ఆకాశరాజు
Jump to navigation
Jump to search
ఇతర భాషల పదములు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- హిందూపురాణాల ప్రకారం ఈతని కుమార్తె పద్మావతి.
- ఆకాశరాజు పద్మావతికి తండ్రి. శ్రీ వేంకటేశ్వరుని మామగారు. ద్వాపర యుగాంతమున భారత యుద్ధము జరిగిన తరువాత విక్రమార్కుడు మొదలైన రాజుల తరువాత సువీరుడను చంద్ర వంశానికి చెందిన రాజు జన్మించెను. అతని పుత్రుడగు సుధర్ముని కుమారులు ఆకాశుడు, తొండమానుడు. ఆకాశరాజుకు చాలకాలము వరకు సంతానము కలుగలేదు. గురువుల ఆనతి మీద యజ్ఞార్ధము భూమిని శుభ్రము చేసి కర్షణము చేయుచుండగా సహస్రపత్రముల కమలము నందు స్త్రీశిశువు కనబడెను. పద్మము నందు జన్మించినందువల్ల ఆమెకు 'పద్మావతి' అని నామకరణము చేసి కన్నకూతురు వలె పెంచుకొనుచుండెను. తరువాత అతనికి వసుదాత అను పుత్రుడు కలిగెను.
పద్మావతి దినదిన ప్రవర్ధమానయై యౌవనవతి అయినది. ఒకనాడు ఉద్యానవనంలో శ్రీనివాసుని చూసి, మాట్లాడి, నారదుని, వకుళాదేవిని కలుసుకొనెను. ఆకాశరాజు ఎరుకలసాని జోస్యం విని, బృహస్పతిని, శుకమునిని సంప్రదించి పద్మావతిని శ్రీనివాసునికి కన్యాదానమిచ్చెను.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు