ఉపాదాన
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వ్యామోహపడటం. పట్టుకొని వ్రేళ్లాడటం/ అతి ఆరాటం. అధిక తర తృష్ణ. ‘ఉపాదాన’ నాలుగు రకాలు. 1. కామ ఉపాదాన. ఇంద్రియ జనితమైన కోర్కెలకు లోబడటం/ ఇంద్రియ వశత్వం. 2. దిట్ఠూ పాదాన. ఏవో కొన్ని అభిప్రాయాలను ఏర్పరచుకొని వాటిని పట్టుకొని వేళ్లాడటం. ‘దానధర్మాలు నిరుపయోగం’, ‘మంచి పనికైనా చెడ్డ పనికైనా పుణ్యఫలమో, పాప ఫలమో ఉంటుందనుకోవడం సరికాదు’ మొదలైన అభిప్రాయలను ఏర్పరచుకొని వాటిని దృఢంగా నమ్ముకొని ఉండటం. 3. సీలబ్బతు పాదాన (పాళీ)/ శీలవ్రత-పరామర్శ (సంస్కృతం). నియమాలు, ఆచారాలు అంటూ వాటిని చాదస్తంగా పాటించడం. 4. అత్తవాదుపాదాన (పాళీ)/ ఆత్మవాద (సంస్కృతం). వైయక్తిక భావనను వదలలేక పోవడం. ప్రతీత్య సముత్పాదలోని పన్నెండు బంధాల పరంపరలో ఆత్మలో విశ్వాసం నుంచి బయట పడలేకపోవడం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు