ఉమా నామాన్వితురాలు.మూడు లోకములచే పూజింపబడునది.
- శైలేంద్రతనయా - హిమవత్పర్వతము యొక్క కుమార్తె.
- గౌరీ - గౌర వర్ణములో ఉండునది.
- గంధర్వసేవితా - గంధర్వులచేత పూజింపబడునది.
శ్లోకం 127
[<small>మార్చు</small>]- విశ్వగర్భా - విశ్వమును గర్భమునందు ధరించునది.
- స్వర్ణగర్భా - బంగారు గర్భము గలది.
- అవరదా - తనకు మించిన వరదాతలు లేనిది.
- వాగధీశ్వరీ - వాక్కునకు అధిదేవత.
- ధ్యానగమ్యా - ధ్యానము చేత పొందబడునది.
- అపరిచ్ఛేద్యా - విభజింప వీలులేనిది.
- జ్ఞానదా - జ్ఞానమును ఇచ్చునది.
- జ్ఞానవిగ్రహా - జ్ఞానమును మూర్తిగా దాల్చింది.
శ్లోకం 128
[<small>మార్చు</small>]- సర్వవేదాంత సంవేద్యా - అన్ని ఉపనిషత్తులచే చక్కగా తెలియబడునది.
- సత్యానంద స్వరూపిణీ - నిత్యసత్యమైన ఆనందమును స్వరూపముగా గలది.
- లోపాముద్రార్చితా - లోపాముద్రచే అర్చింపబడింది.
- లీలాక్లుప్త బ్రహ్మాండమండలా - క్రీడా వినోదానికై కల్పింపబడి క్లుప్తీకరింపబడే బ్రహ్మాండముల సమూహము గలది.
శ్లోకం 129
[<small>మార్చు</small>]- అదృశ్యా - చూడబడనిది.
- దృశ్యరహితా - చూడబడుటకు వేరే ఏమీలేని స్థితిలో ఉండునది.
- విజ్ఞాత్రీ - విజ్ఞానమును కలిగించునది.
- వేద్యవర్జితా - తెలుసుకొనబడవలసినది ఏమీ లేనిది.
- యోగినీ - యోగముతో కూడి ఉంది.
- యోగదా - యోగమును ఇచ్చునది.
- యోగ్యా - యోగ్యమైనది.
- యోగానందా - యోగముల వలన పొందు ఆనంద స్వరూపిణి.
- యుగంధరా - జంటను ధరించునది.
శ్లోకం 130
[<small>మార్చు</small>]- ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ - స్వేచ్ఛాసంకల్పశక్తి, జ్ఞానకారకమైన శక్తి, కార్యాచరణ శక్తుల స్వరూపిణిగా ఉంది.
- సర్వాధారా - సమస్తమునకు ఆధారమైనది.
- సుప్రతిష్ఠా - చక్కగా స్థాపించుకొనినది.
- సదసద్రూపధారిణీ - వ్యక్తమైనదిగాను, వ్యక్తముకాని దానిగాను రూపమును ధరించునది.