ఇముడుకొను
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
దే.స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. ఇముడ్చుకొను.
- 2. దాచు.
- 3. పోషించు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఇముడు, పొందుపడు.= "వ. ...చెన్నగు చవికెల నిముడుకొన్న కన్నె సురపొన్న గున్నల..." కువల. ౪,ఆ. ౬౨. -స.క్రి.
- 1. ఇముడ్చుకొను.= "ఆ. గర్భమందుఁ గమలగర్భాండ శతముల, నిముడుకొని నటించు నీశ్వరేశ." భాగ. ౧,స్కం. ౧౮౧.
- 2. దాఁచు, మఱుగు పఱచు.= "క. ఆ వృద్ధ నారియును గరు, ణావిలమతి యగుచు నాభయార్త మృగాక్షిం, దా వెనుక నిముడుకొనుచుం, గావుము కావు మని వాని కరములు పట్టెన్." కళా. ౩,ఆ. ౧౧౮.
- 3. పోషించు, దగ్గఱ నుంచుకొని కాపాడు.= "సీ. ...కొన్నినాళ్లు, గీ. న న్నిముడుకొమ్ము కరుణ ననాథ ననిన." ప్రబోధ. ౫,ఆ. ౮౧.