Jump to content

ఆళ్వారులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఆళ్వారులు అంటే లోతులను చూసిన వారని అర్థం. దేని లోతులను అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. సత్యం లోతులను, ఆనందం లోతులను అని అర్థం చేసుకోవాలని పెద్దల మాట. విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన ఆచార్యత్రయం అంటే శ్రీనాథముని, యామునాచార్యులు, రామానుజాచార్యులు ఆళ్వారుల వల్ల ప్రభావితులైన వారే. (ఆచార్య త్రయాన్ని మునిత్రయం అని కూడా అంటారు.) ఆళ్వారులు స్పష్టంగా ఫలానా కాలం వారని చెప్పడానికి ఆధారాలు లేవు. కాని, నిస్సందేహంగా ఆచార్య త్రయానికి ముందువారే. ఆచార్యత్రయంలో మొదటి వారైన శ్రీనాథముని క్రీ॥ శ॥ 824లో జన్మించిన వారు. ఆళ్వారులు అంతకు ముందువారే గాని అందులో కొందరు క్రీస్తుకు పూర్వం వారా అనే విషయంలో భిన్నా భిప్రాయాలు ఉన్నాయి. ఆళ్వారులు విష్ణుభక్తిలో పారవశ్యం చెందిన వారు. విష్ణువును గురించి సంస్కృతంలోనూ, తమిళంలోనూ స్తోత్రాలు రచించారు. తమిళంలో రచించిన స్తోత్రాలను ‘పాశురాలు’ అంటారు. పాశురాల సంకలనాన్ని ద్రావిడ వేదం అన్నారు. ఆళ్వారులు పదిమంది అని ఒక వాదం, పన్నెండు మంది అని మరో వాదం ఉంది. పన్నెండుమంది అనే వాదమే లోకంలో స్థిరపడిరది. ‘పన్నిద్దరాళ్వారులు’ అనే పదబంధం వాడుకలో ఉంది. ‘భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ, శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్‌ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్‌ శ్రీ మత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యమ్‌’’ అని పరాశర భట్టర్‌ రచించిన శ్లోకం ఆధారంగా ఆళ్వారులు పదిమందే. కాని, ఇందులో పదాలను చీల్చి శ్రీ అనే శబ్దానికి ఆండాళ్‌ అనీ, యతీంద్ర మిశ్రాన్‌ అనే పదబంధాన్ని రెండుగా చేసి, మిశ్రాన్‌ను మధురకవిగా మార్చినందువల్ల ఆళ్వారులు పన్నిద్దరైనారు. పదుగురి పేర్లివి: 1. భూత ఆళ్వారు (పూదత్త ఆళ్వారు అని వాడుక. కౌమోదకి అనే విష్ణు ఆయుధం గద అంశంతో జన్మించాడని ఐతిహ్యం), 2. పొయగై ఆళ్వారు. పాంచజన్యం అనే శంఖం అంశ. సరోయోగ అని కూడా అంటారు). 3. పేయాళ్వార్‌ (మహదాహ్వయ ఆళ్వారు అని వాడుక. నందకం అనే ఖడ్గం అంశ). 4. తిరుమళిశై ఆళ్వారు (భక్తిసార ఆళ్వారు. సుదర్శన చక్రం అంశ). 5. కులశేఖ రాళ్వారు (కౌస్తుభమణి అంశ). 6. తొందర డిప్పొడి ఆళ్వారు (విప్ర నారాయణుడిగా ప్రసిద్ధి. తులసీదళాలు, పుష్పాలతో కూర్చిన వైజయంతీమాల/ వనమాల అంశ. ఇది ఎన్నటికీ వాడని హారమని విశ్వాసం). 7. తిరుప్పాణి ఆళ్వారు (యోగి వాహన ఆళ్వారు. ఇతడు పంచముడిగా జన్మించాడని అంటారు.) విష్ణువు వక్షస్థలంపై ఉండే శ్రీవత్స లాంఛనం అనే పుట్టుమచ్చ అంశ.), 8. తిరుమంగై ఆళ్వారు (పరకాల ఆళ్వారు. క్షత్రియుడిగా జననం. విష్ణువు ఆయుధం శార ఙ్గం అంశం). 9. పెరియాళ్వారు (భట్టనాథ ఆళ్వారు. ఇతడినీ విష్ణుచిత్తుడని కూడా అన్నారు. వైకుంఠంలోని విష్ణువు రథం అంశ. 10. నమ్మాళ్వారు (పరాంకుశ ఆళ్వారు. విష్వక్సేనుడి అంశ. శూద్రులలో గీత కార్మిక కులంలో జననం.) ఈ పదిమందిగాక ఆండాళును, మధురకవిని కూడా ఆళ్వారులన్నారు. పరాశరు భట్టరు శ్లోకంలో శ్రీ అంటే ఆండాళు అని వ్యాఖ్యాతలు అర్థం చెప్పారు. గోదాదేవిగా ఆమె ప్రసిద్ధురాలు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశ అంటారు. పెరియాళ్వారుకు చెందిన తులసివనంలో ఆమె శిశువుగా కనిపించినదని గాథ. కనుక ఆయనే ఆమెకు తండ్రి అని వ్యవహరిస్తారు. మిశ్రాన్‌ శబ్దం ఆధారంగా వ్యవహారంలోకి వచ్చిన మధురకవి బ్రాహ్మణ కులజుడు. గరుడాంశగా చెపుతారు. భట్టరు శ్లోకంలోని యతీంద్ర పదానికి రామానుజుడని అర్థం చెప్పిన వారున్నారు. కాని, ఇది ఎక్కువ మందికి ఆమోదయోగ్యం కాలేదు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]