ఆనందమయ కోశం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]స్వరూపజ్ఞానం ఆనందమయ కోశమన్నారు. (స్వరూపాజ్ఞానమానందమయ కోశః-పైంగలం ఉపనిషత్తు) సంతోషం త్రివిధాలు. అవి ప్రియం, మోదం, ప్రమోదం. ప్రియమైనవి కనిపించడం సంతోషం. అప్పుడు లభించేది మోదం. అనుభవించేది ప్రమోదం. ‘‘ఈ మూడు కూడి ఏర్పడినది ఆనందమయకోశం. ఇదే కారణ శరీరం’’. వ్యష్టి ఆనందమయకోశమున కలిగిన ఆనందం, విషాదం పరమేష్ఠి ఆనందమయ కోశంలో స్పందన కలిగించి, దానికి కారణభూతులైన వారిని చేరుతాయి. అన్న దానంతో తృప్తి పొందినవాని సంతోషం కానీ, కష్టం కలిగినవాని ఉసురు కానీ పరమేష్ఠి ఆనందమయ కోశమున స్పందించి అన్నదాతకు ఆనంద భోగాలను, కష్టాలు కలిగించిన దురాత్మునకు కష్టాలను కలిగిస్తాడు...’’ అని శ్రీమిత్తింటి వెంకట్రావు తమ ‘ఉపనిషద్వాణి’ గ్రంథంలో వ్రాశారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు