ఇన్‌స్క్రిప్టు
ఇన్‌స్క్రిప్టు (Inscript) అనే పదం ఆంగ్లంలోని ఇండియన్ స్క్రిప్టు (Indian Script) నుండి వచ్చింది. ఈ కీ బోర్డు అమరికను భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్సు విభాగం (Department of Electronics) 1986లో తయారు చేసింది[1]. ఈ కీ బోర్డు అమరికలో, భారతదేశంలోని అన్ని భాషల అక్షరాలు అమర్చి ఉంటాయి. అయితే ఈ అక్షరాలనన్నిటినీ ఐఐఎస్‌సిఐ (IISCI) అనే ఒక ప్రామాణికంలో నిర్వచించారు. అంతేకాదు భారతీయ భాషలలో అతిత్వరగా టైపు చేయగలిగేటట్లు ఈ అమరికను తయారు చేసారు. భారతీయ అక్షరాలలో ఉన్న స్వారూప్యత వలన ఒక్క భారతీయ భాషలో టైపు చేయడం నేర్చుకుంటే మిగతా భాషలలో కూడా టైపు చేయడం సులువుగా ఉంటుంది.
QWERTY కీ బోర్డు తో దీనిని వాడవచ్చు. ఎడమవైపున ఇంగ్లిషు అక్షరాలు కుడివైపున ఇన్‌స్క్రిప్టు అక్షరాలు గల ఓవర్ లే వాడాలి.ఇన్స్క్రిప్ట్ తెలుగు ఓవర్ లే
విండోస్ లో సాధారణంగా Left ALT+Shift ని QWERTY నుండి ఇన్‌స్క్రిప్టు లోకి మారటానికి Toggle కీ గా వాడతారు. తాత్కాలికముగా ఒక ఇన్‌స్క్రిప్టుఅక్షరము టైపు చేయటానికి ALT+SPACE (IBM enhanced keyboard)లేక SYS-REQ (PC-AT 88 key keyboard) వాడతారు.
అన్ని భారతీయ భాషలని విశ్లేషించి, ఒకేలా వుండేలా ప్రామాణీకరించారు. దీనిలో ఎడమవైపు అచ్చులు కుడివైపు హల్లులు వున్నాయి. అచ్చుల కీ ల లో గుణింతాలు మామూలుగాను, షిఫ్ట్ తో అచ్చులుగాను వస్తాయి. హ్రస్వ అచ్చులు ప్రధాన వరుసలో, దీర్ఘ అచ్చులు పై వరుసలో వున్నాయి. 'd' కు మామూలుగా హలాంత్ (్ : న కార పొల్లు) వస్తుంది. దీనిని సంయుక్త అక్షరాలకు వాడతారు.
చాల హల్లులకి హలాంత్ చేర్చినపుడు, లేకహల్లులకి గుణింతాలు రాసేటప్పుడు, ఎడమచేతి వేళ్ళు,తరువాత కుడిచేతి వేళ్ళు వాడాల్సి రావటంతో త్వరగా టైపు చేయటం కుదురుతుంది.
హల్లుల కీలలో 5 వర్గాల మొదటి అక్షరాలు ప్రధాన వరుసలో వున్నాయి. షిఫ్ట్ తో వాటి రెండవ అక్షరాలు వస్తాయి. ముక్కుతో పలకని హల్లులను అ వర్గానికి దగ్గర కీ లలో ఇచ్చారు. ముక్కుతో పలికే హల్లులను ఎడమవైపు చివరి వరుసలో ఇచ్చారు. మిగతావి కుడివైపు ఇచ్చారు. పై వరుసలో ఎక్కువగా వాడే సంయుక్త అక్షరాలని ఇచ్చారు. ఇవి నొక్కినపుడు, వాటి మూల అక్షరాల సమూహము వస్తుంది.
టైపింగ్ ఉదాహరణలు
[<small>మార్చు</small>]సాధారణ అక్షరాలు, పదాలు
[<small>మార్చు</small>]- D=అ, E= ఆ, F= ఇ,... Q=ఔ
- h=ప,he=పా,hf= పి...hx=పం
- hd=ప్, hdj=ప్ర, hdje=ప్రా,... hdjx= ప్రాం
- hd/s=ప్యే, h-=పృ
పారిభాషిక పదాలు
[<small>మార్చు</small>]పారిభాషిక పదాలను తెలుగులిపిలో రాసేటప్పుడు ప్రత్యేక అక్షరాలు వాడితే చదవటానికి సులభంగా వుంటుంది.
- మామూలుగా కలిసి వచ్చే వాటిని విడదీయాలంటే (క్ష ను క్ ష్ గా) శూన్యవెడల్పువిరుపు (Zero Width Non Joiner(ZWNJ)) వాడాలి.
- ఒక హల్లు కి చాలా వత్తులు వచ్చే అవకాశం వుంది. అప్పుడు చదవటం కష్టమవుతుంది కాబట్టి, ఒకటి లేక రెండు వత్తులు వచ్చిన తరువాత ఖాళీ వాడి రాస్తాము . లేక ఉఛ్చారణకి దగ్గరగా మధ్యలోహాలాంతక్షరాలు విడివిడిగా రావాలనుకుంటే ZWNJ వాడి రాయాలి. ఉదా:సాఫ్ట్వేర్ ని సాఫ్ట్‌వేర్ గా.
- ఒక హల్లు కి చాలా వత్తులు వచ్చే అవకాశం వుంది. అప్పుడు చదవటం కష్టమవుతుంది కాబట్టి, ఒకటి లేక రెండు వత్తులు వచ్చిన తరువాత శూన్యవెడల్పుకలుపు (Zero Width Joiner (ZWJ)) వాడి రాయాలి. ఇది సాధారణంగా పారిభాషిక పదాలు హలాంతంలో వుండి వాటికి విభక్తులు చేర్చాల్సినప్పుడు ZWJ వాడవచ్చు. ఉదా:ఫైర్ఫాక్స్లో ని ఫైర్ఫాక్స్ లో
దీనికొరకు వివిధ నిర్వహణ వ్యవస్థలలో కోడ్ వివరాలు క్రింద ఇవ్వబడినవి.
- విండోస్
ZWJ=<Ctrl+Shift+1>,ZWNJ=<Ctrl+Shift+2> ,
- లినక్స్
ZWJ=Not available,ZWNJ=<shift+b>,
- ఉదా
- hwjdHekdmdna=పైర్ఫాక్స్లో
- meHd'bsjd=సాఫ్ట్వేర్
- kd<=క్ష
క్రింది దానిలో మీ కంప్యూటర్ వ్యవస్థ కి సరిపోలిన మీటలను <ZWNJ>,<ZWJ> కు బదులుగా నొక్కండి.
- hwjdHekdm d<ZWJ>na=ఫైర్ఫాక్స్ లో(మధ్యలో ఖాళీ లేకుండా వ స్తుంది)
- meHd'<ZWNJ> bsjd= సాఫ్ట్‌వేర్
- kd<ZWNJ><=క్ ష
మూలాలు
[<small>మార్చు</small>]
- ↑ భారతదేశంలో భాషల సాంకేతికతను అభివృద్ది కోసం తయారు చేసిన ప్రభుత్వ వెబ్‌సైటులో ఇన్‌స్క్రిప్టుపై ఒక వ్యాసం. సేకరించిన తేదీ: జూలై 13, 2007