అబ్రకదబ్ర

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పాశ్చాత్యదేశాల ఐంద్రజాలికులు వాడే పదం. భారతదేశంలో మంత్రాలు పెట్టేవాళ్ళు ‘‘హ్రాం... హ్రీం’’ లాంటి శబ్దాలు వాడినట్లు ఇంగ్లీషువారు ‘‘అబ్రకదబ్ర ... అబ్రకదబ్ర’’ అంటూ ఒక వస్తువును మాయం చేయడమో, సృష్టించడమో లాంటి ఇంద్రజాల విద్యలు ప్రదర్శిస్తుంటారు. జబ్బులు నయం చేయడానికి కూడా ఇదే పదాన్ని మంత్రంలాగా వాడుతుంటారు. క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో రోమును పరిపాలించిన సెవిరస్‌ చక్రవర్తి బ్రిటన్‌ మీదకు దాడి వెడలినప్పుడు, ఆయన వెంట ఉన్న క్వింటస్‌ సెరినస్‌ అనే వైద్యుడు జ్వరం తగ్గడానికి ‘‘అబ్రకదబ్ర’’ మంత్రాన్ని వాడినట్టు అధారాలు ఉన్నాయి. ఈ అక్షరాలను ఉపయోగించి తాయెత్తు తయారు చేశారట. అందుకు ఒక పద్ధతి ఉంది. ఇంగ్లీషులో ఉన్న ఈ అక్షరాలన్నింటినీ ఒక వరుసలో పేర్చి, తరువాత పంక్తిలో మొదటి అక్షరాన్ని, చివరి అక్షరాన్ని తీసేసి, రెండవ అక్షరం కింది నుంచి మొదలు పెట్టి వ్రాయాలి. అలా మూడవ పంక్తిలో మరో మొదటి అక్షరాన్ని చివరి అక్షరాన్ని తొలగించి వ్రాయాలి. ఇలా ఒక్కొక్క పంక్తిలో మొదటి, చివరి అక్షరాలను తీసేస్తూ పంక్తులు వ్రాస్తే చివరి పంక్తిలో ‘ఎ’ అనే అక్షరం మాత్రమే మిగులుతుంది. మొత్తం పదకొండు పంక్తులు వ్రాస్తే అది బోర్లించిన త్రిభుజం ఆకారంలో కనిపిస్తుంది. ఈ మంత్రం వ్రాసిన చీటీని నార తాడుతో తాయెత్తుగా మెడలో కట్టి తొమ్మిదవ రోజున బుజం మీదుగా తూర్పు వైపు ప్రవహించే నదిలో పారేయిస్తారు. బోర్లా ఉంచిన త్రిభుజంలో ఎలా పంక్తి పొడవు తగ్గిపోతూ వచ్చిందో అలా జ్వరం లాంటి అనారోగ్యాలు తగ్గుతాయని ఒక విశ్వాసం ఆ కాలంలో నెలకొన్నది. తరువాత ఇంకా అనేక పరిణామాలకు లోనై ఇప్పుడది ‘మాజిక్‌’ కోసం వాడే పదంగా ప్రచారంలో ఉంది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]